Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

Hockey World Cup 2026: నెదర్లాండ్స్ చేతిలో ఓటమి.. భారత్ సెమీస్ చేరాలంటే..?

మహిళల హాకీ ప్రపంచకప్‌లో భారత్‌ జట్టుకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. అద్భుత ప్రదర్శనతో తదుపరి రౌండ్‌కు అర్హత సాధించిన భారత్ ఆ జోరును కొనసాగించలేకపోయింది. శుక్రవారం పూల్-ఈ తొలి మ్యాచ్‌లో సలీమా టేటే సారథ్యంలోని భారత్ జట్టు 0-2తో ఒలింపిక్ ఛాంపియన్ నెదర్లాండ్స్ చేతిలో ఓటమిపాలైంది. ఆరంభం నుంచే డచ్ టీమ్ అటాకింగ్ చేయగా.. భారత్ పూర్తిగా డిఫెన్స్‌కే పరిమితమైంది.

Hockey World Cup 2026: పాకిస్థాన్‌పై భారత్ ఘన విజయం!

Hockey World Cup 2026: పాకిస్థాన్‌పై భారత్ ఘన విజయం!

రెండో నిమిషంలోనే పెనాల్టీ కార్నర్‌ను గోల్‌ కొట్టి ఆధిక్యం సాధించిన నెదర్లాండ్.. 38వ నిమిషంలో లభించిన పెనాల్టీ కార్నర్‌ను గోల్‌గా మలిచి ఆధిక్యాన్ని 2-0తో డబుల్ చేసింది. ఆ తర్వాత నెదర్లాండ్స్ అవకాశాలను భారత్ అడ్డుకుంది. ఈ మ్యాచ్‌లో నెదర్లాండ్స్‌కు 10 పెనాల్టీ కార్నర్‌లు లభిస్తే.. భారత్‌కు కేవలం 2 మాత్రమే దక్కాయి. నెదర్లాండ్స్ బంతిని పూర్తిగా తమ ఆధీనంలో ఉంచుకొని భారత గోల్ పోస్ట్‌పై దాడులు చేసింది. ఈ ఓటమితో భారత్ సెమీస్ అవకాశాలు సంక్లిష్టంగా మారాయి. ఆస్ట్రేలియాతో జరిగే తదుపరి మ్యాచ్‌లో తప్పక గెలవాల్సిన పరిస్థితి ఏర్పడింది.

FIH Womens Hockey World Cup 2026 How Can India Qualify for the Semifinals After 0-2 Loss to Netherlands

భారత్ సెమీఫైనల్ చేరాలంటే..

ఆగస్టు 23న జరిగే తమ చివరి పూల్-ఈ మ్యాచ్‌లో భారత్ కచ్చితంగా ఆస్ట్రేలియాని ఓడించాలి. లేదంటే టోర్నీ నుంచి నిష్క్రమిస్తోంది. ఒకవేళ గెలిచినా..ఇతర జట్ల ఫలితాలపై ఆధారపడాల్సి ఉంటుంది. నెదర్లాండ్స్ జట్టు తమ ఆఖరి మ్యాచ్‌లో చైనాను ఓడించాలి. లేదా డ్రా చేసుకోవాలి. నెదర్లాండ్స్ గెలిచి, భారత్ ఆస్ట్రేలియాపై విజయం సాధిస్తే.. 4 పాయింట్లతో గ్రూప్-ఈ‌లో రెండో స్థానానికి చేరుకుని సెమీఫైనల్‌కు అర్హత సాధిస్తోంది.

ప్రస్తుతం గ్రూప్-ఈలో భారత్ ఒకే ఒక్క పాయింట్‌తో నాలుగో స్థానంలో కొనసాగుతోంది. చైనాతో డ్రా చేసుకోవడంతో భారత్‌కు ఆ పాయింట్ లభించింది. ఆడిన రెండు మ్యాచ్‌లకు రెండు గెలిచిన నెదర్లాండ్స్ 6 పాయింట్లతో సెమీస్‌కు క్వాలిఫై అయ్యింది. రెండో బెర్త్ కోసం ఆస్ట్రేలియా, చైనా, భారత్ పోటీపడుతున్నాయి.

Hockey World Cup 2026: డ్రాతో గట్టెక్కిన భారత్.. ఇంగ్లండ్ ఔట్!

Also Read

Hockey World Cup 2026: డ్రాతో గట్టెక్కిన భారత్.. ఇంగ్లండ్ ఔట్!

ఈ మూడు జట్లు రెండేసి మ్యాచ్‌లు ఆడి ఒక్క విజయం సాధించలేకపోయాయి. చైనా రెండు డ్రా చేసుకొని 2 పాయింట్లతో రెండో స్థానంలో కొనసాగుతుండగా.. ఆస్ట్రేలియా, భారత్.. ఒక్కో మ్యాచ్ ఓడి, మరో మ్యాచ్ డ్రా చేసుకొని మూడు, నాలుగు స్థానాల్లో ఉన్నాయి. ఆస్ట్రేలియాను భారత్ ఓడించి.. చైనాపై నెదర్లాండ్స్ ఓటమి తప్పించుకుంటే సలీమా సేనకు సెమీస్ బెర్త్ దక్కుతుంది.

Story first published: Saturday, August 22, 2026, 12:00 [IST]
Other articles published on Aug 22, 2026
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+