Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

IND vs PAK:హార్దిక్ ఆల్‌రౌండ్‌షో.. ఉత్కంఠ మ్యాచ్‌లో పాక్‌పై భారత్ విజయం!

IND vs PAK: Hardik Pandya stars with bat and ball as India beat Pakistan in thriller

దుబాయ్: ఆసియాకప్‌లో టీమిండియా శుభారంభం చేసింది. చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్‌‌తో ఉత్కంఠగా సాగిన మ్యాచ్‌లో భారత్ 5 వికెట్ల తేడాతో గెలుపొందింది. ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన పాకిస్థాన్ 19.5 ఓవర్లలో 147 పరుగులకు కుప్పకూలింది. మహమ్మద్ రిజ్వాన్(43), షానవాజ్ దహాని(16) మినహా అంతా విఫలమయ్యారు. భారత బౌలర్లలో భువనేశ్వకుమార్ నాలుగు వికెట్లు తీయగా.. హార్దిక్ పాండ్యా 3 వికెట్లతో పాక్ పతనాన్ని శాసించాడు. అర్ష్‌దీప్ సింగ్ రెండు వికెట్లు తీయగా..ఆవేశ్ ఖాన్‌కు ఓ వికెట్ దక్కింది.

అనంతరం లక్ష్యచేధనకు దిగిన భారత్ 19.4 ఓవర్లలో 148 పరుగులు చేసి గెలుపొందింది. బౌలింగ్‌లో మెరిసిన హార్దిక్ పాండ్యా(17 బంతుల్లో 4 ఫోర్లు, సిక్స్‌తో 33 నాటౌట్) బ్యాటింగ్‌లోనూ సత్తా చాటాడు. అతనికి అండగా విరాట్ కోహ్లీ(35), రవీంద్ర జడేజా(35) రాణించారు.

 రాహుల్ గోల్డెన్ డక్..

రాహుల్ గోల్డెన్ డక్..

148 పరుగుల స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన భారత జట్టుకు ఆదిలోనే గట్టి షాక్ తగిలింది. ఇన్నింగ్స్ ఫస్ట్ ఓవర్ రెండో బంతికే కేఎల్ రాహుల్(0) క్లీన్ బౌల్డ్ అయ్యాడు. అరంగేట్ర పేసర్ నసీర్ షా బౌలింగ్‌లో రాహుల్ గోల్డెన్‌ డక్‌గా వెనుదిరిగాడు. ఇక ఆ మరుసటి బంతికే విరాట్ కోహ్లీ ఇచ్చిన క్యాచ్‌ను మహమ్మద్ రిజ్వాన్ నేలపాలు చేశాడు. దాంతో భారత అభిమానులు ఊపిరి పీల్చుకున్నారు. అయితే రాహుల్ వికెట్‌తో భారత ఆటగాళ్లు ఆత్మరక్షణలో పడిపోయారు. ఎక్కువ స్ట్రైక్ తీసుకున్న విరాట్ కోహ్లీ డబుల్స్‌తో ఆచితూచి ఆడాడు. హారిస్ రౌఫ్ బౌలింగ్‌లో సిక్స్ బాదిన విరాట్ కోహ్లీ టచ్‌లోకి వచ్చాడు. ఇక హారిస్ రౌఫ్ వేసిన 6వ ఓవర్‌లో కోహ్లీ, రోహిత్ చెరొక బౌండరీ కొట్టడంతో భారత్ పవర్ ప్లేలో వికెట్ నష్టానికి 38 పరుగులు చేసింది.

దెబ్బతీసిన నవాజ్..

దెబ్బతీసిన నవాజ్..

ఆ తర్వాత ధాటిగా ఆడే ప్రయత్నం చేసిన ఈ ద్వయం విఫలమైంది. మహమ్మద్ నవాజ్ బౌలింగ్‌లో భారీ సిక్స్ బాదిన రోహిత్(12).. అదే జోరులో మరో సిక్సర్ కొట్టబోయి క్యాచ్ ఔటయ్యాడు. అనంతరం జడేజా క్రీజులోకి రాగా.. కోహ్లీ భారీ షాట్ ఆడే ప్రయత్నంలో విఫలమయ్యాడు. అదే నవాజ్ బౌలింగ్‌లో క్యాచ్ ఔటయ్యాడు. ఆ వెంటనే జడేజా భారీ సిక్సర్ బాది కాస్త ఒత్తిడి తగ్గించాడు. సూర్యతో కలిసి ఆచూతూచి ఆడిన జడేజా మరో వికెట్ పడకుండా జాగ్రత్త పడ్డాడు.

అయితే బౌండరీలు ఎక్కువ రాకపోవడంతో రిక్వైర్డ్ రన్ రేట్ పెరుగుతుండటంతో సూర్య ధాటిగా ఆడే ప్రయత్నం చేశాడు. కానీ నసీమ్ షా బౌలింగ్‌లో క్లీన్ బౌల్డ్ అయ్యాడు. దాంతో మ్యాచ్ క్లిష్టంగా మారింది. క్రీజులోకి వచ్చిన హార్దిక్ పాండ్యా, జడేజా సింగిల్స్ తీస్తూ స్కోర్ బోర్డును పరుగెత్తించే ప్రయత్నం చేశారు. దాంతో చివరి 18 బంతుల్లో భారత్ విజయానికి 32 పరుగులు అవసరమయ్యాయి.

సిక్సర్‌తో విజయం..

సిక్సర్‌తో విజయం..

పాకిస్థాన్ స్లో ఓవర్ రేట్ కారణంగా సర్కిల్ బయట నలుగురు ఫీల్డర్లు మాత్రమే ఉండాల్సి వచ్చింది. ఈ అవకాశాన్ని భారత బ్యాటర్లు ఉపయోగించుకున్నారు. నసీమ్ షా వేసిన 18వ ఓవర్‌లో జడేజా బౌండరీ, సిక్సర్ కొట్టాడు. 19వ ఓవర్‌లో హార్దిక్ పాండ్యా మూడు బౌండరీలు బాదడంతో భారత్ విజయసమీకరణం 6 బంతుల్లో 7 పరుగులుగా మారింది. అయితే మహమ్మద్ నవాజ్ వేసిన తొలి బంతికి రవీంద్ర జడేజా క్లీన్ బౌల్డ్ అయ్యాడు. దాంతో మ్యాచ్ ఉత్కంఠగా మారింది. క్రీజులోకి వచ్చిన దినేశ్ కార్తీక్ సింగిల్ తీసి హార్దిక్ పాండ్యాకు స్ట్రైక్ ఇచ్చాడు. మూడో బంతిని హార్దిక్ డాట్ చేయడంతో మ్యాచ్ మరింత టెన్షన్‌కు గురిచేసింది. కానీ మరుసటి బంతినే హార్దిక్ సిక్సర్ బాది విజయ లాంఛనాన్ని పూర్తి చేశాడు.

Story first published: Monday, August 29, 2022, 0:09 [IST]
Other articles published on Aug 29, 2022
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+