Hockey World Cup 2026: పాకిస్థాన్‌పై భారత్ ఘన విజయం!
హాకీ ప్రపంచకప్ 2026 టోర్నీలో భారత్ మరో అద్భుత విజయాన్ని అందుకుంది. దాయాదీ పాకిస్థాన్‌ను చిత్తు చేసి తదుపరి రౌండ్‌కు దూసుకెళ్లింది. టోర్నీలో కొనసాగాలంటే తప్పక గెలవాల్సిన ఈ మ్యాచ్‌లో హర్మన్‌ప్రీత్ సింగ్ సారథ్యంలోని భారత్ అదరగొట్టింది. గ్రూప్-డీలో భాగంగా బుధవారం జరిగిన తమ ఆఖరి లీగ్ మ్యాచ్‌లో భారత్ 5-3 తేడాతో దాయాదీ పాకిస్థాన్‌ను చిత్తు చేసింది. ఈ ఓటమితో పాకిస్థాన్ టోర్నీ నుంచి నిష్క్రమించింది.
భారత్ తరఫున కెప్టెన్ హర్మన్ ప్రీత్ సింగ్(4వ నిమిషం, 21వ నిమిషం), అభిషేక్(11వ నిమిషం, 234 నిమిషం) రెండేసి గోల్స్ నమోదు చేయగా.. హార్దిక్ సింగ్(34వ నిమిషం) ఏకైక గోల్ కొట్టాడు. పాకిస్థాన్ తరఫున షాహిద్ హనన్(22వ నిమిషం, షాహిద్ హనన్ 46వ నిమిషం) రెండు గోల్స్ నమోదు చేయగా.. ఖాన్ సుఫ్యాన్(24వ నిమిషంలో) ఒక గోల్ కొట్టాడు.

హర్మన్‌ప్రీత్ డబుల్ గోల్..
మ్యాచ్ ఆరంభం నుంచే భారత్ పూర్తి ఆధిపత్యం చెలాయించింది. తొలి క్వార్టర్ ఆరంభంలోనే పెనాల్టీ కార్నర్‌ను కెప్టెన్ హర్మన్‌ప్రీత్ సింగ్ గోల్‌గా మలిచి భారత్ ఖాతా తెరిచాడు. 11వ నిమిషంలో గాలిలో వచ్చిన పాస్‌ను అద్భుతంగా అందుకున్న అభిషేక్.. మన్‌దీప్ సాయంతో గోల్ పోస్ట్‌లోకి పంపించి భారత్ ఆధిక్యాన్ని 2-0తో డబుల్ చేశాడు. ముందుగా ఈ గోల్‌ను మన్‌దీప్ చేసినట్లుగా అంతా అనుకున్నారు. కానీ బంతికి మనదీప్ స్టిక్ తాకలేదని నిర్థారించిన రిఫరీ ఈ గోల్‌ను అభిషేక్ ఖాతాలో వేసాడు.
రెండో క్వార్టర్‌లో ఇరు జట్లు హోరాహోరీగా తలపడ్డాయి. 21వ నిమిషంలో హర్మన్‌ప్రీత్ సింగ్ గోల్ నమోదు చేసి భారత్ ఆధిక్యాన్ని 3-0తో మూడింతలు చేశాడు. అయితే నిమిషాల వ్యవధిలోనే భారత్‌కు పాక్ షాకిచ్చింది. 22వ నిమిషంలో హన్నన్ షాహిద్ కొట్టిన షాట్‌ను గోల్ కీపర్ సూరజ్ కర్కేరా అడ్డుకున్నప్పటికీ తిరిగొచ్చిన బంతిని షాహిద్ అద్భుతంగా గోల్ పోస్ట్‌లోకి తరలించాడు.
ఆఖరి వరకు హోరా హోరీగా..
ఆ వెంటనే 24వ నిమిషంలో అభిషేక్ గోల్ కొట్టి భారత్ ఆధిక్యాన్ని 4-1కి చేర్చాడు. 25వ నిమిషంలో పాక్‌కు లభించిన పెనాల్టీ కార్నర్‌ను సుఫ్యాన్ ఖాన్ గోల్‌గా మలిచి భారత్ ఆధిక్యాన్ని 4-2కు తగ్గించాడు. మూడో క్వార్టర్‌లో పాక్ గోల్ కీపర్‌ను బోల్తా కొట్టిస్తూ హార్దిక్ గోల్ కొట్టాడు. దాంతో భారత్ ఆధిక్యం 5-2కు చేరింది. ఆ తర్వాత ఇరు జట్లు హోరా హోరీగా తలపడ్డాయి. భారత్‌కు వచ్చిన అవకాశాలను చేజార్చుకుంది. 46వ నిమిషంలో హనన్ షాహిద్ మరో గోల్ నమోదు చేసినా..లాభం లేకపోయింది. ఆఖరి వరకు ఏ తప్పిదం చేయకుండా ఆడిన భారత్ విజయం ఖాయం చేసుకుంది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications
