Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

Asian Champions Trophy ఛాంపియన్‌గా భారత్.. ఫైనల్లో చైనాపై ఘన విజయం!

పురుషుల హాకీ ఆసియా ఛాంపియన్స్ ట్రోఫీ 2024లో డిఫెండింగ్ ఛాంపియన్ భారత్ విజేతగా నిలిచింది. మంగళవారం జరిగిన ఫైనల్లో భారత్ 1-0తో చైనాను చిత్తు చేసి టైటిల్‌ను సొంతం చేసుకుంది. 13 ఏళ్ల ఛాంపియన్స్ ట్రోఫీ చరిత్రలో భారత్‌కు ఇది ఐదో టైటిల్ కావడం విశేషం. భారత్ తరఫున జుగ్‌రాజ్ సింగ్(50వ నిమిషం) ఏకైక గోల్ నమోదు చేశాడు.

ఈ టోర్నీలో హర్మన్‌ప్రీత్ సింగ్ సారథ్యంలోని భారత హాకీ టీమ్ ఓటమెరుగని జట్టుగా టైటిల్‌ను అందుకుంది. ఫైనల్‌తో సహా వరుసగా ఏడు మ్యాచ్‌ల్లో విజయం సాధించింది. పారిస్ ఒలింపిక్స్ 2024లో బ్రాంజ్ మెడల్ సాధించిన భారత్.. ఆసియా ఛాంపియన్స్ ట్రోఫీలోనూ అదే జోరును కొనసాగించింది.

Asian Champions Trophy 2024 India beat China 1-0 to clinch 5th title

లీగ్ మ్యాచ్‌లో భారత్‌తో తేలిపోయిన చైనా.. ఫైనల్లో మాత్రం గట్టి పోటీ ఇచ్చింది. గోల్స్ కోసం ఇరు జట్లు హోరా హోరీగా తలపడ్డాయి. భారత అవకాశాలను చైనా సమర్థవంతంగా అడ్డుకుంది. దాంతో వరుసగా మూడు క్వార్టర్స్‌లో ఇరు జట్లు గోల్స్ నమోదు చేయలేకపోయాయి. మ్యాచ్ మరో 10 నిమిషాలలో ముగుస్తుందనగా.. జుగ్‌రాజ్ సింగ్ బంతిని గోల్ పోస్ట్‌లోకి పంపించి 1-0తో ఆధిక్యాన్ని అందించాడు.

భారత్ అవకాశాలు వృథా..
తొలి క్వార్టర్స్‌లో భారత్‌కు లభించిన అవకాశాలను చైనా డిఫెన్స్ విభాగం అద్భుతంగా అడ్డుకుంది. పెనాల్టీ కార్నర్‌ను కూడా భారత్ సద్వినియోగం చేసుకోలేకపోయింది. రెండో క్వార్టర్ ఆరంభంలో భారత ఆటగాడు మహమ్మద్ రహీల్ గ్రీన్ కార్డ్ హెచ్చరికకు గురయ్యాడు. దాంతో 2 నిమిషాల పాటు అతను మైదానం వీడాడు.

గోల్స్ రాకపోయినా భారత్ తన ఆధిపత్యాన్ని చెలాయించింది. పూర్తిగా బంతిని తమ ఆధీనంలో ఉంచుకొని ప్రత్యర్థి గోల్ పోస్ట్‌పై దాడులు చేసింది. ఫస్టాఫ్ గోల్స్ లేకుండానే ముగిసింది. మూడో క్వార్టర్‌లో చైనాకు పెనాల్టీ కార్నర్ లభించగా.. భారత అద్భుతంగా అడ్డుకుంది. భారత గోల్ పోస్ట్‌పై దాడులు చేసిన చైనా.. ఒత్తిడిని పెంచింది. కానీ ఎలాంటి తప్పిదం చేయకుండా భారత్ తన ఆటను కొనసాగించింది. చివరి క్వార్టర్‌లో గోల్ నమోదు చేసి విజయ లాంఛనాన్ని పూర్తి చేసింది.

ఈ టోర్నీలో చైనాపై 3-0, జపాన్‌పై 5-0, మలేసియాపై 8-1, కొరియాపై3-1, పాకిస్థాన్‌పై 2-1 తేడాతో నెగ్గిన భారత్.. సెమీఫైనల్లో 4-1తో సౌత్ కొరియాను మట్టికరిపించింది.

Story first published: Tuesday, September 17, 2024, 17:29 [IST]
Other articles published on Sep 17, 2024
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+