Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

నేషనల్ కబడ్డీ ప్లేయర్‌ రోహిత్ భార్య ఉరేసుకుని ఆత్మహత్య

న్యూఢిల్లీ: జాతీయ కబడ్డీ ఆటగాడు రోహిత్‌ కుమార్ భార్య లలిత (27) ఆత్మహత్య చేసుకుంది. దక్షిణ ఢిల్లీలోని అశోక్‌ మొహల్లా నంగ్లోయ్‌ ప్రాంతంలోని తన తండ్రి నివాసంలో ఉరేసుకొని ఆమె ఆత్మహత్యకు పాల్పడింది. ఆరు నెలల క్రితం వీరి వివాహం జరిగింది. అయితే ఆమె ప్రస్తుతం తల్లిదండ్రుల వద్ద ఉంటున్నారు.

కాగా, ఒంటరిగా ఉండటంతో పాటు భర్తతో విభేదాల కారణంగానే ఆమె ఆత్మహత్యకు పాల్పడిందని పోలీసులు వెల్లడించారు. ఘటనా స్థలంలో ఆమె రాసిన సూసైడ్ నోట్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఇటీవల ఢిల్లీలో జరిగిన కబడ్డీ ప్రీమియర్‌ లీగ్‌ సందర్భంగా ఆటగాడైన తన భర్త రోహిత్‌ను చూసేందుకు వెళ్లగా జరిగిన పరిణామాలతో ఆమె తీవ్ర అసంతప్తికి లోనయ్యారు.

Wife of kabaddi player Rohit Kumar commits suicide

దీంతో తన భర్త ఆనందం కోసమే తాను ఆత్మహత్య చేసుకుంటున్నట్లు ఆమె లేఖలో పేర్కొన్నట్లు డీసీపీ విజయ్‌ కుమార్‌ తెలిపారు. భార్య ఆత్మహత్య చేసుకున్న విషయాన్ని రోహిత్‌కు పోలీసులు తెలియజేశామని, ప్రస్తుతం అతడు ముంబైలో ఉన్నాడని డీసీపీ పేర్కొన్నారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

కాగా ప్రో కబడ్డీ లీగ్‌ మూడవ ఎడిషన్‌లో రోహిత్ కుమార్ పాట్నా పైరేట్స్ తరుపున ఆడాడు. 2014లో అనూప్ కుమార్ తర్వాత ప్రో కబడ్డీ లీగ్‌లో అరంగేట్రంలోనే ఎంవీపీ అవార్డు అందుకున్న తొలి ప్లేయర్‌గా నిలిచాడు. రోహిత్ కుమార్ జనవరి 19, 1990లో హర్యానాలోని నిజాంపూర్ లో జన్మించాడు. క్రీడల విభాగంలో 2009లో ఇండియన్ నేవీలో ఉద్యోగంలో చేరాడు.

Story first published: Tuesday, November 14, 2017, 10:17 [IST]
Other articles published on Nov 14, 2017
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+