For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

PKL 2025: ఒకే రైడ్‌లో 6 పాయింట్స్.. చరిత్ర సృష్టించిన అజిత్ చౌహన్!(వీడియో)

ప్రొ కబడ్డీ లీగ్(పీకేఎల్) సీజన్ 12లో యూ ముంబా రైడర్ అజిత్ చౌహన్ చరిత్ర సృష్టించాడు. పీకేఎల్ 12 సీజన్‌‌లో ఇప్పటి వరకు ఒకే రైడ్‌లో 6 పాయింట్స్ సాధించిన తొలి ఆటగాడిగా అజిత్ చౌహన్ రికార్డుకెక్కాడు. శుక్రవారం వైజాగ్ వేదికగా బెంగళూరుతో జరిగిన మ్యాచ్‌లో అజిత్ చౌహన్ ఈ ఫీట్ సాధించాడు. 12 సీజన్ల పీకేఎల్ చరిత్రలో మాత్రం ఒకే రైడ్‌లో ప్రదీప్ నర్వాల్ 8 పాయింట్స్ సాధించాడు. పీకేఎల్ సీజన్ 5లో అతను హర్యానా స్టీలర్స్‌పై ఒకే రైడ్‌లో 8 పాయింట్స్ రాబట్టాడు.

అజిత్ చౌహన్ సిక్స్ పాయింట్స్ రైడ్‌కు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. ఈ మ్యాచ్‌లో అజిత్ చౌహన్ 13 రైడింగ్ పాయింట్స్‌తో బెంగళూరు బుల్స్ ఓటమిని శాసించాడు. దాంతో యు ముంబా 48-28 తేడాతో బెంగళూరు బుల్స్‌ను చిత్తు చేసింది. ఈ సీజన్‌లో యు ముంబాకు ఇది మూడో విజయం. అజిత్ చౌహన్‌కు తోడుగా సతీష్ కన్నన్(6), రింకూ(5) రాణించారు. బెంగళూరు బుల్స్‌లో ఆషిష్ మాలిక్(6), అలీ రేజా(6) టాప్ స్కోరర్లుగా నిలిచారు.

Ajit Chauhan Creates History with Stunning 6-Point Raid in U Mumba vs Bengaluru Bulls PKL Season 12

ఈ మ్యాచ్‌ను బెంగళూరు 2-0తో ప్రారంభించినా.. యు ముంబా విజృంభించింది. వరుస పాయింట్స్‌తో దూసుకెళ్లింది. ఫస్టాఫ్ ముగిసే సమయానికి 13-5తో ఆధిక్యంలో నిలిచింది. విరామం తర్వాత బెంగళూరును ఆలౌట్ చేసిన యు ముంబా.. అదే జోరును కొనసాగించి విజయాన్ని కైవసం చేసుకుంది.

హర్యానా విజయం..

మరో మ్యాచ్‌లో హర్యానా స్టీలర్స్ 37-32 తేడాతో యూపీ యోధాస్‌ను ఓడించింది. నవీన్ కుమార్(6), రాహుల్(5), రాహుల్ అహ్రీ(6) హర్యానా విజయంలో కీలక పాత్ర పోషించారు. యూపీ యోధాస్‌లో గగన్ గౌడ(13) రాణించినా ఫలితం లేకపోయింది. ఈ మ్యాచ్ ఆరంభంలో దుమ్మురేపిన యూపీ యోధాస్ 17-12 తేడాతో ఆధిక్యంలో నిలిచింది. కానీ సెకండాఫ్‌లో పుంజుకున్న హర్యానా.. రైడింగ్, ట్యాక్లింగ్‌లో సత్తా చాటి ప్రత్యర్థిని మట్టికరిపించింది.

నేటి మ్యాచ్‌లు..

పట్నా పైరేట్స్ వర్సెస్ బెంగళూరు బుల్స్(రాత్రి 8 గంటలకు)

తమిళ్ తలైవాస్ వర్సెస్ గుజరాత్ జెయింట్స్ (రాత్రి 9 గంటలకు)

Story first published: Saturday, September 6, 2025, 9:54 [IST]
Other articles published on Sep 6, 2025
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+