For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

Vandana Katariya కుల వివక్ష వివాదంలో మరో వాదన తెరపైకి!

Another Angle in Casteist Remarks Against Vandana Katariya Family

న్యూఢిల్లీ: ప్రతిష్టాత్మక టోక్యో ఒలింపిక్స్‌లో మహిళా హాకీ ప్లేయర్ వందనా కటారియా హ్యాట్రిక్ గోల్స్‌‌తో క్వార్టర్ చేరిన భారత్.. ఆ తర్వాత సెమీస్ చేరి చరిత్ర సృష్టించింది. ఒలింపిక్స్ చరిత్రలోనే భారత మహిళల హాకీ టీమ్‌కు ఇదే అత్యుత్తమ ప్రదర్శన. అయితే సెమీస్‌లో మన అమ్మాయిలు ఆ జోరును కొనసాగించలేకపోయారు.

ఆ తర్వాత కాంస్యపోరులో ఆఖరి క్షణం వరకు పోరాడి తృటిలో మెడల్ చేజార్చుకున్నారు. విజయం సాధించకున్నా అత్యుత్తమ ప్రదర్శనతో అందరి మనసులు గెలుచుకున్నారు. అయితే సెమీస్‌లో అర్జెంటీనా చేతిలో ఓడిన తర్వాత వందనా కటారియా ఇంటి ముందు కొందరు కులం పేరుతో గొడవ చేశారు. హరిద్వార్ పోలీసులు ఈ ఘటనలో ముగ్గురిని ఎస్సీ/ఎస్టీ చట్టం కింద అదులోకి తీసుకున్నారు.

కీరా నారాయణన్ : IPL యాంకర్ హాట్ ఫోటోలు

తెరపైకి మరో వాదన...

తెరపైకి మరో వాదన...

అయితే ఈ వివాదంలో ఇప్పుడు మరో వాదన తెరపైకి వచ్చింది. కుల వివక్ష వ్యాఖ్యలతో పాటు తమ ఇంటి ముందు టపాసులు కాల్చారని వందన కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నప్పటికీ.. నిందితుల కుటుంబ సభ్యులు మాత్రం మరో వాదనను వినిపిస్తున్నారు.

పాత కక్ష్యల నేపథ్యంలోనే ఈ ఆరోపణలు చేస్తున్నారని, తమ వారు ఎలాంటి కుల వివక్ష వ్యాఖ్యలు చేయలేదంటున్నారు. ఈ ఘటనలో విజయ్ పాల్‌తో పాటు మరో ఇద్దరిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఉత్తరాఖండ్‌ హరిద్వార్‌‌లోని రోషనాబాద్ గ్రామంలో ఇరుకైన వీధిలో వందన కుటుంబం నివసిస్తోంది. వారి కుటుంబానికి 40 మీటర్ల దూరంలో నిందితుడు విజయ్ పాల్ ఇల్లు ఉంది.

పాత గొడవలే కారణం..

పాత గొడవలే కారణం..

వందన కుటుంబంతో వారికి పాత గొడవలున్నట్లు విజయ్ పాల్ తల్లి చెప్పింది. 'ఆరోజు మా అబ్బాయికి ఒంట్లో బాలేదు. జ్వరం, దగ్గుతో లోపల మంచం మీద పడుకుని ఉన్నాడు. అప్పుడే మా మేడ మీద టపాకాయలు కాలుస్తున్న శబ్దం వినిపించింది. మేము పరిగెత్తుకుని వెళ్లి చూసాం. మా కుటుంబాల మధ్య ఉన్న పాత గొడవల నేపథ్యంలో ఎవరో కావాలనే ఈ పనిచేసి మమ్మల్ని ఇరికించే ప్రయత్నం చేశారు' అని కవితా పాల్ బీబీసీతో అన్నారు.

కావాలనే తమ తమ్ముడిని ఇందులో ఇరికిస్తున్నారని, గతంలో కూడా తన తమ్ముడితో వందన సోదరులు గొడవపడ్డారని. కొట్టుకున్నారని కూడా విజయపాల్ అక్క తెలిపింది. తమ వాదన ఏంటో తెలుసుకోవడానికి మీడియా వాళ్లు ఎవరూ తమ ఇంటికి రాలేదని ఆమె ఆవేదన వ్యక్తం చేసింది.

కులం పేరుతో దూషించారా?

కులం పేరుతో దూషించారా?

ఈ ఘటనలో విజయ్ పాల్‌పై ఎస్సీ/ఎస్టీ చట్టం కింద పోలీసులు కేసు నమోదు చేశారు. టపాసులు విషయం జరిగిన గొడవని వందన సోరుడు లఖన్ తెలపగా.. ఆమె పెద్దన్నయ్య మాత్రం ఫిర్యాదులో కులం పేరుతో దూషించారని పేర్కొన్నాడు. 'ఈ గొడవలో కులం ప్రస్తావనే లేదు. కొందరు కావాలనే ఈ అంశాన్ని వివాదాస్పదం చేస్తున్నారు.

సమస్య కేవలం టపాసులు కాల్చడం గురించే.'అని వందన సోదరుడు లఖన్ చెప్పారు. వందనా కటారియా సోదరుడు చంద్రశేఖర్ లిఖితపూర్వక ఫిర్యాదు ఆధారంగానే సెక్షన్ 504 (ప్రొవొకేషన్ యాక్ట్) కింద, ఎస్సీ/ఎస్టీ చట్టం కింద విజయ్ పాల్‌పై ఎఫ్ఐఆర్ నమోదు చేశామని, తదుపరి విచారణ కొనసాగుతోందని హరిద్వార్ ఎస్ఎస్‌పీ సెంథిల్ అవుదై కృష్ణ రాజ్ ఎస్ పేర్కొన్నారు.

దళిత సంఘాల మద్దతు

దళిత సంఘాల మద్దతు

వివిధ దళిత సంఘాలకు చెందిన వ్యక్తులు, దేశ వ్యాప్తంగా ఉన్న ప్రజలు వందన‌కు మద్దతు తెలుపుతున్నారు. టపాసులు కాల్చినవారిపై దేశద్రోహం, ఎన్ఎస్ఏ కింద కేసులు పెట్టి శిక్షించాలని వారు డిమాండ్ చేస్తున్నారు. ఆ ప్రాంత బీజేపీ ఎమ్మెల్యే దేశరాజ్ కర్న్‌వాల్ సైతం వందన కుటుంబానికి అండగా నిలిచారు. ఆయన కూడా అలా చేసిన వారిపై ఎస్సీ/ఎస్టీ చట్టంతో పాటు దేశద్రోహం కింద కేసు నమోదు చేయాలని కోరారు. ఈ కేసును సరైన రీతిలో విచారణ జరిపించాలని, అమాయకుడికి శిక్ష పడకూడదన్నారు.

Story first published: Monday, August 9, 2021, 14:36 [IST]
Other articles published on Aug 9, 2021
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+