Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

భారత హాకీ జెర్సీ మార్పుపై దుమారం.. క్లారిటీ ఇచ్చిన హాకీ ఇండియా

హాకీ ప్రపంచకప్ టోర్నీల నేపథ్యంలో భారత జట్ల జెర్సీ రంగుపై వచ్చిన విమర్శలపై హాకీ ఇండియా స్పందించింది. జెర్సీ మార్పు వెనుక ఉన్న సాంకేతిక కారణాలను వివరించింది. జట్టు కోసమే ఈ నిర్ణయం తీసుకున్నామని తెలిపింది. వచ్చే నెల బెల్జియం, నెదర్లాండ్స్ వేదికలుగా జరగనున్న ఎఫ్‌ఐహెచ్ (FIH) పురుషుల, మహిళల హాకీ ప్రపంచకప్‌లకు సంబంధించిన భారత జట్ల కొత్త జెర్సీల రంగు తీవ్ర చర్చనీయాంశమైంది.

IND vs PAK: ఫైనల్లో పాకిస్థాన్‌ను చిత్తు చేసిన భారత్!

IND vs PAK: ఫైనల్లో పాకిస్థాన్‌ను చిత్తు చేసిన భారత్!

దశాబ్దాలుగా వస్తున్న సాంప్రదాయ నీలం రంగు స్థానంలో కాషాయం రంగు జెర్సీలను ఆవిష్కరించడంపై తీవ్ర విమర్శలు వచ్చాయి. హాకీ మాజీ కెప్టెన్ వీరేన్ రస్కిన్హాతో పాటు అభిమానుల జెర్సీ రంగులను మార్చడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. కాషాయరంగులోకి మార్చాల్సిన అవసరం ఏం ఉందని, కేంద్ర ప్రభుత్వ పెద్దల మనసులను గెలుచుకునేందుకు ఈ పని చేశారా? అంటూ సోషల్ మీడియా వేదికగా నిలదీసాడు.

Hockey India explains Why Indian hockey team jersey changed from blue to saffron ahead of 2026 World Cup
Photo Credit: X (twitter)

సాంకేతిక ప్రయోజనాల కోసమే..

ఈ వివాదంపై వివరణ ఇస్తూ హాకీ ఇండియా గురువారం ఒక ప్రకటనను విడుదల చేసింది. 'అంతర్జాతీయ హాకీ మ్యాచ్‌లు బ్లూ సింథటిక్ మైదానాల్లో జరుగుతాయి. దాంతో భారత ఆటగాళ్లు నీలం రంగు జెర్సీలు ధరించడం వల్ల ఐ కాంటాక్ట్ సరిగ్గా ఉండటం లేదు. మైదానం రంగు, కిట్ రంగు కలిసిపోవడం వల్ల ఆటగాళ్ల మధ్య స్పష్ట తోపిస్తుందని కోచ్‌లతో పాటు సపోర్ట్ స్టాఫ్ మెంబర్స్ ఫిర్యాదు చేశారు.

ఆటగాళ్ల ప్రదర్శనను మెరుగుపరచడానికి, సాంకేతిక ప్రయోజనాల కోసమే జెర్సీ రంగు మార్చాం. కాషాయ రంగు మన జాతీయ జెండాలోని మూడు రంగుల్లో ఒకటి. అంతేకాకుండా కాషాయం శౌర్యానికి ప్రతీకగా నిలుస్తుంది. గతంలో కూడా హాకీ టీమ్స్ జెర్సీ రంగులు మార్చిన దాఖలాలు ఉన్నాయి.'అని తమ ప్రకటలో పేర్కొంది.

Hockey Men’s World Cup 2026: జట్టును ప్రకటించిన భారత్!

Also Read

Hockey Men’s World Cup 2026: జట్టును ప్రకటించిన భారత్!

గతంలో కూడా కలర్స్ మార్చారు..

2014 ప్రపంచకప్‌లో భారత జట్టు పసుపు రంగు జెర్సీలో ఆడిందని, 2018 ప్రపంచకప్‌లో స్కై బ్లూ విభిన్నమైన డిజైన్‌తో ఆడిందని గుర్తు చేసింది. భారత మాజీ కెప్టెన్ వీరేన్ రస్కిన్షా కూడా తన పోస్ట్‌‌తో అనవసరమైన రాజకీయాలు చేస్తున్నారని అసహనం వ్యక్తం చేశాడు.

'జెర్సీ రంగు మార్పుపై చాలా అనవసరమైన రాజకీయ కామెంట్స్ చూస్తున్ను. నేను రాజకీయాల జోలికి వెళ్లాలనుకోవడం లేదు.హాకీ ఇండియాకు నా అభిప్రాయాలను తెలియజేశాను. ఫుట్‌బాల్‌కు అర్జెంటీనా ఎలాగో, హాకీకి భారతదేశం కూడా అంతే' అని వీరేన్ పేర్కొన్నాడు.

Story first published: Thursday, July 30, 2026, 19:29 [IST]
Other articles published on Jul 30, 2026
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+