ఆగ్రహం: మహిళా రిపోర్టర్‌కు లైవ్‌లో ముద్దు (వీడియో)

హైదరాబాద్: రష్యా వేదికగా జరుగుతున్న 21వ వరల్డ్ కప్‌ను కవర్ చేసేందుకు వెళ్లిన మహిళా రిపోర్టర్లకు చేదు అనుభవాలు ఎదురవుతున్నాయి. జూన్ 15న కొలంబియా జర్నలిస్ట్ జూలియెత్ గొంజాలెజ్ ఓ జర్మన్ ఛానెల్‌కు లైవ్ రిపోర్టింగ్ ఇస్తున్న సమయంలో ఓ వ్యక్తి వచ్చి ముద్దు పెట్టిన సంగతి తెలిసిందే.
వరల్డ్ కప్‌లో ఏరోజు ఏమ్యాచ్ | వరల్డ్ కప్ 2018 పాయింట్ల పట్టిక | వరల్డ్ కప్ 2018 పూర్తి షెడ్యూల్
జూలియెత్ గొంజాలెజ్ ఫిఫా వరల్డ్ కప్ కవరేజిలో భాగంగా జర్మన్ చానెల్ డష్ వెలెకు ఆమె పని చేస్తోంది. మ్యాచ్ చూసేందుకు వచ్చిన వీక్షకులను ఓ వీధిలో నిలబడి లైవ్ రిపోర్టింగ్ ఇస్తున్న సమయంలో ఓ వ్యక్తి వచ్చి ఆమె చెంపపై ముద్దు పెట్టి వెళ్లిపోయాడు. ఈవీడియోని జూలియెత్ గొంజాలెజ్ స్వయంగా ట్విట్టర్‌లో అభిమానులతో పంచుకుంది.
రెండు గంటలుగా ఉన్నా
"తాను ఆ స్పాట్‌లో రెండు గంటలుగా ఉన్నానని, అయితే లైవ్ రిపోర్టింగ్ మొదలు పెట్టే వరకు ఆ వ్యక్తి వేచి చూశాడని" ఆమె చెప్పింది. లైవ్‌లో ఇలా చేస్తే తాను వెంటనే రియాక్టయ్యే అవకాశం ఉండదని భావించి అతనిలా చేసినట్లు జూలియెత్ వెల్లడించింది.
ఓ ఆకతాయి ఆమెకు ముద్దు పెట్టే ప్రయత్నం
తాజాగా బ్రెజిల్‌కు చెందిన స్పోర్ట్ జర్నలిస్ట్ జూలియా గుమారాస్, యోకాటెరిన్‌బర్గ్ నుంచి రిపోర్ట్ చేస్తున్న సమయంలో ఓ ఆకతాయి ఆమెకు ముద్దు పెట్టే ప్రయత్నం చేశాడు. రిపోర్టింగ్ సమయంలో అప్రమత్తతో ఉన్న జూలియా ఆకతాయి నుంచి తప్పించుకున్నారు. ఇంకెప్పుడు ఇలా చేయకు అంటూ జూలియా అతనిపై ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఓ మహిళ పట్ల ఇలా ప్రవర్తించడం సరైనది కాదు
"ఇది మంచి పద్దతి కాదు.. ఓ మహిళ పట్ల ఇలా ప్రవర్తించడం సరైనది కాదు.. దీనిని రిపీట్ చేయకు" అని అతడిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అనంతరం ఈ ఘటనపై జూలియా ట్విటర్‌లో స్పందించారు. "ఆ ఘటన గురించి చెప్పడానికి మాటలు రావడం లేదు. అదృష్టవశాత్తు నేను తప్పించుకున్నాను. ఇక్కడ ఇలా జరగడం రెండోసారి" అని అన్నారు.
ఇదే రకమైన అనుభవం ఎదురైంది
"రష్యా, ఈజిప్ట్ మధ్య జరిగిన ప్రపంచకప్ తొలి మ్యాచ్ సమయంలో కూడా మాస్కోలో ఇదే రకమైన అనుభవం ఎదురైంది. రష్యాలో కొన్ని పరిస్థితలు చాలా ఇబ్బందికరంగా ఉన్నాయి" అని ఆమె ట్విట్టర్‌లో రాసుకొచ్చింది. ఆకతాయి ఘటనకు సంబంధించి జూలియా సమయస్ఫూర్తిని తోటి జర్నలిస్టులతో పాటు నెటిజన్లు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications