Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

ఫిఫా వరల్డ్ కప్: చెవిటి పిల్లి జోస్యం మళ్లీ నిజమైంది

World Cup official animal soothsayer foresees Iran’s victory over Morocco

హైదరాబాద్: రష్యా వేదికగా జరుగుతున్న ఫిఫా వరల్డ్‌కప్‌ మ్యాచ్ ఫలితాలపై అంచనా వేస్తున్న చెవిటి పిల్లి అచెల్లె జోస్యం నిజమైంది. టోర్నీ ఆరంభ మ్యాచ్‌లో రష్యా గెలుస్తుందని అచెల్లె అంచనా వేసిన సంగతి తెలిసిందే. అది చెప్పినట్లే ఆరంభ మ్యాచ్‌లో సౌదీ అరేబియాపై రష్యా 3-0తేడాతో విజయం సాధించిన సంగతి తెలిసిందే.

వరల్డ్ కప్‌లో ఏరోజు ఏమ్యాచ్ | వరల్డ్ కప్‌ 2018 పాయింట్ల పట్టిక | వరల్డ్ కప్ 2018 పూర్తి షెడ్యూల్

తాజాగా శుక్రవారం రాత్రి మొరాకో‌పై ఇరాన్‌ జట్టు గెలుస్తుందని అంచనా వేసింది. శుక్రవారం సెయింట్ పీటర్స్‌బర్గ్‌లో ఇరాన్-మొరాకో జట్ల మధ్య జరిగిన మ్యాచ్ చివరి వరకు ఉత్కంఠ భరితంగా సాగింది. 90 నిమిషాల్లో ఒక గోల్‌ కూడా నమోదు కాకపోవడంతో.. అదనంగా మరో ఆరు నిమిషాలు కేటాయించారు.

World Cup official animal soothsayer foresees Iran’s victory over Morocco

ఆయినా సరే, తొలి నాలుగు నిమిషాల్లో గోల్ నమోదు కాకపోవడంతో మ్యాచ్ డ్రాగా ముగుస్తుందని అంతా భావించారు. కానీ, 95వ నిమిషంలో మొరాకో సెల్ఫ్ గోల్‌తో ఇరాన్‌ని గెలిపించింది. మొరాకో డిఫెండర్ ఎషాన్ హాజీ షఫీ ఫ్రీకిక్‌ను.. సబ్‌స్టిట్యూట్ ఆటగాడు అజీజ్‌ తలతో బంతిని గోల్‌పోస్ట్ అవతలకి నెట్టబోయాడు.

అయితే, అజీజ్ బొహౌద్దౌజ్ గురితప్పడంతో బంతి మొరాకో గోల్‌పోస్టులోకి దూసుకెళ్లింది. అజీజ్ పొరపాటుకు మొరాకో భారీ మూల్యం చెల్లించింది. ఆట చివరి నిమిషాల్లో గోల్ కావడంతో ఇరాన్ ఆటగాళ్లు సంబురాల్లో మునగగా.. అజీజ్ కన్నీటిపర్యంతమయ్యాడు. దీంతో తోటి ఆటగాళ్లు అతన్ని ఓదార్చుతూ మైదానం బయటకు తీసుకెళ్లారు.

World Cup official animal soothsayer foresees Iran’s victory over Morocco

ఈ మ్యాచ్‌కి ముందు ఇరాన్, మొరాకో జెండాల పక్కన బౌల్స్‌తో ఆహారాన్ని ఉంచగా.. అచిల్లీస్ ఇరాన్ జెండా పక్కన ఉన్న ఆహారాన్ని ఆరగించింది. గత 20 ఏళ్లలో ప్రపంచకప్‌ మ్యాచ్‌లో గెలవడం ఇరాన్‌కి ఇదే తొలిసారి.

Story first published: Saturday, June 16, 2018, 15:24 [IST]
Other articles published on Jun 16, 2018
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+