
జర్మనీదే ఫస్ట్ గోల్..
గేమ్ ప్రారంభమైన రెండో నిమిషంలోనే జర్మనీ ప్లేయర్ టిముర్ ఒరుజ్ గోల్ సాధించి ఆధిక్యంలో నిలిపాడు. ఆ తర్వాత భారత్ ఆటగాళ్లపై ఆధిపత్యం చెలాయించినప్పటికీ జర్మనీ మరో గోల్ నమోదు చేయలేకపోయింది. చివరి నిమిషంలో ఆ జట్టుకు వరుసగా నాలుగు పెనాల్టీ కార్నర్స్ లభించాయి. కానీ వాటిని భారత డిఫెన్స్ సమర్థవంతంగా అడ్డుకుంది. ఇక రెండో క్వార్టర్‌లో భారత ఆటగాళ్లు ఆధిపత్యం చెలాయించారు. బంతిని పూర్తిగా తమ ఆధీనంలోనే ఉంచుకుంటూ ప్రత్యర్థి గోల్‌పోస్ట్‌లోకి పదే పదే దూసుకెళ్లే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలోనే 17వ నిమిషంలో సిమ్రన్‌జిత్ గోల్ కొట్టి భారత్ ఖాతా తెరిచాడు.

2 నిమిషాల వ్యవధిలో 2 గోల్స్
అనంతరం పుంజుకున్న జర్మనీ మరో 2 నిమిషాల వ్యవధిలోనే రెండు గోల్స్ కొట్టి ఆధిక్యాన్ని 3-1 డబుల్ చేసింది. ఆ తర్వాత జర్మనీ డిఫెన్సీవ్ తప్పిదాలు భారత్‌కు కలిసొచ్చాయి. వరుసగా లభించిన పెనాల్టీ కార్నర్స్‌ను హార్దిక్ సింగ్, హర్మన్‌ప్రీత్ సింగ్ గోల్స్‌మ్చడంతో సెకండ్ క్వార్డర్ 3-3తో ముగిసింది. మూడో క్వార్టర్‌లో భారత్ మరింత చెలరేగి ఆడింది. 31వ నిమిషంలో లభించిన పెనాల్టీ కార్నర్ రూపిందర్ పాల్ సింగ్ గోల్‌గా మల్చడంతో 4-3తో ఆధిక్యంలో దూసుకెళ్లింది. ఆ వెంటనే గుర్జంత్ సింగ్ ఇచ్చిన పాస్‌ను సిమ్రన్ జిత్ గోల్‌గా మలచడంతో భారత్ ఆధిక్యం 5-3తో డబుల్ అయింది. ఆ తర్వాత భారత్‌కు పలు అవకాశాలు దక్కినా సద్వినియోగం చేసుకోలేకపోయింది.

ఆఖరి క్షణంలో ఉత్కంఠ..
చివరి క్వార్టర్‌లోనూ ఇరు జట్లు హోరాహోరీగా తలపడ్డాయి. అయితే భారత రక్షణ శ్రేణి తప్పిదంతో లభించిన పెనాల్టీ కార్నర్‌ను జర్మనీ సద్వినియోగం చేసుకుంది. లుకాస్ విండ్ ఫెడర్ కొట్టిన గోల్‌ను కీపర్ శ్రీజేష్ అంచనా వేయలేక విఫలమయ్యాడు. దాంతో భారత ఆధిక్యం 5-4కు తగ్గింది. ఆ తర్వాత మరింత జోరు కనబర్చిన భారత్.. ప్రత్యర్థికి ఏ మాత్రం అవకాశం ఇవ్వలేదు. జర్మనీ కొట్టిన గోల్స్‌ను శ్రీజేష్ అడ్డుకున్నాడు. మరో 30 సెకన్లలో మ్యాచ్ ముగుస్తుందనంగా.. జర్మనీకి పెనాల్టీ కార్నర్ లభించింది. కానీ భారత డిఫెన్స్ విభాగం అడ్డుకోవడంతో విజయం లాంఛనమైంది.

మన్‌ప్రీత్ సేన జోరు సాగిందిలా..
ఇక టోక్యో ఒలింపిక్స్‌లో భారత జైత్రయాత్ర అద్భుతంగా సాగింది. ఆరంభ మ్యాచ్‌లో న్యూజిలాండ్‌ను 3-2తో ఓడించిన మన్‌ప్రీత్ సేన.. జర్మనీని 2-0తో, స్పెయిన్ 3-1తో, అర్జెంటీనాను 3-1తో జపాన్‌ను 5-3తో ఓడించి జోరు కనబర్చింది. కానీ వరల్డ్ నెంబర్ వన్ ఆస్ట్రేలియా చేతిలోనే 1-7తో చిత్తయింది. ఆ తర్వాత బెల్జియంతో జరిగిన సెమీఫైనల్లో 2-5తో ఓటమిపాలైంది. ఈ మ్యాచ్‌లో కూడా దాదాపు గెలుపు ముంగిట బోల్తా పడింది. చివరి క్వార్టర్‌లో చేతులెత్తేసింది.


Click it and Unblock the Notifications
