For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ప్చ్.. భారత్ ఓటమి! పారిస్ ఆశలు గల్లంతు!

రాంచీ: మహిళల హాకీ ఒలింపిక్ క్వాలిఫయింగ్ టోర్నీలో భారత జట్టుకు మరో ఓటమి ఎదురైంది. మూడో స్థానం కోసం జపాన్‌తో శుక్రవారం జరిగిన మ్యాచ్‌లో టీమిండియా 0-1 తేడాతో ఓటమిపాలైంది. పారిస్ ఒలింపిక్స్‌కు అర్హత సాధించాలంటే తప్పక గెలవాల్సిన ఈ మ్యాచ్‌లో టీమిండియా ఓటమిపాలైంది. దాంతో పారిస్ ఒలింపిక్స్ బరిలో నిలిచే అవకాశాన్ని చేజార్చుకుంది. దాంతో భారత ప్లేయర్లు కన్నీటి పర్యంతమయ్యారు.

మ్యాచ్ ప్రారంభంలోనే లభించిన పెనాల్టీ కార్నర్‌ను జపాన్ ప్లేయర్ గోల్‌గా మలిచి 1-0తో ఆధిక్యం సాధించింది. ఆ తర్వాత ఇరు జట్లు హోరాహోరీగా తలపడ్డాయి. సమం చేసేందుకు భారత్.. ఆధిక్యం పెంచేందుకు జపాన్ తీవ్రంగా శ్రమించాయి. చివరి వరకు ఒక్క గోల్ ఆధిక్యాన్ని అందుకున్న జపాన్ విజయం సాధించింది. దాంతో బ్రాంజ్ మెడల్ గెలుచుకోవడంతో పాటు పారిస్ ఒలింపిక్స్ బెర్త్‌ను ఖరారు చేసుకుంది.

Japan beat India 1-0 to book final berth for Paris 2024

జర్మనీతో గురువారం జరిగిన రెండో సెమీఫైనల్లో భారత్ షూటౌట్‌లో 3-4 గోల్స్ తేడాతో ఓడిపోయింది. ఈ గెలుపుతో జర్మనీ పారిస్ ఒలింపిక్స్‌కు అర్హత సాధించింది. తొలి సెమీఫైనల్లో అమెరికా 2-1తో జపాన్‌ను ఓడించి పారిస్ ఒలింపిక్స్ బెర్త్‌ను ఖరారు చేసుకుంది.

Story first published: Friday, January 19, 2024, 20:01 [IST]
Other articles published on Jan 19, 2024
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+