Asian Champions Trophy hockey 2024: భారత జట్టు ప్రకటన.. గోల్ కీపర్ ఎవరంటే.?

ఈ జట్టులో పలువురు కొత్త ఆటగాళ్లు అవకాశం దక్కించుకున్నాడు. సీనియర్ ప్లేయర్స్ అయిన మన్‌దీప్ సింగ్, లలిత్ ఉపాధ్యాయ, హార్దిక్ సింగ్‌లకు ఈ టోర్నీ నుంచి విశ్రాంతి ఇచ్చారు. పారిస్ ఒలింపిక్స్‌తో వీడ్కోలు కలిపిన స్టార్ గోల్ కీపర్ శ్రీజేశ్ స్థానంలో క్రిషన్ బహదూర్ పాఠక్, సూరజ్ కర్కేరాలు ఎంపికయ్యారు.
పారిస్ ఒలింపిక్స్‌లో ఆడిన జట్టులోని 10 మంది ఆటగాళ్లకు ఈ టోర్నీకి ఎంపికయ్యాడు. ఈ టోర్నీలో ఆతిథ్య చైనాతో పాటు భారత్, పాకిస్థాన్, మలేషియా, సౌత్ కొరియా, జపాన్‌లు పాల్గొననున్నాయి. సెప్టెంబర్ 8న చైనాతో జరిగే తొలి మ్యాచ్‌తో భారత్ తమ క్యాంపైన్‌ను ప్రారంభించనుంది.
సెప్టెంబర్ 9న జపాన్‌తో, సెప్టెంబర్ 11న మలేషియాతో, 12న కొరియాతో, 14న పాకిస్థాన్‌తో తలపడనుంది. సెప్టెంబర్ 17న ఫైనల్ జరగనుంది.
భారత జట్టు:
డిఫెండర్స్: జర్మన్‌ప్రీత్ సింగ్, అమిత్ రోహిదాస్, హర్మన్‌ప్రీత్ సింగ్(కెప్టెన్), జుగ్‌రాజ్ సింగ్, సంజయ్, సుమిత్
మిడ్ ఫీల్డర్స్: రాజ్‌కుమార్ పాల్, నీలకంఠ శర్మ, వివేక్ సాగ్ ప్రసాద్(వైస్ కెప్టెన్), మహమ్మద్ రహీల్ మౌసీన్
గోల్ కీపర్స్: క్రిషన్ బహదూర్ పాఠక్, సూరజ్ కర్కేరా.
ఫార్వర్డ్స్: అభిషేక్, సుఖ్‌జిత్ సింగ్, అరైజీత్ సింగ్ హుందాల్, ఉత్తమ్ సింగ్, గుర్జోత్ సింగ్.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications