Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

Asian Games 2026: చక్ దే! ఇండియా.. 44 ఏళ్ల తర్వాత స్వర్ణం!

ఆసియా గేమ్స్‌లో భారత మహిళల హాకీ టీమ్ అదరగొట్టింది. అద్వితీయమైన ప్రదర్శనతో స్వర్ణ పతకం సాధించి 44 ఏళ్ల నీరిక్షణకు తెరదించింది. శుక్రవారం జరిగిన ఫైనల్లో సత్తా చాటిన భారత్ 1-0 తేడాతో విజయం సాధించింది. భారత్ తరఫున లాల్‌రెమ్‌సియామి ఏకైక గోల్ చేసింది.

భారత్ మహిళల హాకీ టీమ్ చివరిసారిగా 1982 ఆసియా గేమ్స్‌లో స్వర్ణం సాధించింది. ఈ విజయంతో లాస్ ఏంజిల్స్ 2028 ఒలింపిక్స్‌ బెర్త్‌ను భారత మహిళల హాకీ టీమ్ దక్కించుకుంది.

జపాన్‌లోని నగోయాలో జరిగిన ఫైనల్లో భారత్, చైనా హోరాహోరీగా తలపడ్డాయి. మ్యాచ్ తొలి క్వార్టర్‌లో భారత ప్లేయర్ లాల్ రెమ్సియామి మెరుపు వేగంతో ఫీల్డ్ గోల్ చేసి భారత్‌కు 1-0 ఆధిక్యాన్ని అందించింది. భారత క్రీడాకారులు ఈ ఆధిక్యాన్ని చివరి వరకు కాపాడుకొని విజయం సాధించింది.

Asian Games 2026 Lalremsiami Scores as India Beat China 1-0 to Win Gold After 44 Years qualify for LA 2028

ఆరంభంలో వెనుకబడిన చైనా జట్టు.. స్కోర్లను సమం చేసేందుకు వరుసగా తీవ్రమైన దాడులు చేసింది. చివరి పావుగంటలో.. చైనా తమ గోల్ కీపర్‌ను పంపించేసి మరి ఎక్స్‌ట్రా అటాకర్‌ను బరిలోకి దించింది. కానీ భారత గోల్ కీపర్ సవితా పునియా ఉక్కు గోడలా నిలబడి చైనా గోల్ ప్రయత్నాలను అడ్డుకుంది.

సలీమా డేట్, రుతజలతో సహా భారత ప్లేయర్లు చివరి నిమిషాల్లో తమ చాకచక్యమైన బాల్ హ్యాండ్లింగ్‌తో సమయాన్ని గడిపారు. ఫైనల్లో విజిల్ మోగి ఆట 1-0తో ముగియగానే.. భారత క్రీడాకారిణుల విజయోత్సవాలతో స్టేడియం మొత్తం హోరెత్తింది. ఈ చారిత్రాత్మక విజయంతో భారత మహిళల హాకీ జట్టు 2028 లాస్ ఏంజిల్స్ ఒలింపిక్స్‌కు నేరుగా అర్హత సాధించిన డబుల్ రికార్డ్ సృష్టించింది.

ఈ ఫైనల్‌కు ముందు సెమీఫైనల్లో దక్షిణ కొరియాపై 2-0 తేడాతో గెలిచిన సంగతి తెలిసిందే. ఈ చారిత్రాత్మక విజయంపై భారత క్రీడా లోకం హర్షం వ్యక్తం చేస్తోంది. ఈ స్వర్ణంతో ఈ ఆసియా క్రీడల్లో భారత్ బంగారు పతకాల సంఖ్య 16కి పెరిగింది.

Story first published: Friday, October 2, 2026, 18:33 [IST]
Other articles published on Oct 2, 2026
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+