Junior Hockey World Cup 2021: విశ్వవిజేత అర్జెంటీనా.. భారత్‌కు కాంస్యమూ చేజారే!

భువనేశ్వర్: జూనియర్ హాకీ ప్రపంచకప్‌లో అర్జెంటీనా అదరగొట్టింది.. స్ఫూర్తిదాయక ప్రదర్శనతో విశ్వ విజేతగా నిలిచింది. ఆదివారం కళింగ స్టేడియం వేదికగా జరిగిన ఫైనల్లో అర్జెంటీనా 4-2 గోల్స్ తేడాతో ఆరుసార్లు చాంపియన్ జర్మనీకి షాకిచ్చింది. అర్జెంటీనా ఆటగాడు లటారో డొమెనె (10వ, 25వ, 50వ నిమిషాల్లో) హ్యాట్రిక్ గోల్స్ కొట్టి తన జట్టు విజయంలో కీలకపాత్ర పోషించాడు.
మరో గోల్‌ను ఫ్రాన్కో అగోస్టిని (60వ నిమిషం) సాధించాడు. జర్మనీ తరఫున జూలియస్ హేనర్ (36వ నిమిషం), మాస్ పంట్ (47వ నిమిషం) చెరో గోల్ చేశారు. 2005 తర్వాత ఈ టోర్నీలో టైటిల్ గెలవడం అర్జెంటీనాకు ఇదే తొలిసారి. ఓవరాల్‌గా అర్జెంటీనాకిది రెండో ప్రపంచ టైటిల్. గతంలో 2005లో తొలిసారి చాంపియన్‌గా నిలిచింది.
జూనియర్ హాకీ ప్రపంచకప్‌లో టైటిల్ నిలబెట్టుకోవడంలో విఫలమైన డిఫెండింగ్ చాంపియన్ యువ భారత్ కనీసం బ్రాంజ్ మెడల్ కూడా దక్కించుకోలేకపోయింది. మూడోస్థానం కోసం జరిగిన పోరులోనూ పరాజయం పాలైంది. ఆదివారం జరిగిన ప్లేఆఫ్ మ్యాచ్‌లో ఫ్రాన్స్ 3-1తో భారత్‌ను చిత్తుచేసి కాంస్య పతకం అందుకుంది.

ఫ్రాన్స్ కెప్టెన్ తిమోతి క్లెమెంట్ హ్యాట్రిక్ గోల్స్ (26వ, 34వ, 47వ)తో విజృంభించి తన జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. భారత జట్టులో ఏకైక గోల్‌ను సుదీప్ చిర్మాకో (42వ) నమోదు చేశాడు. టోర్నీ తొలి మ్యాచ్‌లో కూడా ఫ్రాన్స్ చేతిలో భారత్ ఓడిపోవడం గమనార్హం.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications