Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

Asian Games 2023: పాకిస్థాన్‌ను చిత్తు చేసిన భారత్!

హాంగ్జౌ: ఆసియా గేమ్స్ 2023లో భారత పురుషుల కబడ్డీ టీమ్ ఫైనల్‌కు దూసుకెళ్లింది. పాకిస్థాన్‌తో శుక్రవారం జరిగిన ఫైనల్లో భారత్ 61-14 తేడాతో దాయాదీ టీమ్‌ను చిత్తు చేసింది. ఆట ప్రారంభమైనప్పటి నుంచి పూర్తి ఆధిపత్యం చెలాయించిన భారత కబడ్డీ జట్టు.. అదిరిపోయే రైడింగ్.. కళ్లు చెదిరే డిఫెన్స్‌తో పాక్ ఆటగాళ్లను ముప్పు తిప్పలు పెట్టింది.

భారత జోరు ముందు పాకిస్థాన్ ఆటగాళ్లు నిలబడలేకపోయారు. ఏ దశలోనూ కనీస పోటీని ఇవ్వలేకపోయారు. ఈ టోర్నీలో భారత కబడ్డీ జట్టు ఓటమెరుగని టీమ్‌గా ఫైనల్‌కు దూసుకెళ్లింది. ఫైనల్లో విజయం సాధిస్తే స్వర్ణ పతకం దక్కనుండగా.. ఓడితే రజతంతో సరిపెట్టుకోవాల్సి ఉంటుంది.

 India Thrash Pakistan By 61-14 In Kabaddi

ఇక భారత మహిళల కబడ్డీ జట్టు కూడా ఫైనల్‌కు దూసుకెళ్లింది. నేపాల్‌తో జరిగిన సెమీఫైనల్ మ్యాచ్‌లో భారత మహిళల కబడ్డీ టీమ్ 61-17 తేడాతో ఘన విజయం సాధించింది. చైనీస్ తైపీ జట్టుతో శనివారం ఉదయం 7 గంటలకు ఫైనల్ మ్యాచ్ ఆడనుంది. ఈ మ్యాచ్‌లో గెలిస్తే స్వర్ణ పతకం భారత్ ఖాతాలో చేరనుంది. ఓడితే మాత్రం రజతంతో సరిపెట్టుకోవాల్సి ఉంటుంది.

ఇతర ఈవెంట్లలోనూ భారత అథ్లెట్లు మెరుగైన ఫలితాలు సాధించారు. ఉమెన్ రేగు సెపక్‌తక్రా పోటీల్లో భారత జట్టు కాంస్య పతకం గెలిచింది. శుక్రవారం జరిగిన సెమీఫైనల్లో భారత్ 0-2 తేడాతో థాయ్‌లాండ్ చేతిలో ఓటమిపాలైంది. భారత పురుషుల ఆర్చరీ రికర్వ్ టీమ్ ఈవెంట్‌లో భారత జట్టు ఫైనల్ దూసుకెళ్లెంది. అథాను దాస్, బీరాజ్, తుషార్‌లతో కూడిన భారత టీమ్ 5-3 తేడాతో బంగ్లాదేశ్‌ని ఓడించింది. శనివారం జరిగే ఫైనల్లో సౌత్ కొరియాతో భారత్ అమీతుమీ తేల్చుకోనుంది.

బ్యాడ్మింటన్ పురుషుల సింగిల్స్‌లో హెచ్‌ఎస్ ప్రణయ్ పోరాటం సెమీస్‌కే పరిమితమైంది. శుక్రవారం జరిగిన సెమీఫైనల్లో ప్రణయ్ 15-21, 9-21 తేడాతో చైనా షట్లర్ లి షిఫెండ్ చేతిలో ఓటమిపాలయ్యాడు. దాంతో అతనికి బ్రాంజ్ మెడల్ దక్కింది. రెజ్లింగ్‌లోనూ భారత్‌కు కాంస్య పతకాలే దక్కాయి. గోల్డ్ మెడల్ సాధిస్తారని భావించిన భజరంగ్ పూనియా, ఆమన్ సెహ్రావత్, సోనమ్, కిరణ్ సెమీ ఫైనల్లో ఓటమిపాలయ్యారు.

Story first published: Friday, October 6, 2023, 15:16 [IST]
Other articles published on Oct 6, 2023
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+