For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఫిఫా వరల్డ్ కప్: అంచనాలు నిజయమ్యేనా?, నాకౌట్‌ బరిలో నిలిచే జట్లివే!

By Nageshwara Rao
World Cup 2018 last 16: match dates, quarter-final predictions and teams

హైదరాబాద్: రష్యా వేదికగా జరుగుతున్న ఫిఫా వరల్డ్ కప్‌లో లీగ్ దశ సమరం ముగిసింది. రౌండ్-16(నాకౌట్)లో ఎవరితో ఎవరు ఎప్పుడు తలపడబోతున్నారో స్పష్టమైంది. దీంతో అసలు సిసలు పోటీ ప్రారంభం కానుంది. శనివారం నుంచి నాకౌట్ స్టేజి మ్యాచ్‌లు జరగనున్నాయి.

వరల్డ్ కప్‌లో ఏరోజు ఏమ్యాచ్ | వరల్డ్ కప్‌ 2018 పాయింట్ల పట్టిక | వరల్డ్ కప్ 2018 పూర్తి షెడ్యూల్

దీంతో మూడు మ్యాచ్‌ల్లో కలిపి మూడు పాయింట్లే సాధించిన జర్మనీ అనూహ్య రీతిలో గ్రూప్ దశలోనే వరల్డ్ కప్ నుంచి నిష్క్రమించింది. 1938 తర్వాత జర్మనీ ప్రపంచకప్‌ గ్రూప్‌ దశలో నిష్క్రమించడం ఇదే తొలిసారి. మొత్తం 32 జట్లు పాల్గొన్న ఈ 21వ ఫిఫా వరల్డ్ కప్‌లో రౌండ్-16(నాకౌట్)కు 16 జట్లు అర్హత సాధించాయి.

నాకౌట్‌కు అర్హత సాధించిన 16 జట్లలో ఉరుగ్వే, రష్యా, స్పెయిన్, పోర్చుగల్, ఫ్రాన్స్, డెన్మార్క్, క్రొయేషియా, అర్జెంటీనా, బ్రెజిల్, స్విట్జర్లాండ్, స్వీడన్, మెక్సికో, కొలంబియా, జపాన్, బెల్జియం, ఇంగ్లాండ్‌లు ఉన్నాయి. మిగతా జట్లతో పోలిస్తే రష్యా వరల్డ్ కప్‌లో అర్జెంటీనా, పోర్చుగల్, ఉరుగ్వే, ఫ్రాన్స్, ఇంగ్లండ్, స్పెయిన్‌లు ఫేవరేట్‌గా ఉన్నాయి.

ఈ ఆరు జట్లు నాకౌట్ స్టేజి దాటి క్వార్టర్‌ ఫైనల్ చేరాలంటే స్థాయికి తగ్గట్టుగా రాణించాలి. కాగా పుట్‌బాల్ విశ్లేషకులు, జ్యోతిషులు మాత్రం అర్జెంటీనా, ఉరుగ్వే, స్పెయిన్, క్రొయేషియా, బ్రెజిల్, బెల్జియం, స్వీడన్, స్విట్జర్లాండ్, ఇంగ్లాండ్ క్వార్టర్ ఫైనల్స్‌కు చేరతాయని అంచనా వేస్తున్నారు.

టోర్నీలో భాగంగా తొలి రోజు నాకౌట్ పోటీల్లో అర్జెంటీనాతో ఫ్రాన్స్.. పోర్చుగల్‌తో ఉరుగ్వే తలపడనున్నాయి. ఈ నాలుగు జట్లలో రెండు జట్లే క్వార్టర్స్‌కు అర్హత సాధిస్తాయి. గతంలో చెరో రెండు సార్లు వరల్డ్ కప్ టైటిల్స్ నెగ్గిన అర్జెంటీనా, ఉరుగ్వే నాకౌట్ నుంచి నిష్క్రమిస్తే పెను సంచలనమే అవుతుంది.

మరోవైపు ఫ్రాన్స్, పోర్చుగల్ నిష్క్రమించినా టోర్నీ కళ తప్పుతుందని అంటున్నారు. ఇక పటిష్టమైన స్పెయిన్ జట్టుతో ఆతిధ్య రష్యాతో ఆడనుంది. 2010లో తొలి సారి వరల్డ్ చాంపియన్‌గా నిలిచిన స్పెయిన్‌కు, గ్రూప్ దశలో అంచనాలకు మించి రాణించింది.

ఇక, లీగ్ స్టేజిలో ఆఖరి మ్యాచ్‌లో ఓటమి పాలైన ఇంగ్లాండ్ జట్టు నాకౌట్‌ స్టేజిలో కొలింబియాతో తలపడనుంది. ఐదు సార్లు ప్రపంచ ఛాంపియన్‌గా నిలిచిన బ్రెజిల్ మాత్రం మెక్సికోపై నెగ్గి సులువుగానే క్వార్టర్స్‌కు చేరుకునే అవకాశం ఉంది.

ఫిఫా వరల్డ్ కప్ నాకౌట్ షెడ్యూల్:

జూన్ 30, శనివారం
రాత్రి 7.30 గంటలకు: ఫ్రాన్స్ Vs అర్జెంటీనా
రాత్రి 11.30 గంటలకు : ఉరుగ్వే Vs పోర్చుగల్

జులై 1, ఆదివారం
రాత్రి 7.30 గంటలకు : స్పెయిన్ Vs రష్యా
రాత్రి 11.30 గంటలకు : క్రొయేషియా Vs డెన్మార్క్

జులై 2, సోమవారం
రాత్రి 7.30 గంటలకు: బ్రెజిల్ Vs మెక్సికో
రాత్రి 11.30 గంటలకు : బెల్జియం Vs జపాన్

జులై 3, మంగళవారం
రాత్రి 7.30 గంటలకు: స్వీడన్ Vs స్విట్జర్లాండ్
రాత్రి 11.30 గంటలకు : కొలంబియాVs ఇంగ్లాండ్

Story first published: Friday, June 29, 2018, 16:01 [IST]
Other articles published on Jun 29, 2018
-
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+