Hockey World Cup 2026: భారత్ X పాక్ మ్యాచ్ ఎప్పుడంటే? హర్మన్ సేన షెడ్యూల్ ఇదే?
ఎఫ్‌ఐహెచ్ హాకీ ప్రపంచకప్ 2026 టోర్నీకి భారత్ సిద్దమైంది. 51 ఏళ్ల టైటిల్ నిరీక్షణ తెరదించడమే లక్ష్యంగా హర్మన్‌ప్రీత్ సింగ్ సారథ్యంలోని భారత పురుషుల హాకీ టీమ్ బరిలోకి దిగుతోంది. నెదర్లాండ్స్, బెల్జియం సంయుక్తంగా ఆతిథ్యమిస్తున్న ఈ టోర్నీలో భారత్‌తో సహా మొత్తం 16 జట్లు పోటీ పడుతున్నాయి. ఇంగ్లండ్, పాకిస్థాన్, వేల్స్ టీమ్స్‌తో పాటు భారత్ గ్రూప్-డీలో ఉంది. ఆగస్ట్ 15 నుంచి 30వరకు నాలుగు దశల్లో ఈ మెగా టోర్నీ జరగనుంది.
పారిస్ ఒలింపిక్స్‌లో కాంస్య పతకాన్ని అందించిన హెడ్ కోచ్ క్రెయిగ్ ఫుల్టన్ పర్యవేక్షణలోనే భారత్ ఈ టోర్నీ ఆడబోతుంది. పురుషుల, మహిళల హాకీ ప్రపంచకప్ ఏకకాలంలోనే జరగనుంది. హాకీ ఆసియా కప్ 2025ను గెలుచుకోవడం ద్వారా భారత్.. మెగా టోర్నీకి అర్హత సాధించింది. గ్రూప్ దశలో భారత్.. ఇతర జట్లతో ఒక్కో మ్యాచ్ ఆడనుంది. ఇందులో అగ్రస్థానంలో నిలిచిన రెండు జట్లు తదుపరి రౌండ్‌కు అర్హత సాధిస్తాయి. దాయాదీ పాకిస్థాన్‌తో భారత్ ఆగస్ట్ 19న తలపడనుంది. వాగోనర్ స్టేడియం వేదికగా సాయంత్రం 6.30 గంటలకు ఈ మ్యాచ్ ప్రారంభం కానుంది.

భారత షెడ్యూల్:
ఆగస్ట్ 15: భారత్ వర్సెస్ వేల్స్, సాయంత్రం 4.30 గంటలకు, వాగోనర్ హాకీ స్టేడియం
ఆగస్ట్ 17: భారత్ వర్సెస్ ఇంగ్లండ్, సాయంత్రం 6.30 గంటలకు, వాగోనర్ హాకీ స్టేడియం
ఆగస్ట్ 19: భారత్ వర్సెస్ పాకిస్థాన్, సాయంత్రం 6.30 గంటలకు, వాగోనర్ హాకీ స్టేడియం
ఎలా చూడాలంటే..?
హాకీ ప్రపంచకప్ టోర్నీకి స్టార్ స్పోర్ట్స్ నెట్ వర్క్ అధికారిక బ్రాడ్‌కాస్టర్‌గా వ్యవహరిస్తోంది. స్టార్ స్పోర్ట్స్ ఛానెల్స్‌తో పాటు జియో హాట్‌స్టార్ వేదికగా ఈ ప్రపంచకప్ మ్యాచ్‌లను ప్రత్యక్షంగా వీక్షించవచ్చు.
ప్రపంచకప్ బరిలోకి దిగే భారత హాకీ టీమ్:
గోల్ కీపర్లు: మోహిత్ హెచ్ఎస్, సూరజ్ కర్కేరా.
డిఫెండర్లు: జర్మన్‌ప్రీత్ సింగ్, హర్మన్‌ప్రీత్ సింగ్ (కెప్టెన్), అమిత్ రోహితాస్, జుగ్రాజ్ సింగ్, సంజయ్, సుమిత్, యశ్దీప్ సివాచ్.
మిడ్‌ఫీల్డర్లు: రాజిందర్ సింగ్, ఆదిత్య అర్జున్ లాలాకే, హార్దిక్ సింగ్, మన్‌ప్రీత్ సింగ్, నీలకంద శర్మ, వివేక్ సాగర్ ప్రసాద్.
ఫార్వార్డ్‌లు: దిల్‌ప్రీత్ సింగ్, శిలానంద్ లక్రా, సుఖ్‌జీత్ సింగ్, మన్‌దీప్ సింగ్, అభిషేక్.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications

