మెస్సీ జట్టుని ఇంటికి పంపిన రొనాల్డో అభిమాని: ఎవరీ కైలిన్ ఎంబాపె


హైదరాబాద్: కైలిన్ ఎంబాపె.... ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా మార్మోగుతున్న పేరు. అర్జెంటీనాతో మ్యాచ్ ముందు వరకు కైలిన్ ఎంబాపె గురించి బహుశా ఎవరికి తెలియకపోవచ్చు. కానీ, ఇప్పుడు ఈ ఫ్రాన్స్ ఫుట్‌బాలర్ గురించి నెటిజన్లు ఆసక్తిగా గూగ్‌ల్‌లో సెర్చ్ చేస్తున్నారు.
వరల్డ్ కప్‌లో ఏరోజు ఏమ్యాచ్ | వరల్డ్ కప్ 2018 పాయింట్ల పట్టిక | వరల్డ్ కప్ 2018 పూర్తి షెడ్యూల్
కారణం... 19 ఏళ్ల ఈ ఫ్రాన్స్ కుర్రాడు అర్జెంటీనాపై రెండు గోల్స్ చేసి.. మెస్సీ జట్టును ఇంటికి పంపించడంతో పాటు ఫ్రాన్స్‌ను వరల్డ్ కప్ క్వార్టర్ ఫైనల్‌కు చేర్చడంలో కీలకపాత్ర పోషించాడు. నాలుగు నిమిషాల వ్యవధిలో రెండు గోల్స్ చేసి ఫ్రాన్స్‌కు విజయాన్ని కట్టబెట్టాడు.

4-3 తేడాతో అర్జెంటీనాపై ప్రాన్స్ విజయం
దీంతో టోర్నీలో భాగంగా శనివారం అర్జెంటీనాతో జరిగిన నాకౌట్ పోరులో ఫ్రాన్స్ 4-3 తేడాతో విజయం సాధించింది. కీలక మ్యాచ్‌లో రెండు గోల్స్ చేసి జట్టు విజయంలో కీలకపాత్ర పోషించడంతో పాటు కైలిన్ ఎంబాపె మరో అరుదైన ఘనతను సొంతం చేసుకున్నాడు. ఒక ప్రపంచకప్ మ్యాచ్‌లో రెండు గోల్స్ చేసిన రెండో పిన్న వయస్కుడిగా రికార్డు సృష్టించాడు. పుట్‌బాల్ దిగ్గజం పీలే (17 సంవత్సరాల 8 నెలల 6 రోజులకు) ఫిపా ప్రపంచకప్‌లో ఒక మ్యాచ్‌లో రెండు గోల్స్ చేసిన అతి చిన్న వయస్కుడిగా తొలి స్థానంలో ఉన్నాడు.
స్వీడన్‌పై రెండు గోల్స్ చేసి పీలే
1958 సాకర్ ఫైనల్ సమరంలో స్వీడన్‌పై రెండు గోల్స్ చేసి పీలే ఈ ఘనత సాధించాడు. 60 సంత్సరాల అనంతరం ఫ్రాన్స్ ఆటగాడు కైలిన్ ఎంబాపె (19 సంవత్సరాల 6 నెలల 10 రోజులు) అర్జెంటీనాపై రెండు గోల్స్ చేయడంతో అత్యంత చిన్న వయసులో ఈ ఘనత సాధించిన రెండో ఆటగాడిగా రికార్డు నెలకొల్పాడు. అర్జెంటీనా- ఫ్రాన్స్ మ్యాచ్ అనంతరం ఎంబాపెకు ట్విటర్ ద్వారా పీలే అభినందనలు కూడా తెలిపాడు.

1998లో ప్రపంచకప్ గెలిచిన ప్రాన్స్
చివరిసారిగా ఫ్రాన్స్ 1998లో ప్రపంచకప్ గెలిచింది. ఆ కప్పు ఫ్రాన్స్ నెగ్గేనాటికి ఎంబాపె పుట్టనేలేదు. ఆ ఏడాది డిసెంబర్‌లో పుట్టాడు. చిన్నప్పటి నుంచి ఎంబాపెకే పుట్ బాల్ అంటే ప్రాణం. ఇంట్లో, వీధిలో ఎక్కడ చూసినా బంతితోనే కనబడేవాడు. ఎంబాపె తండ్రి కూడా స్థానిక ఎఎస్ బాండి ఫుట్‌బాల్ కోచ్ కూడా. దీంతో 16 ఏళ్ల వయసులోనే ప్రొఫెషనల్ ఫుట్‌బాల్ కెరీర్ ఆరంభించాడు.

క్రిస్టియానో రొనాల్డోకు ఎంబాపె వీరాభిమాని
పదిహేడేళ్ల వయసులోనే ఫ్రాన్స్‌కు ప్రాతినిధ్యం వహించాడు. పోర్చుగల్ స్టార్ ప్లేయర్ క్రిస్టియానో రొనాల్డోకు ఎంబాపె వీరాభిమాని. చిన్నప్పుడు ఎంబాపె పడకగది మొత్తం రొనాల్డో పోస్టర్లే ఉండేవట. ‘‘ఎంబాపె వయసు 19 ఏళ్లు కావొచ్చు. 40 ఏళ్ల వయసు వ్యక్తిలా ఆలోచిస్తాడు. చాలా తెలివిగా నిర్ణయాలు తీసుకుంటాడు. ఆ వయసులో అలా ఆలోచించే కుర్రాడిని నేను ఎక్కడా చూడలేదు. క్రమశిక్షణకు ప్రాధాన్యమిస్తాడు. మిగతా కుర్రాళ్లలా పార్టీలకు ప్రాధాన్యమివ్వడు. దృష్టి ఎప్పుడూ ఫుట్‌బాల్‌పైనే. నాకింకా గుర్తు. ఫ్రాన్స్ అండర్-17 కప్ నెగ్గినప్పుడు ఎంబపె దగ్గర మొబైల్ కూడా లేదు'' అని అతడి గురించి బాగా తెలిసిన వ్యక్తి చెప్పాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications