
అంచనాలను పెంచిన విజయాలు..
మిడ్ ఫీల్డర్ మన్‌ప్రీత్ సింగ్ కెప్టెన్సీలోని భారత్ జట్టు నాలుగేళ్లుగా చేస్తున్న పెర్ఫామెన్స్‌లు కూడా ఇందుకు కారణం. 2017 ఆసియా కప్ గెలిచిన భారత్ 2018లో ఏషియన్ చాంపియన్‌షిప్స్ ట్రోఫీ సాధించింది. 2019 ఎఫ్‌ఐహెచ్ సిరీస్ ఫైనల్స్‌లోనూ గెలిచింది. అంతేకాక 2018 వరల్డ్‌కప్‌లో క్వార్టర్ ఫైనల్‌కు వచ్చింది. దీంతో టోక్యోలో ఫేవరెట్‌గా బరిలోకి దిగుతోంది. జట్టుగా భారత్ చాలా బలంగా ఉంది. కానీ మెగా ఈవెంట్‌కు ఎంపికైన 16 మంది ఆటగాళ్లలో 10 మందికి ఇదే తొలి ఒలింపిక్స్ కావడం బలహీనతగా చెప్పొచ్చు.

ఒత్తిడిని అధిగమిస్తే..
దీంతో కెరీర్‌లో మూడోసారి ఒలింపిక్స్ ఆడుతున్న కెప్టెన్ మన్‌ప్రీత్‌తో పాటు సీనియర్లు రూపిందర్ పాల్, సురేందర్ కుమార్, మన్‌దీప్ సింగ్.. జూనియర్లను మార్గనిర్దేశనం చేయ్యాల్సి ఉంది. జూనియర్లు ఒత్తిడిని అధిగమిస్తే భారత హాకీ జట్టు అంచనాలను అందుకోవడం దాదాపు ఖాయం. ఒలింపిక్స్ డిఫెండింగ్ చాంపియన్ అర్జెంటీనా.. ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, స్పెయిన్, జపాన్‌తో కలిసి భారత్ పూల్-ఎలో ఉంది.

అమ్మాయిలపై అంచనాల్లేవ్!
పురుషుల జట్టుతో పోలిస్తే భారత మహిళ హాకీ టీమ్ ఎలాంటి అంచనాల్లేకుండా టోక్యో ఒలింపిక్స్ బరిలోకి దిగుతోంది. పైగా భారత మహిళల టీమ్‌కు ఓవరాల్‌గా ఇది మూడో ఒలింపిక్స్. 36 ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత రియో ఒలింపిక్స్ ఆడిన భారత్.. టోక్యో గేమ్స్‌కు క్వాలిఫై అయ్యింది. దీంతో రియో కంటే మంచి ఫలితం సాధించాలని లక్ష్యంగా పెట్టుకుంది. అయితే, రాణీ రాంపాల్ కెప్టెన్సీలోని భారత టీమ్ ప్రదర్శన ఇటీవల ఆశించిన స్థాయిలో లేదు. జట్టు మొత్తం రాణీపైనే ఆధారపడటం అతి పెద్ద బలహీనత.
అయితే ప్రపంచకప్‌లో క్వార్టర్స్‌కు చేరడం, కామన్వెల్త్, ఏషియన్ గేమ్స్‌లో మంచి పెర్ఫామెన్స్‌లు చేయడంతో టోక్యోలోనూ జట్టు రాణిస్తుందని అంచనాలున్నాయి. నెదర్లాండ్స్, జర్మనీ, గ్రేట్ బ్రిటన్, ఐర్లాండ్, సౌతాఫ్రికతో కలిసి కఠినమైన గ్రూప్‌లో ఉన్న భారత్‌కు టోక్యోలో అతిపెద్ద సవాల్ ఎదురుకానుంది.

భారత హాకీ జట్లు
పురుషులు: హర్మన్‌ప్రీత్ సింగ్, రూపిందర్ సింగ్, సురేందర్ కుమార్, అమిత్, బిరేంద్ర (డిఫెండర్లు), హార్దిక్ సింగ్, మన్‌ప్రీత్ సింగ్ (కెప్టెన్), వివేక్ సాగర్, నీలకంఠ శర్మ, సుమిత్ (మిడ్‌ఫీల్డర్లు), షంషేర్ సింగ్, దిల్‌ప్రీత్ సింగ్, గుర్జాంత్ సింగ్, లలిత్ కుమార్, మన్‌దీప్ సింగ్ (ఫార్వర్డ్), పీఆర్ శ్రీజేష్ (గోల్‌కీపర్).
మహిళలు: గుర్జిత్ కౌర్, దీప్ గ్రేస్, నిక్కీ ప్రధాన్, ఉదిత (డిఫెండర్లు), మోనిక, నిశ, సుశీల, నవ్‌జోత్, సలీమ, నేహ (మిడ్‌ఫీల్డర్లు), రాణి రాంపాల్ (కెప్టెన్), షర్మిల, వందన, లాల్‌రెమ్‌సియామి, నవ్‌నీత్ (ఫార్వర్డ్), సవిత (గోల్‌కీపర్).


Click it and Unblock the Notifications












