Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

Asian Champions Trophy: పాకిస్థాన్‌పై భారత్ ఘన విజయం! సెమీస్‌కు దూసుకెళ్లిన మన్‌ప్రీత్ సేన

Harmanpreet and Akashdeep score as India register 3-1

ఢాకా: ఏషియన్ చాంపియన్స్ ట్రోఫీ 2021లో భారత హకీ జట్టు జోరు కొనసాగుతుంది. చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్‌తో శుక్రవారం జరిగిన లీగ్ మ్యాచ్‌లో మన్‌ప్రీత్ సింగ్ నేతృత్వంలోని భారత హాకీ జట్టు.. 3-1 తేడాతో గెలుపొందింది. హర్మన్ ప్రీత్ రెండు గోల్స్ సాధించగా.. ఆకాశ్ దీప్ ఒక గోల్‌తో భారత విజయంలో కీలక పాత్ర పోషించారు. దాంతో పాయింట్స్ టేబుల్లో అగ్రస్థానంలో నిలిచిన భారత్.. సెమీ ఫైనల్‌కు దూసుకెళ్లింది. టోక్యో ఒలింపిక్స్‌లో చారిత్రాత్మక బ్రాంజ్ మెడల్ తర్వాత తొలిసారి ఈ టోర్నీ ఆడుతున్న భారత్ హాకీ జట్టు.. కొరియాతో జరిగిన తొలి మ్యాచ్‌ను 2-2తో డ్రా చేసుకుంది. ఇక బంగ్లందేశ్‌ను 9-0తో చిత్తు చేసింది. ఇప్పుడే అదే జోరులో దాయాదీ పాక్‌ను కూడా మట్టికరిపించింది.

ఫస్టాఫ్‌లో హర్మన్ ప్రీత్ గోల్ సాధించడంతో భారత్ 1-0తో ఆధిక్యంలో నిలిచింది. సెకండ్ క్వార్టర్‌లో ఈ లీడ్‌ను ఆకాశ్ దీప్ డబుల్ చేయగా.. మూడో క్వార్టర్‌కు ముందు పాక్ సైతం ఖాతా తెరవడంతో స్కోర్లు 2-1గా మారి ఉత్కంఠకు దారితీసింది. అయితే చివరి క్వార్టర్‌లో హర్మన్ ప్రీత్ మరో గోల్ కొట్టడంతో భారత్ ఆధిక్యం 3-1గా మారి విజయం లాంఛనమైంది.

Story first published: Friday, December 17, 2021, 17:44 [IST]
Other articles published on Dec 17, 2021
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+