Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

Hockey World Cup 2026: నేడే భారత్X పాక్ మ్యాచ్.. తదుపరి రౌండ్‌కు చేరాలంటే..?

హాకీ ప్రపంచకప్ 2026 టోర్నీలో భారత్ మరో రసవత్తర పోరుకు సిద్దమైంది. గ్రూప్-డీలో భాగంగా నేడు(బుధవారం) దాయాదీ పాకిస్థాన్‌తో భారత హాకీ టీమ్ తలపడనుంది. ఇరు జట్లకు ఈ మ్యాచ్‌ చావోరేవోలాంటిది. తదుపరి రౌండ్‌కు అర్హత సాధించాలంటే ఈ మ్యాచ్ గెలవడం ఇరు జట్లకు అత్యంత కీలకం.

ఇప్పటి వరకు జరిగిన రెండు లీగ్ మ్యాచ్‌ల్లో భారత్ ఒకటి గెలిచి మరొకటి ఓడింది. 3-1 తేడాతో వేల్స్‌ను ఓడించిన భారత్.. ఇంగ్లండ్ చేతిలో 4-2 తేడాతో భారత్‌ ఓడిపోయింది. ప్రస్తుతం గ్రూప్-డీలో భారత్ 3 పాయింట్లతో రెండో స్థానంలో ఉంది. పాక్‌తో జరిగే మ్యాచ్‌లో భారత్ గెలిస్తే.. వారు నేరుగా రెండో రౌండ్‌కు అర్హత సాధిస్తారు. ఒకవేళ ఓడిపోతే.. టోర్నీ నుంచి భారత్ నిష్క్రమిస్తోంది. ఒకవేళ మ్యాచ్ డ్రా అయితే.. ఇంగ్లండ్-వేల్స్ మ్యాచ్ ఫలితంపై భారత్ అవకాశాలు ఆధారపడి ఉంటాయి. ఈ మ్యాచ్‌‌లో నమోదయ్యే గోల్స్, ఫలితం భారత్ బెర్త్‌ను ఖరారు చేస్తోంది.

FIH Hockey World Cup 2026 Qualification Scenarios and Pool D Standings Ahead of India vs Pakistan Clash

మరోవైపు పాకిస్థాన్ పరిస్థితి దయనీయంగా ఉంది. వేల్స్‌తో డ్రా చేసుకున్న పాకిస్థాన్.. ఇంగ్లండ్ చేతిలో 1-4 తేడాతో ఖంగుతిన్నది. పాక్ తదుపరి రౌండ్‌కు అర్హత సాధించాలంటే భారత్‌ను తప్పక ఓడించాలి. అలాకాకుండా భారత్‌ చేతిలో ఓడినా.. డ్రా చేసుకున్నా టోర్నీ నుంచి పాక్ నిష్క్రమిస్తోంది. పాకిస్థాన్-3 గోల్ తేడాతో ఉంది.

ఇంగ్లండ్ వరుస విజయాలతో ఇప్పటికే తదుపరి రౌండ్‌కు అర్హత సాధించింది. మరో ప్లేస్ కోసం భారత్, పాక్, వేల్స్ మధ్య పోటీ నెలకొంది. ప్రతీ గ్రూప్‌లో అగ్రస్థానంలో నిలిచిన రెండు జట్లు మాత్రమే తదుపరి రౌండ్‌కు అర్హత సాధిస్తాయి. నేటి సాయంత్రం 6.30 గంటలకు భారత్-పాక్ పోరు ప్రారంభం కానుండగా.. స్టార్ స్పోర్ట్స్, జియో హాట్‌స్టార్‌లో మ్యాచ్ ప్రత్యక్ష ప్రసారం కానుంది.

ముఖాముఖి పోరులో భారత్‌పై పాక్‌దే పైచేయిగా ఉంది. ఇప్పటి వరకు ఇరు జట్లు 183 సార్లు తలపడగా.. భారత్ 69 మ్యాచ్ గెలవగా.. పాకిస్థాన్ 82 మ్యాచ్‌ల్లో గెలుపొందింది. మరో 32 మ్యాచ్‌లు డ్రా అయ్యాయి.

Story first published: Wednesday, August 19, 2026, 13:04 [IST]
Other articles published on Aug 19, 2026
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+