Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

Hockey World Cup 2026: సరికొత్త ఫార్మాట్‌లో.. శనివారం నుంచి షురూ! ఎలా చూడాలంటే..?

ఇంటర్నేషనల్ హాకీ ఫెడరేషన్(ఎఫ్‌ఐహెచ్) ఆధ్వర్యంలో హాకీ ప్రపంచకప్ 2026 టోర్నీకి రంగం సిద్దమైంది. మరో రెండు రోజుల్లో ఈ మెగా టోర్నీకి తెరలేవనుంది. నెదర్లాండ్స్, బెల్జియం సంయుక్తంగా ఆతిథ్యమిస్తున్న ఈ టోర్నీలో భారత్‌తో సహా మొత్తం 16 జట్లు పోటీ పడుతున్నాయి.

అయితే ఈ సారి సరికొత్త ఫార్మాట్‌లో ఈ మెగా టోర్నీ జరగనుంది. గత టోర్నీకి భిన్నంగా సంప్రదాయంగా నిర్వహించే క్వార్టర్‌ ఫైనల్స్‌ను ఈ నయా ఫార్మాట్‌లో తొలగించారు. 16 జట్లను నాలుగేసి టీమ్స్‌తో నాలుగు గ్రూపులు ఏ, బీ, సీ, డీలుగా విభజించారు. గ్రూప్‌-డీలో భారత్‌తోపాటు ఇంగ్లండ్‌, పాకిస్థాన్‌, వేల్స్‌ టీమ్స్ ఉన్నాయి. ఆగస్ట్ 15 నుంచి 30వరకు నాలుగు దశల్లో ఈ మెగా టోర్నీ జరగనుంది.

FIH Hockey World Cup 2026 New Format Explained Pools Venues Live Streaming and India Squads

గ్రూప్‌ దశ

ఫస్ట్ ఫేజ్: ఈనెల 15 నుంచి 20 వరకు జరుగుతుంది. నాలుగు గ్రూప్స్‌ల్లో టాప్-2లో నిలిచిన జట్లు తర్వాతి క్రాస్‌ ఓవర్‌ రౌండ్‌కు అర్హత సాధిస్తాయి.

సెకండ్ ఫేజ్: క్రాస్‌ ఓవర్‌ రౌండ్‌ పేరిట ఆగస్ట్ 21 నుంచి 24 వరకు మ్యాచ్‌లు జరగనున్నాయి. ఫస్ట్ ఫేజ్‌లో లభించిన పాయింట్ల ఆధారంగా.. ఈ రౌండ్‌లో ఆయా జట్లను ఈ, ఎఫ్‌, జీ, హెచ్‌ గ్రూప్‌లుగా వర్గీకరిస్తారు.

Hockey Men’s World Cup 2026: జట్టును ప్రకటించిన భారత్!

Hockey Men’s World Cup 2026: జట్టును ప్రకటించిన భారత్!

పూల్‌-ఈలో గ్రూప్‌-ఎ, గ్రూప్‌-డిల్లో టాప్‌-2లో నిలిచిన జట్లు.. మొత్తంగా నాలుగు టీమ్‌లు ఉంటాయి. పూల్‌-ఎఫ్‌‌లో గ్రూప్‌-బి, గ్రూప్‌-సిలో టాప్‌లో నిలిచిన నాలుగు జట్లు, పూల్‌-జిలో గ్రూప్‌-ఎ, గ్రూప్‌-డి నుంచి 3, 4 స్థానాల్లోని జట్లు, పూల్‌-హెచ్‌లో గ్రూప్‌-బి, గ్రూప్‌-సి నుంచి 3,4 స్థానాల్లోని జట్లను చేర్చుతారు.

ఇందులో ప్రతి టీమ్‌.. తొలి దశలో ఎదుర్కొనని ప్రత్యర్థులతో మూడేసి మ్యాచ్‌లు ఆడుతుంది. అంతేకాకుండా లీగ్‌ దశలో ముందంజ వేసిన రెండో జట్టుపై ఫలితం ద్వారా లభించిన పాయింట్లు కూడా ఇక్కడ కలవనున్నాయి. అంటే, గ్రూప్‌ దశలో ఇంగ్లండ్‌పై భారత్‌ గెలిచి, ఆ రెండు జట్లూ రెండో రౌండ్‌కు చేరితే.. ఆ పాయింట్లను తర్వాతి దశలో కూడా భారత్‌కు క్యారీ చేస్తారు. ఒకరకంగా ఇది ఆ జట్టుకు అదనపు ప్రయోజనం ఇస్తుంది.

థర్డ్ ఫేజ్: ఈ దశలో క్లాసిఫికేషన్‌, సెమీస్‌ మ్యాచ్‌లు ఆగస్ట్ 27-28 వరకు జరుగుతాయి. పూల్‌-ఈ, పూల్‌-ఎఫ్‌లో టాప్‌-2లో నిలిచిన రెండేసి జట్లు సెమీస్‌కు అర్హత సాధిస్తాయి. కాగా, మిగతావి 5 నుంచి 16 స్థానాల వర్గీకరణ మ్యాచ్‌లు ఆడుతాయి.

సెమీస్‌ ఇలా..

పూల్‌-ఈ అగ్రస్థానం, పూల్‌-ఎఫ్‌ రెండోస్థానం; పూల్‌-ఎఫ్‌ అగ్రస్థానం, పూల్‌-ఈ రెండోస్థానం జట్ల మధ్య సెమీస్ మ్యాచ్‌లు జరుగుతాయి. సెమీస్‌లో గెలిచిన రెండు జట్లు ఆగస్ట్ 30న టైటిల్‌ కోసం పోరాడతాయి. దానికి ముందు కాంస్య పతక పోరు జరుగుతుంది. 51 ఏళ్ల టైటిల్ నిరీక్షణకు తెరదించడానికి భారత పురుషుల జట్టు సన్నదమవుతోంది.

భారత హాకీ జెర్సీ మార్పుపై దుమారం.. క్లారిటీ ఇచ్చిన హాకీ ఇండియా

Also Read

భారత హాకీ జెర్సీ మార్పుపై దుమారం.. క్లారిటీ ఇచ్చిన హాకీ ఇండియా

ఎలా చూడాలంటే..?

హాకీ ప్రపంచకప్‌ టోర్నీ స్టార్ స్పోర్ట్స్ నెట్ వర్క్ అధికారిక బ్రాడ్‌కాస్టర్‌గా వ్యవహరిస్తోంది. స్టార్ స్పోర్ట్స్ ఛానెల్స్‌తో పాటు జియో హాట్‌స్టార్ మ్యాచ్‌లను ప్రత్యక్షంగా వీక్షించవచ్చు.

Story first published: Thursday, August 13, 2026, 12:52 [IST]
Other articles published on Aug 13, 2026
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+