Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

Hockey World Cup 2026: భారత్ శుభారంభం.. వేల్స్‌పై తీన్మార్ విజయం!

ఎఫ్‌ఐహెచ్ పురుషుల హాకీ ప్రపంచకప్‌ 2026 టోర్నీలో భారత్ శుభారంభం చేసింది. బెల్జియం, నెదర్లాండ్స్ ఆతిథ్యం ఇస్తున్న ఈ మెగా టోర్నీ తొలి మ్యాచ్‌లో భారత్ 3-1 తేడాతో వేల్స్‌ను చిత్తు చేసింది. గ్రూప్-డీలో భాగంగా శనివారం నెదర్లాండ్స్‌, ఆమ్ స్టెల్వీన్‌లోని వాజెనర్ హాకీ స్టేడియం‌ వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో భారత్ పూర్తి ఆధిపత్యం చెలాయించింది.

భారత కెప్టెన్ హర్మన్‌ప్రీత్ సింగ్(10వ, 42వ నిమిషం) డబుల్ గోల్స్‌తో సత్తా చాటగా.. సుమిత్(7వ నిమిషం) ఏకైక గోల్‌తో భారత విజయంలో కీలక పాత్ర పోషించాడు. వేల్స్ తరఫున వెల్ష్ సామ్(55వ నిమిషం) ఏకైక గోల్ నమోదు చేశాడు.

Hockey World Cup 2026 Harmanpreet Singh s Brace Helps India Beat Wales 3-1 on Independence Day

ఆరంభం నుంచే ఆధిపత్యం..

మ్యాచ్ ఆరంభం నుంచే భారత్ ఆధిపత్యం చెలాయించింది. తొలి క్వార్టర్‌లో రెండు గోల్స్ నమోదు చేసింది. ప్రత్యర్థి ఆటగాడి తప్పిదంతో ఏడో నిమిషంలో లభించిన పెనాల్టీ కార్నర్‌ను సుమిత్ గోల్‌గా మలిచి 1-0తో శుభారంభం అందించాడు. మరో మూడు నిమిషాల వ్యవధిలోనే భారత్‌కు రెండో పెనాల్టీ కార్నర్ లభించగా.. హర్మన్‌ప్రీత్ సింగ్ గోల్‌గా మలిచి భారత్ ఆధిక్యాన్ని 2-0తో డబుల్ చేశాడు.

Hockey World Cup 2026: సరికొత్త ఫార్మాట్‌లో.. శనివారం నుంచి షురూ! ఎలా చూడాలంటే..?

Hockey World Cup 2026: సరికొత్త ఫార్మాట్‌లో.. శనివారం నుంచి షురూ! ఎలా చూడాలంటే..?

రెండో క్వార్టర్‌లో ఇరు జట్లు హోరాహోరీగా తలపడటంతో గోల్స్ నమోదు కాలేదు. కానీ భారత్ బంతిని తమ ఆదీనంలో ఉంచుకొని ఆధిపత్యం చెలాయిస్తూ ప్రత్యర్థి గోల్ పోస్ట్‌పై దాడులు చేసే ప్రయత్నం చేసింది. కానీ వేల్స్ డిఫెన్స్ సమర్దవంతంగా తిప్పి కొట్టింది. ఈ క్రమంలో భారత్ ఒక పెనాల్టీ కార్నర్ వృథా చేసింది. మరోవైపు వేల్స్ ప్రయత్నాలను కూడా భారత్ అడ్డుకుంది.

చెలరేగిన హర్మన్‌ప్రీత్ సింగ్

మూడో క్వార్టర్ చివర్లో భారత్‌కు మరో పెనాల్టీ కార్నర్ లభించగా.. హర్మన్‌ప్రీత్ సింగ్ గోల్‌గా మలిచి భారత్ ఆధిక్యాన్ని 3-0తో మూడింతలు చేశాడు. ఆఖరి క్వార్టర్‌లో వేల్స్ ఆధిపత్యం చెలాయించింది. బంతిని పూర్తిగా తమ ఆధీనంలో ఉంచుకొని భారత్‌పై ఎదురదాడికి దిగింది.

Hockey World Cup 2026: భారత్ X పాక్ మ్యాచ్ ఎప్పుడంటే? హర్మన్‌ సేన షెడ్యూల్ ఇదే?

Also Read

Hockey World Cup 2026: భారత్ X పాక్ మ్యాచ్ ఎప్పుడంటే? హర్మన్‌ సేన షెడ్యూల్ ఇదే?

ఈ క్రమంలో ఆ జట్టుకు 55వ నిమిషంలో పెనాల్టీ కార్నర్ లభించింది. వేల్ష్ సామ్ గోల్‌గా మలిచి ఆ జట్టు ఖాతా తెరిచాడు. భారత గోల్ కీపర్ ఈ గోల్‌ను అడ్డుకునేందుకు శతవిధాల ప్రయత్నించినా ఆఖరి నిమిషంలో వేల్ష్ సామ్ బంతిని గోల్ పోస్ట్‌లోకి నెట్టాడు. రివ్యూ ద్వారా వేల్స్‌కు ఈ గోల్ లభించింది. భారత్ తమ తదుపరి మ్యాచ్‌ను ఆగస్ట్ 17న ఇంగ్లండ్‌తో ఆడనుంది.

Story first published: Saturday, August 15, 2026, 18:47 [IST]
Other articles published on Aug 15, 2026
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+