Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

ఛాంపియన్‌గా భారత్.. భారీ నజరానా!

మహిళల ఆసియా ఛాంపియన్స్ ట్రోఫీ హాకీ టోర్నీలో డిఫెండింగ్ ఛాంపియన్ భారత్ విజేతగా నిలిచింది. బుధవారం జరిగిన మెగా ఫైనల్లో భారత్ 1-0తో పారిస్ ఒలింపిక్స్ సిల్వర్ మెడలిస్ట్ అయిన చైనాను ఓడించింది. భారత యువ స్ట్రైకర్ దీపిక్ సూపర్ గోల్‌తో భారత్‌కు విజయాన్నందించింది. 31వ నిమిషంలో లభించిన పెనాల్టీ కార్నర్‌ను సద్వినియోగం చేసుకున్న దీపిక్.. భారత్‌కు ఆధిక్యాన్ని అందించింది.

రివర్స్ హిట్ సాయంతో బంతిని గోల్ పోస్ట్‌లోకి తరలించింది. ఈ టోర్నీలో దీపిక మొత్తం 11 గోల్స్‌తో టాప్ స్కోరర్‌గా నిలిచింది. మరోవైపు స్కోర్ సమం చేయడానికి చైనా ఎంత ప్రయత్నించినా.. భారత్ రక్షణ శ్రేణిని ఛేదించలేకపోయింది.

Women s Asian Champions Trophy hockey 2024 India Beat China 1-0 To Win Record-Equalling 3rd Title

ఇక ఈ మ్యాచ్‌లో భారత్‌కు మొత్తం ఆరు పెనాల్టీ కార్నర్‌లు లభించగా ఒక్కదాన్ని మాత్రమే సద్వినియోగం చేసుకోగలిగింది. మరోవైపు చైనాకు రెండు పెనాల్టీ కార్నర్‌లు మాత్రమే లభించాయి. బంతిని పూర్తిగా తమ ఆధీనంలో ఉంచుకున్న భారత ఆటగాళ్లు పదేపదే డ్రాగన్ కంట్రీ గోల్ పోస్ట్‌పై దాడులు చేశారు. దాంతో చైనా ఆటగాళ్లు తప్పిదాలు చేయాల్సి వచ్చింది. అవి భారత్‌కు అవకాశంగా మారాయి.

లీగ్ దశలో భారత్ 3-0తో చైనాను ఓడించింది. ఫైనల్లోనూ అదే ప్రదర్శనను పునరావృతం చేసి మట్టికరిపించింది. భారత మహిళల జట్టుకు ఇది మూడో ఆసియా ఛాంపియన్స్ ట్రోఫీ. గతంలో 2016, 2023 టైటిళ్లను భారత మహిళల హాకీ టీమ్ గెలుచుకుంది. దాంతో ఛాంపియన్స్ ట్రోఫీ చరిత్రలోనే అత్యంత విజయవంతమైన జట్టుగా సౌత్ కొరియా సరసన నిలిచింది.

సౌత్ కొరియా కూడా మూడు టైటిళ్లు సాధించింది. మరోవైపు చైనా మూడో సారి రన్నరప్‌గా నిలిచింది. జపాన్ మూడో స్థానంతో సరిపెట్టుకుంది. కాంస్య పోరులో జపాన్ 4-1తో మలేసియాను ఓడించింది. ఆసియా ఛాంపియన్స్ ట్రోఫీ హాకీ టైటిల్ గెలిచిన భారత జట్టుకు బిహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ తలో రూ. 10 లక్షల నజరానా ప్రకటించారు.

సహాయ సిబ్బందికి ఒక్కొక్కరికి రూ. 5 లక్షలు అందజేస్తామని ఓ ప్రకటనలో పేర్కొన్నారు. అమ్మాయి సాధించిన ఈ విజయం దేశానికి గర్వకారణమని నితీశ్ కొనియాడాడు.

Story first published: Thursday, November 21, 2024, 9:31 [IST]
Other articles published on Nov 21, 2024
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+