Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

వరల్డ్ కప్ రికార్డు: 10లక్షల మంది, ఫ్యాన్స్‌తో నిండుతున్న స్టేడియాలు

FIFA World Cup : More Than One Million Fans Have Attended Games
World Cup attendances pass one million mark: FIFA

హైదరాబాద్: రష్యా వేదికగా జరుగుతోన్న ఫిఫా వరల్డ్ కప్‌కు అభిమానులు బ్రహ్మరథం పడుతున్నారు. జూన్ 14న మాస్కోలోని లుజ్నికి స్టేడియంలో ఆతిథ్య రష్యా-సౌదీ అరేబియా జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌లో ఫిఫా వరల్డ్ కప్ అధికారికంగా ప్రారంభమైన సంగతి తెలిసిందే.

వరల్డ్ కప్‌లో ఏరోజు ఏమ్యాచ్ | వరల్డ్ కప్‌ 2018 పాయింట్ల పట్టిక | వరల్డ్ కప్ 2018 పూర్తి షెడ్యూల్

పెద్ద సంఖ్యలో రష్యాకు అభిమానులు

పెద్ద సంఖ్యలో రష్యాకు అభిమానులు

ఈ వరల్డ్ కప్ కోసం ప్రపంచ వ్యాప్తంగా పెద్ద సంఖ్యలో అభిమానులు రష్యాకు చేరుకున్నారు. వరల్డ్ కప్ మ్యాచ్‌లను ప్రత్యక్షంగా వీక్షించేందుకు అభిమానులు పోటీ పడుతున్నారు. తాజాగా ఫిఫా విడుదల చేసిన నివేదిక ప్రకారం 10 లక్షల మందికిపైగా అభిమానులు మైదానాలకు వచ్చి మ్యాచ్‌లను వీక్షించారు.

 21 మ్యాచ్‌లు ముగిసే సమయానికే

21 మ్యాచ్‌లు ముగిసే సమయానికే

టోర్నీలో భాగంగా గురువారం డెన్మార్క్‌-ఆస్ట్రేలియా మధ్య మ్యాచ్‌ జరిగింది. రష్యా వేదికగా జరుగుతున్న ఈ వరల్డ్ కప్ టోర్నీలో ఇది 21వ మ్యాచ్‌. 21 మ్యాచ్‌లు ముగిసే సమయానికే 10 లక్షల మందికి పైగా అభిమానులు మ్యాచ్‌లను చూసేందుకు వచ్చినట్లు టోర్నీ నిర్వాహకులు అధికారికంగా నివేదిక విడుదల చేశారు.

97 శాతం గ్యాలరీలు అభిమానుల

97 శాతం గ్యాలరీలు అభిమానుల

టోర్నీలోని ప్రతి మ్యాచ్‌ కూడా 97 శాతం గ్యాలరీలు అభిమానులతో నిండుతున్నట్లు ఫిఫా అధికారులు తెలిపారు. మిగతా మ్యాచ్‌లతో పోల్చితే ఉరుగ్వే-ఈజిప్టు మధ్య జరిగిన మ్యాచ్‌కు అభిమానులు తక్కువ సంఖ్యలో హాజరయ్యారు.

ఈ మ్యాచ్‌ కోసం కేటాయించిన టిక్కెట్లలో ఆరు వేల టిక్కెట్లు అమ్ముడుపోలేదు.

 రష్యాతో పాటు పలు దేశాలకు చెందిన అభిమానులు

రష్యాతో పాటు పలు దేశాలకు చెందిన అభిమానులు

టోర్నీ ప్రారంభమైనప్పటి నుంచి ఈ మ్యాచ్‌ వరకు రష్యాతో పాటు పలు దేశాలకు చెందిన అభిమానులు పెద్ద సంఖ్యలో స్టేడియాలకు వచ్చి మ్యాచ్‌లను వీక్షించారని ఫిఫా అధికారులు వెల్లడించారు.

Story first published: Saturday, June 23, 2018, 10:46 [IST]
Other articles published on Jun 23, 2018
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+