అరుదైన ఘనత: ఐదు వరల్డ్ కప్‌లు ఆడిన మూడో ఆటగాడిగా రఫీల్

హైదరాబాద్: రష్యా వేదికగా జరుగుతున్న ఫిఫా వరల్డ్ కప్‌లో మెక్సికో కెప్టెన్ రఫీల్ మార్‌క్యూజ్ అరుదైన ఘనత సాధించాడు. టోర్నీలో భాగంగా ఆదివారం డిఫెండింగ్ ఛాంపియన్ జర్మనీతో మెక్సికో తలపడింది. ఈ మ్యాచ్‌లో 39 ఏళ్ల రఫీల్ మార్‌క్యూజ్ 74వ నిమిషంలో సబ్‌స్టిట్యూట్ ప్లేయర్‌గా మైదానంలోకి దిగాడు.
వరల్డ్ కప్‌లో ఏరోజు ఏమ్యాచ్ | వరల్డ్ కప్ 2018 పాయింట్ల పట్టిక | వరల్డ్ కప్ 2018 పూర్తి షెడ్యూల్
రఫీల్‌కు ఇది ఐదో ప్రపంచకప్. దీంతో ఐదు ఫిఫా వరల్డ్ కప్‌లు ఆడిన మూడో ఆటగాడిగా రఫీల్ మార్‌క్యూజ్ అరుదైన రికార్డుని తన పేరిట లిఖించాడు. రఫీల్ కంటే ముందు ఇద్దరు ఫుట్‌బాల్ ఆటగాళ్లు మాత్రమే ఐదు వరల్డ్ కప్‌లు ఆడారు. ఆ ఇద్దరిలో ఒకరు మెక్సికోకు చెందిన ఆంటోనియో కార్బజల్ కాగా, మరొకరు జర్మనీకి చెందిన లోథర్ మాథువాస్.

బెంచ్‌కే పరిమితమైన జియాన్‌లుగి బఫాన్
మరోవైపు ఇటలీకి చెందిన జియాన్‌లుగి బఫాన్ కూడా ఐదు వరల్డ్ కప్‌ల్లో పాలు పంచుకున్నాడు. కానీ, మొదటిసారి ప్రపంచకప్‌కు ఎంపికైనప్పుడు అతడు మైదానంలోకి దిగలేదు. బెంచ్‌కే పరిమితం కావడం విశేషం. 2002, 2006, 2010, 2014, 2018 వరుసగా ఐదు ప్రపంచకప్ పోటీల్లో రఫీల్ ఆడాడు.

1996లో ప్రొఫెషనల్ కెరీర్‌ను ప్రారంభించిన రఫీల్
1996లో ప్రొఫెషనల్ కెరీర్‌ను ప్రారంభించిన రఫీల్ మార్‌క్యూజ్ 2003 నుంచి 2010 మధ్య కాలంలో బార్సిలోనా క్లబ్‌కు ప్రాతినిథ్యం వహించాడు. తన చివరి రెండు క్లబ్ సీజన్లలో మెక్సికోకు చెందిన అట్లాస్ జట్టు తరుపున ఆడాడు. ప్రస్తుతం రఫీల్ వయసు 39 ఏళ్లు. బహుశా రఫీల్ ఆడే చివరి వరల్డ్ కప్ ఇదే కావొచ్చు.

తొలి మ్యాచ్‌లోనే జర్మనీకి షాకిచ్చిన మెక్సికో
కాగా, డిఫెండింగ్ ఛాంపియన్‌గా వరల్డ్ కప్ టోర్నీలోకి అడుగుపెట్టిన జర్మనీకి తొలి మ్యాచ్‌లోనే మెక్సికో షాకిచ్చింది. వరల్డ్ నంబర్‌వన్ జర్మనీ తొలి మ్యాచ్‌లో పరాజయం పాలైంది. గత ఏడు వరల్ కప్‌ల్లో జర్మనీ జట్టు ఓటమన్నదే లేకుండా జైత్రయాత్ర కొనసాగిస్తుండగా.. తాజా మ్యాచ్‌లో పరాజయంతో ఈ రికార్డుకు తెరపడింది.
ఆదివారం 1-0తో జర్మనీపై విజయం సాధించిన మెక్సికో
టోర్నీలో భాగంగా ఆదివారం అండర్‌డాగ్ మెక్సికోతో జరిగిన మ్యాచ్‌లో జర్మనీ జట్టు 0-1 తేడాతో ఓటమి పాలైంది. మెక్సికో ఫార్వర్డ్ ప్లేయర్ హిర్వింగ్ లొజానో 34వ నిమిషంలో సూపర్‌గోల్‌తో వరల్డ్ కప్ చరిత్రలో జర్మనీపై మెక్సికోకు రెండో విజయాన్నందించాడు. 1982 ప్రపంచకప్‌లో మాత్రమే మెక్సికో జర్మనీని ఓడించగా.. మళ్లీ ఇన్నేళ్లకు జర్మనీపై మెక్సికో ఘన విజయం సాధించింది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications