న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
ఇండియన్ సూపర్ లీగ్ అంచనాలు
VS

గెలిచిన సంతోషంలో ఫొటోగ్రాఫర్‌కు ముద్దు పెట్టిన క్రొయేషియా ప్లేయర్

By Nageshwara Rao
World Cup: Croatia players crash into photographer, kiss him in goal celebration

హైదరాబాద్: రష్యా వేదికగా జరుగుతున్న ఫిఫా వరల్డ్ కప్‌లో ఓ ఆసక్తికర సంఘటన చోటు చేసుకుంది. టోర్నీలో భాగంగా గురువారం జరిగిన రెండో సెమీఫైనల్లో ఇంగ్లాండ్-క్రొయేషియా జట్లు తలపడ్డాయి. మాస్కోలోని లుజ్నికీ స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్‌లో ఇంగ్లాండ్‌పై 2-1 తేడాతో గెలిచి తొలిసారిగా ఫైనల్‌కు చేరింది.

వరల్డ్ కప్‌లో ఏరోజు ఏమ్యాచ్ | వరల్డ్ కప్‌ 2018 పాయింట్ల పట్టిక | వరల్డ్ కప్ 2018 పూర్తి షెడ్యూల్

ఆదివారం జరిగే ఫైనల్లో క్రొయేషియా జట్టు ఫ్రాన్స్‌తో తలపడనుంది. ఫిఫా వరల్డ్‌కప్ చరిత్రలో ఫైనల్‌ చేరడం క్రొయేషియాకు ఇదే తొలిసారి. దీంతో ఇంగ్లాండ్‌పై విజయం సాధించిన తర్వాత క్రొయేషియా జట్టు సంబరాల్లో మునిగిపోయింది. ఆ జట్టు సంబరాల్లో అనుకోకుండా ఓ ఫొటోగ్రాఫర్‌ కూడా భాగస్వామ్యమయ్యాడు.

1
958083

సోషల్ మీడియాలో ఫోటోలు వైరల్

ఇందుకు సంబంధించిన ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఆట 109వ నిమిషం(ఎక్స్‌ట్రా టైమ్)లో మారియో మండ్జుకిక్‌ గోల్‌ కొట్టాడు. ఆ ఆనందంలో అతడు సంబరాలు చేసుకుంటూ బౌండరీ లైన్‌ వద్దకు వచ్చాడు. అదే సమయంలో ఫొటోగ్రాఫర్‌ యూరీ కార్టజ్‌ తన కెమెరా లెన్స్‌ మార్చుకుంటున్నాడు.

మారియో వచ్చి అనుకోకుండా యూరీపై పడ్డాడు

మారియో వచ్చి అనుకోకుండా యూరీపై పడ్డాడు

అదే సమయంలో మారియో వచ్చి అనుకోకుండా యూరీపై పడటంతో ఇద్దరూ కింద పడిపోయారు. ఈ క్రమంలో మారియో తన సంబరాలను ఆపలేదు. యూరీతోనే కలిసి సంబరాలు చేసుకున్నాడు. ఇద్దరూ కలిసి నవ్వుకుంటూ ఫొటోలు దిగారు. అనంతరం మారియో.. యూరీని పైకి లేపగా మరో ఆటగాడు కింద పడిపోయిన లెన్స్‌ను యూరీ చేతికిచ్చాడు.

యూరీ కోసం ప్రత్యేకంగా ఫొటోలకు ఫోజులు

యూరీ కోసం ప్రత్యేకంగా ఫొటోలకు ఫోజులు

ఆ తర్వాత ఆటగాళ్లంతా యూరీ కోసం ప్రత్యేకంగా ఫొటోలకు ఫోజులిచ్చారు. ఈ మ్యా‌చ్‌లో రెండు జట్లు అంచనాలు లేకుండానే బరిలోకి దిగినప్పటికీ క్రొయేషియానే విజయం సాధించడం విశేషం. ఆట ప్రారంభమైన 5 నిమిషాలకే ఇంగ్లాండ్‌ ఆటగాడు కీరన్‌ ట్రిప్పర్‌ గోల్‌కొట్టి తమ జట్టును ఆధిక్యంలో నిలిపాడు.

తొలి అర్దభాగంలో ఒకే ఒక్క గోల్

తొలి అర్దభాగంలో ఒకే ఒక్క గోల్

దీంతో తొలి అర్దభాగంలో ఒకే ఒక్క గోల్ నమోదైంది. ఇక, రెండో అర్ధభాగంలో క్రొయేషియా ఆటగాడు ఇవాన్‌ పెరిసిక్‌ 68వ నిమిషంలో గోల్‌ కొట్టి జట్టు స్కొరును సమం చేశాడు. ఇక అదనపు సమయంలో మారియో మండ్జుకిక్‌ 109 నిమిషంలో గోల్‌ చేసి క్రొయేషియాను విజయ తీరాలకు చేర్చాడు. 1998 వరల్డ్ కప్‌లో సెమీఫైనల్‌ చేరుకోవడమే క్రొయేషియా జట్టు అత్యుత్తమ ప్రదర్శన కావడం విశేషం.

Story first published: Thursday, July 12, 2018, 15:57 [IST]
Other articles published on Jul 12, 2018
-
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X