క్వార్టర్ ఫైనల్స్: ఫ్రాన్స్ Vs ఉరుగ్వే, కలవరపెడుతోన్న కవాని గాయం!

హైదరాబాద్: రష్యా వేదికగా జరుగుతున్న వరల్డ్ కప్ మరో అంకానికి రంగం సిద్ధమైంది. ముప్ఫై రెండు జట్లతో మొదలైన టోర్నీ అత్యుత్తమంగా నిలిచిన ఆఖరి ఎనిమిది జట్లు క్వార్టర్ ఫైనల్స్‌లో సత్తా చాటేందుకు సిద్ధమయ్యాయి. క్వార్టర్ ఫైనల్స్‌లో భాగంగా శుక్రవారం ఉరుగ్వే-ఫ్రాన్స్ జట్ల మధ్య తొలి మ్యాచ్ జరగనుంది.
వరల్డ్ కప్‌లో ఏరోజు ఏమ్యాచ్ | వరల్డ్ కప్ 2018 పాయింట్ల పట్టిక | వరల్డ్ కప్ 2018 పూర్తి షెడ్యూల్
ఈ మ్యాచ్‌లో బలమైన ఎటాకింగ్‌ను కలిగి ఉన్న ఫ్రాన్స్ ఫేవరెట్‌గా బరిలోకి దిగుతోంది. ఈ వరల్డ్ కప్‌లో ఫ్రాన్స్ తన ప్రయాణాన్ని నిదానంగా మొదలుపెట్టింది. ఆస్ట్రేలియా, పెరూపై గెలిచి, డెన్మార్క్‌తో డ్రా చేసుకుంది. ప్రి క్వార్టర్స్‌లో మాత్రం అర్జెంటీనాపై అద్భుత ప్రదర్శన చేసింది. మొత్తమ్మీద ఈ రెండు జట్లు ఇప్పటివరకు ఆడిన నాలుగు మ్యాచ్‌ల్లో ఏడు గోల్స్ చేశాయి.

అపార అనుభవం ఉన్న డిగో గోడిన్
శుక్రవారం జరిగే మ్యాచ్‌లో అపార అనుభవం ఉన్న డిగో గోడిన్, జిమెనెజ్, క్యాసెరెస్, లక్జాల్ట్‌ల ఆధ్వర్యంలోని ఉరుగ్వే డిఫెండర్లకు గ్రీజ్‌మన్, ఎంబాపెల ఫ్రాన్స్ ఫార్వర్డ్స్‌కు మధ్య జరిగే పోరాటంగా పుట్‌బాల్ విశ్లేషకులు అభివర్ణిస్తున్నారు. ఈ వరల్డ్‌కప్‌లో ఉరుగ్వే జట్టు అద్భుతమైన రికార్డుని నెలకొల్పింది.

గోల్ కూడా ఇవ్వకుండానే ఐదు గోల్స్
ప్రత్యర్ధి జట్లకు గోల్ కూడా ఇవ్వకుండానే ఐదు గోల్స్ చేసి లీగ్ స్టేజిని ముగించింది. నాకౌట్‌లో పోర్చుగల్‌తో గోల్ ఇచ్చినప్పటికీ, అందుకు ప్రతిగా రెండు గోల్స్ కొట్టింది. స్టార్ స్ట్రయికర్ సురెజ్ ఫామ్ భరోసానిస్తున్నా, ప్రి క్వార్టర్స్‌లో రెండు గోల్స్‌తో గెలిపించిన మరో స్టార్ ఎడిన్సన్ కవాని గాయం ఉరుగ్వేను కలవరపరుస్తోంది.

ఉరుగ్వేను కలవరపెడుతోన్న కవాని గాయం
అతడు ఆడలేకపోతే ఆ జట్టుకు అది పెద్ద నష్టమే. ప్రిక్వార్టర్స్‌లో రెండు గోల్స్‌తో జట్టును విజయపథంలో నడిపించిన 19 ఏళ్ల యువ స్ట్రైకర్ ఎంబాపెపై ఫ్రాన్స్ ఎన్నో ఆశలు పెట్టుకుంది. అతడికి గ్రీజ్‌మన్, గిరౌడ్, ఉస్మాన్ డంబెల్ తోడైతే విజయం ఫ్రాన్స్‌దే. దీంతో ఫ్రాన్స్-ఉరుగ్వే జట్ల మధ్య జరగనున్న మ్యాచ్ ఆసక్తికరంగా మారనుంది.

ఉరుగ్వే కోచ్ ఆస్కార్ తబ్రెజ్ మాట్లాడుతూ
ఉరుగ్వే కోచ్ ఆస్కార్ తబ్రెజ్ మాట్లాడుతూ "ఫ్రాన్స్‌కు ఒక్కసారి అవకాశం ఇచ్చామో వారిని అందుకోవడం చాలా కష్టం" అని ఇప్పటికే వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. మరోవైపు ఫ్రాన్స్ కోచ్ డెచాంప్స్ మాట్లాడుతూ "బలమైన ఉరుగ్వే నుంచి భిన్న ఆట ఎదురుకావొచ్చు" అని అన్నాడు. కాగా, వరల్డ్ కప్‌లో క్వార్టర్‌ఫైనల్ చేరిన గత ఐదు సందర్భాల్లో ఫ్రాన్స్ నాలుగుసార్లు నెగ్గింది.
* ఉరుగ్వే (vs) ఫ్రాన్స్ రాత్రి గం. 7.30 నుంచి
* సోనీ ఈఎస్‌పీఎన్, సోనీ టెన్-2, 3లలో ప్రత్యక్ష ప్రసారం
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications