Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

Hockey World Cup 2026: డ్రాతో గట్టెక్కిన భారత్.. ఇంగ్లండ్ ఔట్!

మహిళల హాకీ ప్రపంచకప్ 2026 టోర్నీలో భారత్ తదుపరి రౌండ్‌కు దూసుకెళ్లింది. పురుషుల టీమ్ తరహాలోనే తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో అద్వితీయమైన ప్రదర్శనతో డ్రాతో గట్టెక్కింది. గ్రూప్-డీలో భాగంగా గురువారం ఇంగ్లండ్‌తో జరిగిన తమ చివరి లీగ్ మ్యాచ్‌ను భారత్ 0-0‌తో డ్రా చేసుకుంది. ఇరు జట్లు హోరాహోరీగా తలపడటంతో ఒక్క గోల్ కూడా నమోదు కాలేదు.

చైనాతో మ్యాచ్‌ను డ్రా చేసుకున్న భారత్!

చైనాతో మ్యాచ్‌ను డ్రా చేసుకున్న భారత్!

ఉత్కంఠగా సాగిన ఈ మ్యాచ్‌లో ఇంగ్లండ్ పూర్తి ఆధిపత్యం చెలాయించింది. తొలి క్వార్టర్ మినహా మూడు క్వార్టర్స్‌లో ఆ జట్టు జోరు కనబర్చింది. కానీ భారత డిఫెన్స్ విభాగం అద్వితీయమైన ప్రదర్శనతో ఇంగ్లండ్‌ను నిలవరించింది. ముఖ్యంగా భారత్ గోల్ కీపర్ సవితా పునియా ఇంగ్లండ్ విజయానికి అడ్డుగోడలా నిలిచింది. దాదాపు ఆమె 10 గోల్స్ వరకు అడ్డుకుంది. ఈ మ్యాచ్‌లో ఇంగ్లండ్‌కు 12 పెనాల్టీ కార్నర్‌లు లభించగా.. భారత్‌కు 6 మాత్రమే లభించాయి. వ్యూహాత్మకంగా ఈ మ్యాచ్‌లో భారత్ పూర్తిగా డిఫెన్స్‌కే పరిమితమైంది. ఈ మ్యాచ్ డ్రా కావడంతో గ్రూప్-డీ నుంచి భారత్ తదుపరి రౌండ్‌కు అర్హత సాధించగా.. ఇంగ్లండ్ టోర్నీ నుంచి నిష్క్రమించింది.

Women s Hockey World Cup 2026 Savita Punia Helps India Qualify for Next Round After 0-0 Draw With England

హోరాహోరీగా..

మ్యాచ్ ఆరంభం నుంచి ఇరు జట్లు హోరాహోరీగా తలపడ్డాయి. రెండు జట్ల డిఫెన్స్ విభాగం బలంగా ఉండటంతో ఫస్టాఫ్‌లో ఒక్క గోల్ నమోదు కాలేదు. తొలి క్వార్టర్‌లో బంతిని పూర్తిగా తమ ఆధీనంలో ఉంచుకొని ప్రత్యర్థి గోల్ పోస్ట్‌పై దాడులు చేసిన భారత్‌కు మూడు పెనాల్టీ కార్నర్‌లు లభించాయి. కానీ వాటిని గోల్స్‌గా మల్చలేకపోయింది. మరోవైపు ఇంగ్లండ్‌కు ఒకే ఒక్క పెనాల్టీ కార్నర్ లభించగా.. భారత్ అడ్డుకుంది. 13వ నిమిషంలో ఇంగ్లండ్ ప్లేయర్ హమీల్టన్‌కు గ్రీన్ కార్డ్‌తో బయటకు వెళ్లిపోయింది.

రెండో క్వార్టర్‌లో ఇంగ్లండ్ జోరు కనబర్చింది. బంతిని తమ ఆధీనంలో ఉంచుకోవడంతో ఆ జట్టుకు మూడు పెనాల్టీ కార్నర్‌లు లభించాయి. కానీ భారత్ అడ్డుకుంది. భారత్‌కు ఒకే ఒక్క పెనాల్టీ కార్నర్ లభించగా.. గోల్ చేయలేకపోయింది. సెకండ్ క్వార్టర్ చివర్లో తీవ్రమైన ఫౌల్ చేసిన ఇంగ్లండ్ ప్లేయర్ హోవర్డ్ టెస్సాకు రిఫరీ ఎల్లో కార్డ్ జారీ చేశాడు.

Hockey World Cup 2026: పాకిస్థాన్‌పై భారత్ ఘన విజయం!

Also Read

Hockey World Cup 2026: పాకిస్థాన్‌పై భారత్ ఘన విజయం!

ఇంగ్లండ్‌దే ఆధిపత్యం..

మూడో క్వార్టర్ ఆరంభంలోనే భారత్‌కు పెనాల్టీ కార్నర్ లభించినా లాభం లేకపోయింది. 8వ నిమిషంలో ఇంగ్లండ్ ప్లేయర్‌ను భారత ప్లేయర్ ఢీ కొట్టడంతో ఇంగ్లండ్‌కు పెనాల్టీ కార్నర్ లభించగా.. భారత డిఫెండర్స్ అద్భుతంగా అడ్డుకున్నారు. ఆ వెంటనే ఇంగ్లండ్ ప్లేయర్ కొట్టిన షాట్‌ను భారత గోల్ కీపర్ సవితా అద్భుతంగా అడ్డుకుంది. 42వ నిమిషంలో చౌదరి ఇషాకాకు రిఫరీ గ్రీన్ కార్డ్ జారీ చేయగా.. ఇంగ్లండ్‌కు వరుసగా మూడు పెనాల్టీ కార్నర్‌లు లభించాయి. కానీ భారత గోల్ కీపర్ అద్భుతంగా అడ్డుకుంది. మూడో క్వార్టర్‌లో బంతి పూర్తిగా ఇంగ్లండ్ ఆధీనంలో ఉండటంతో ఆ జట్టుకు మొత్తం 5 పెనాల్టీ కార్నర్‌లు లభించాయి. కానీ భారత డిఫెన్స్ వాటిని నిలువరించడంతో గోల్స్ నమోదు కాలేదు.

ఆఖరి క్వార్టర్‌లోనూ ఇంగ్లండే ఆధిపత్యం చెలాయించింది. బంతిని తమ ఆధీనంలో ఉంచుకొని భారత్‌ డీ ఏరియాలోకి దూసుకొచ్చింది. దాంతో భారత ఆటగాళ్లు పౌల్ చేయడంతో ఇంగ్లండ్‌కు వరుసగా రెండు పెనాల్టీ కార్నర్‌లు లభించాయి. కానీ భారత్ డిఫెన్స్ విభాగం అద్భుతంగా అడ్డుకుంది. ఆట ఆఖరి నిమిషంలో ఇంగ్లండ్ ప్లేయర్ కొట్టిన షాట్‌ను భారత గోల్ కీపర్ అడ్డుకొని ఓటమిని తప్పించింది.

Story first published: Thursday, August 20, 2026, 20:21 [IST]
Other articles published on Aug 20, 2026
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+