న్యూజిలాండ్‌తో మూడు వన్డేల సిరీస్‌లో తొలి రెండు మ్యాచ్‌లకు దూరంగా ఉంచిన టీమిండియా స్టార్ పేసర్ అర్ష్‌దీప్ సింగ్‌ను ఆఖరి మ్యాచ్‌లోనైనా ఆడించాలని మాజీ క్రికెటర్ రవిచంద్రన్ అశ్విన్ అన్నాడు. హర్షిత్ రాణా, ప్రసిధ్ కృష్ణకు మ్యాచ్ ప్రాక్టీస్ అవసరమని అభిప్రాయం వ్యక్తం చేశాడు. ఈ సిరీస్‌లో ఇరు జట్లు చెరో మ్యాచ్ గెలిచాయి. మూడో వన్డే ఆదివారం ఇండోర్ వేదికగా జరగనుంది.
ఈ మ్యాచ్‌లో అర్ష్‌దీప్ సింగ్‌ను ఆడించాలని అశ్విన్ సూచించాడు. 'బౌలర్ల మధ్య తీవ్ర పోటీ ఉంది. ప్రసిధ్ కృష్ణ, హర్షిత్ రాణాకు మ్యాచ్ ప్రాక్టీస్ అవసరం. సౌతాఫ్రికాతో మ్యాచుల్లో అయితే హిట్ ది డెక్ బౌలర్ అవసరం. అయితే న్యూజిలాండ్‌తో ఆ ఫార్మూలా వర్కౌట్ కాదు. అందుకే అర్ష్‌దీప్ సింగ్‌ను తుది జట్టులో ఆడించాలి.

అతను ఇప్పటికే ఎంతో చేశాడు. కానీ ఇప్పటికీ అతను జట్టులో స్థానం కోసం పోరాడుతున్నాడు. ఇలా ప్రతిసారీ బౌలర్ల విషయంలోనూ జరుగుతోంది. బ్యాటర్ల విషయంలో మాత్రం కాదు. నేను అర్ష్‌దీప్ సింగ్‌కు ఎందుకు మద్దతుగా నిలుస్తున్నానంటే.. అతని చేతికి బంతి ఇచ్చిన ప్రతీసారి అద్భుత ప్రదర్శన చేస్తున్నాడు. అందుకే అతనికి తుది జట్టులో చోటు కల్పించాలని కోరుతున్నా. అతనికి ఆ అర్హత ఉంది. తొలి రెండు వన్డేల్లో అర్ష్‌దీప్ సింగ్‌ను ఎందుకు తప్పించారు. అది అతని ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీయదా?'అని అశ్విన్ ప్రశ్నించాడు.
మహమ్మద్ సిరాజ్ కోసం అర్ష్‌దీప్ సింగ్‌ను తుది జట్టులోకి తీసుకోలేదని టీమిండియా వన్డే కెప్టెన్ శుభ్‌మన్ గిల్ వివరణ ఇచ్చాడు. రొటేషన్ పాలసీలో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నామని చెప్పాడు.