హాంగ్జౌ: ఆసియా గేమ్స్ 2023లో భాగంగా పాకిస్థాన్‌తో జరిగిన హాకీ లీగ్ మ్యాచ్‌లో భారత్ ఘన విజయం సాధించింది. పూల్-ఏలో భాగంగా శనివారం జరిగిన లీగ్ మ్యాచ్‌లో భారత్ 10-2 తేడాతో పాకిస్థాన్‌ను చిత్తు చేసింది.
భారత్ తరఫున హర్మన్‌ప్రీత్ సింగ్ అత్యధికంగా (11, 17, 34, 33వ నిమిషం) నాలుగు గోల్స్ చేయగా.. మన్ దీప్ సింగ్(13, 8వ నిమిషం) రెండో గోల్స్ సాధించాడు. సుమిత్(11, 30వ నిమిషం), వరుణ్ కుమార్(17, 41) రెండేసి గోల్స్ సాధించారు.

పాకిస్థాన్ తరఫున రాణా అవా(45వ నిమిషం), ఖాన్(38వ నిమిషం) చెరొక గోల్ నమోదు చేశారు. హాకీ చరిత్రలోనే టీమిండియాకు ఇది అతిపెద్ద విజయం.
మ్యాచ్ ఆరంభం నుంచి పూర్తి ఆధిపత్యం చెలాయించిన భారత్ హాకీ ప్లేయర్లు.. పాకిస్థాన్‌ను ఏ దశలో కోలుకోనివ్వలేదు. తొలి క్వార్టర్‌లో కెప్టెన్ హర్మన్‌ప్రీత్ వరుస గోల్స్‌తో భారత్ ఆధిక్యాన్ని డబుల్ చేశాడు. దాంతో ఫస్ట్ క్వార్టర్‌ను భారత్ 2-0తో ముగించింది.
రెండో క్వార్టర్‌లోనూ అదే జోరు కొనసాగించిన భారత్ మరో రెండో గోల్స్ నమోదు చేసి ఆధిక్యాన్ని 4-0తో నాలుగింతలు పెంచుకుంది. ఆ తర్వాత మన్‌దీప్ సింగ్, సుమిత్ కూడా సత్తా చాటడంతో భారత్ వరుస గోల్స్‌తో సత్తా చాటింది. పాకిస్థాన్ ప్లేయర్లు రెండు గోల్స్ చేసినా.. జరగాల్సిన నష్టం జరిగిపోయింది.
ఆసియా గేమ్స్‌లో శనివారం జరిగిన పోటీల్లో భారత్ సత్తా చాటింది. స్క్వాష్ పురుషుల ఈవెంట్ ఫైనల్లో పాకిస్థాన్‌ను ఓడించిన భారత్ స్వర్ణపతకం సొంతం చేసుకుంది.