
హైదరాబాద్: రష్యాలో జరుగుతున్న ఫిఫా వరల్డ్‌కప్‌తో జపాన్ తరఫున అత్యధిక మ్యాచ్‌లాడిన ఆ జట్టు స్టార్ ప్లేయర్ కీసుకె హోండా అంతర్జాతీయ ఫుట్‌బాల్‌కు వీడ్కోలు పలికాడు. టోర్నీలో భాగంగా నాకౌట్ దశలో బెల్జియం చేతిలో జపాన్ ఓడిపోవడంతో కీసుకె హోండా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
వరల్డ్ కప్‌లో ఏరోజు ఏమ్యాచ్ | వరల్డ్ కప్ 2018 పాయింట్ల పట్టిక | వరల్డ్ కప్ 2018 పూర్తి షెడ్యూల్
జపాన్ ఓటమి అనంతరం "ఈ రోజుతో జాతీయ జట్టుతో నా కెరీర్ ముగిసింది. అయితే మా జట్టులో ఎంతోమంది యువఆటగాళ్లు ఉండటం ఎంతో ఆనందంగా ఉంది. వాళ్లు కచ్చితంగా జపాన్ ఫుట్‌బాల్‌కు నూతన చరిత్రను సృష్టిస్తారని ఆశిస్తున్నాన్నా" అని 32 ఏళ్ల కీసుకె పేర్కొన్నాడు.
జపాన్ తరఫున అత్యధికంగా 98 అంతర్జాతీయ మ్యాచ్‌లాడిన కీసుకె హోండా మొత్తం 37 గోల్స్ కొట్టాడు. కాగా, రష్యా వేదికగా జరుగుతున్న 21వ ఫిఫా వరల్డ్ కప్‌తో వరుసగా ఆరో వరల్డ్ కప్‌లో పాల్గొన్న ఈ ఆసియా జట్టుగా జపాన్ నిలిచింది. గతంలో జరిగిన ఫిఫా వరల్డ్ కప్ టోర్నీల్లో ఏ జట్టు కూడా నాకౌట్ స్టేజి వరకు చేరుకోలేదు.
కానీ ఈ వరల్డ్‌కప్‌లో గ్రూప్ దశలో భాగంగా పొలెండ్‌తో జరిగిన ఆఖరి మ్యాచ్‌లో ఓడినా.. తొలిసారి ఫేయిర్ ప్లే పాయింట్ల ఆధారంగా జపాన్ మొదటిసారి నాకౌట్‌కు అర్హత సాధించింది. గ్రూపు దశలో భాగంగా తొలి మ్యాచ్‌లో కొలంబియాపై 2-1తో విజయం సాధించిన జపాన్, ఆ తర్వాత సెనెగల్‌తో జరిగిన మ్యాచ్‌ని డ్రాగా ముగించింది. ఇక పొలెండ్‌తో జరిగిన చివరి మ్యాచ్‌లో 1-0తో ఓడినప్పటికీ నాకౌట్‌కు అర్హత సాధించిన రెండో జట్టుగా జపాన్ అరుదైన రికార్డు నెలకొల్పింది.
సోమవారం బెల్జియంతో జరిగిన నాకౌట్ మ్యాచ్‌లో జపాన్‌పై బెల్జియం 3-2తేడాతో విజయం సాధించింది. ఉత్కంఠ భరితంగా సాగిన ఈ మ్యాచ్‌లో తొలి అర్ధభాగం ముగిసే వరకు ఇరు జట్లు ఒక్క గోల్ కూడా చేయక పోవడం విశేషం. దీంతో రెండో అర్ధభాగం ఆసక్తిగా మారింది.
రెండో అర్దభాగం ప్రారంభమైన కొద్ది సేపటికే జపాన్ ఆటగాడు జెంకీ హరగూచి గోల్ చేసి జట్టుకు ఆధిక్యాన్ని ఇచ్చాడు. ఆ తర్వాత 52వ నిమిషంలో టకాషి ఇనూయ్ మరో గోల్ చేయడంతో జపాన్‌కు 2-0 ఆధిక్యంలో నిలిచింది. దీంతో జపాన్ అభిమానులు సంబరాల్లో మునిగిపోయారు.
ఆ తర్వాత 69వ నిమిషంలో జాన్ వెట్రోన్‌గన్ గోల్ చేసి జపాన్ ఆధిక్యాన్ని 1-2కు తగ్గించాడు. దీంతో ఆట మరింత రసవత్తరంగా మారింది. 74వ నిమిషంలో ఫిల్లైని మరో గోల్ చేయడంతో ఇరు జట్ల స్కోరు 2-2తో సమం అయింది. ఇంజూరీ సమయంలో జపాన్ కంటే బెల్జియం ఆటగాళ్లు ప్రత్యర్ధి జట్టు గోల్ పోస్టుపై దాడులను తీవ్రతరం చేశారు. ఈ సమయంలో 90+4వ నిమిషంలో నసెర్ చడ్లి గోల్ చేయడంతో బెల్జియం 3-2 ఆధిక్యంలోకి దూసుకెళ్లింది.
దీంతో మరో రెండు నిమిషాల సమయం మాత్రమే మిగిలి ఉంది. చివర్లో జపాన్ దూకుడుగా ఆడినప్పటికీ మరో గోల్ చేయలేకపోయింది. దీంతో జపాన్‌పై 3-2 తేడాతో మ్యాచ్ గెలిచిన బెల్జియం క్వార్టర్స్ చేరుకుంది. ఫుట్‌బాల్ వరల్డ్ కప్ చరిత్రలో బెల్జియం క్వార్టర్స్‌కు చేరడం మూడోసారి కాగా, వరల్డ్ కప్ నాకౌట్ గేమ్‌లో 2-0 వెనుకబడి ఆపై విజయాన్ని అందుకోవడం 48 ఏళ్లలో ఇదే తొలిసారి కావడం విశేషం.