Hockey World Cup 2023: నెదర్లాండ్స్, న్యూజిలాండ్ శుభారంభం.. ఇంగ్లండ్‌తో భారత్‌కు పరీక్ష!

రవుర్కెల(ఒడిశా): భారత్ వేదికగా జరుగుతున్న హకీ ప్రపంచకప్ 2023లో మూడు సార్లు ఛాంపియన్ అయిన నెదర్లాండ్స్, న్యూజిలాండ్ జట్లు శుభారంభం చేసాయి. శనివారం జరిగిన పూల్-సి మ్యాచ్‌లో ప్రపంచ మూడో ర్యాంకర్ నెదర్లాండ్స్ 3-0తో మలేసియాను చిత్తుచేసింది. 19వ నిమిషంలో థిజ్స్ వాన్ డామ్ ఫీల్డ్ గోల్ చేసి నెదర్లాండ్స్ ఖాతా తెరిచాడు. నాలుగు నిమిషాల తర్వాత జిప్ జాన్సెన్ పెనాల్టీ స్ట్రోక్‌ను గోల్‌గా మలిచి ఆ జట్టు ఆధిక్యాన్ని 2-0కు పెంచాడు. 46వ నిమిషంలో ట్యూన్ బీన్స్.. పెనాల్టీ కార్నర్‌ను సద్వినియోగం చేయడంతో డచ్ జట్టు తిరుగులేని స్థితిలో నిలిచింది. 1973, 1990, 1998 ప్రపంచకప్‌లలో నెదర్లాండ్స్ విజేతగా నిలిచింది.

న్యూజిలాండ్ శుభారంభం..
పూల్-సి పోరులో న్యూజిలాండ్ 3-1తో చిలీపై విజయం సాధించింది. 9వ నిమిషంలో సామ్ లేన్ కివీస్‌కు తొలి గోల్ అందించాడు. 11, 18వ నిమిషాల్లో సామ్ హిహా రెండు ఫీల్డ్ గోల్స్ రాబట్టి కివీస్ ఆధిక్యాన్ని 3-0కు పెంచాడు. చిలీ ఆటగాడు ఇగ్నాసియో కాంటార్డో 49వ నిమిషంలో గోల్ చేసి కివీస్ ఆధిక్యాన్ని 3-1కి తగ్గించగలిగాడు. పూల్-బిలో బెల్జియం 5-0తో కొరియాపై, జర్మనీ 3-0తో జపాన్‌పై విజయం సాధించాయి.

భారత్‌కు కఠిన సవాల్..
స్పెయిన్‌పై సాధికారిక విజయంతో హాకీ ప్రపంచకప్‌లో శుభారంభం చేసిన ఆతిథ్య భారత్ మరో సవాల్‌కు సిద్ధమైంది. ఆదివారం గ్రూపు-డి పోరులో ఇంగ్లండ్‌తో భారత్ అమీతుమీ తేల్చుకోనుంది. కొత్తగా నిర్మించిన బిర్సా ముండా స్టేడియంలో అద్వితీయ ఆటతో స్పెయిన్‌ను 2-0తో చిత్తుచేసిన భారత్ అంచనాల్ని భారీగా పెంచేసింది. అయితే తన తొలి మ్యాచ్‌లో 5-0తో వేల్స్‌ను మట్టికరిపించిన ఇంగ్లండ్ సైతం రెట్టించిన ఆత్మవిశ్వాసంతో ఉంది. పటిష్టమైన ఇంగ్లండ్‌ను ఓడించాలంటే గత మ్యాచ్‌లో మాదిరే భారత్ పట్టుదల, నైపుణ్యం కనబరచాల్సి ఉంటుంది. శుక్రవారం మ్యాచ్‌లో స్థానిక హీరో అమిత్ రోహిదాస్, హార్దిక్ సింగ్ చెరో గోల్‌తో సత్తాచాటారు.

ఆ బలహీనతను అధిగమించాలి..
ఎటాకింగ్ ఆటతో ప్రత్యర్థిని ఆత్మరక్షణలోకి నెట్టారు. అనంతరం కెప్టెన్ హర్మన్‌ప్రీత్ సింగ్, రోహిదాస్ అద్భుతమైన డిఫెన్స్‌తో ప్రత్యర్థిని సమర్థంగా అడ్డుకున్నారు. అలాంటి ఎటాకింగ్, డిఫెన్స్‌తో ఇంగ్లండ్‌ను కట్టడి చేయాలని భారత్ భావిస్తోంది. అయితే పెనాల్టీ కార్నర్‌ల విషయంలో భారత్ బలహీనంగా కనిపిస్తోంది. స్పెయిన్‌తో మ్యాచ్‌లో ఐదు పెనాల్టీ కార్నర్‌లను భారత్ నేరుగా గోల్స్‌గా మలచలేకపోయింది. ఇంగ్లండ్ వంటి పటిష్టమైన జట్టుతో మ్యాచ్‌లో పెనాల్టీ కార్నర్‌లను వృథా చేస్తే భారత్‌కు కష్టాలు తప్పవు. ఆదివారం మరో మ్యాచ్‌లో (సా.5 నుంచి)లో స్పెయిన్‌తో వేల్స్ తలపడుతుంది. రాత్రి 7 గంటలకు భారత్-ఇంగ్లండ్ మ్యాచ్ ప్రారంభం కానుంది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications