ఈ టోర్నీ సరైన వేదిక కాదు: రష్యాలో ఇరాన్ మహిళల నిరసనపై కెప్టెన్

హైదరాబాద్: అరబ్ దేశాల చట్టాలు మహిళల విషయంలో ఎంత కఠినంగా ఉంటాయో అన్న సంగతి తెలిసిందే. ముఖ్యంగా ఇరాన్ దేశంలో పురుషులు ఆడే క్రీడలను వీక్షించేందుకు మహిళలకు మైదానంలోకి ప్రవేశించడానికి అనుమతిలేదు. ఇది అక్కడి కఠిన చట్టాల్లో ఒకటి.
వరల్డ్ కప్‌లో ఏరోజు ఏమ్యాచ్ | వరల్డ్ కప్ 2018 పాయింట్ల పట్టిక | వరల్డ్ కప్ 2018 పూర్తి షెడ్యూల్
అయితే, 1979 విప్లవం సందర్భంగా వచ్చిన ఈ చట్టాన్ని ఎత్తివేయాలని ఇరాన్ మహిళలు కొంతకాలం నుంచి ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కానీ ప్రభుత్వం నుంచి ఎటువంటి స్పందన లేదు. అంతేకాదు దీనిపై నిరసన వ్యక్తం చేసేందుకు కూడా వారికి అనుమతిని అక్కడి ప్రభుత్వం నిరాకరించింది.

ఇరాన్ మహిళల నిరసన
ఇలా అయితే లాభం లేదనున్న ఇరాన్ మహిళలు తమ నిరసనను ప్రపంచం మొత్తం తెలియజాలనుకున్నారు. రష్యాలో జరుగుతున్నఫిఫా వరల్డ్ కప్‌ను ఇందుకు వేదికగా ఎంచుకున్నారు. టోర్నీలో భాగంగా బుధవారం నాడు ఇరాన్ జట్టు స్పెయిన్‌తో తలపడనుంది.

మహిళలను నిషేధించకూడదు
దీంతో తమ నిరసనను ప్రపంచం దృష్టికి తీసుకెళ్లడానికి ఇదే మంచి అవకాశం అని భావించిన ఇరానీ మహిళలు మ్యాచ్ జరిగే కజాన్ ఎరినాలో "మహిళలను నిషేధించకూడదు (#NoBan4Women), ‘ఇరానీ మహిళలు స్టేడియంలోకి వచ్చేందుకు మద్దతు తెలపండి" అని రాసివున్న ప్లకార్డులను పట్టుకుని జనాల మధ్య నిల్చున్నారు.

ఇరానీ కెప్టెన్ మసౌద్ షోజాయి మాట్లాడుతూ
ఇరానీ మహిళలు చేస్తున్న నిరసన గురించి ఆ దేశ ఫుట్‌బాల్ జట్టు కెప్టెన్ మసౌద్ షోజాయి మాట్లాడుతూ "ఇరాన్ మహిళల సమస్యల గురించి చర్చించడానికి ఈ టోర్నీ సరైన వేదిక కాదు. మనమంతా ఒకే కుటుంబం... మన సమస్యల గురించి మనం మన ఇంటిలోపలే చర్చించుకోవాలి. ఇక్కడ మనమంతా ఒకే దేశం. ఈ విషయాన్ని తర్వాత చర్చిద్దాం" అని అన్నాడు.

ఇరాన్-మొరాకో జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌లో కూడా
ఇదిలా ఉంటే, సెయింట్ పీటర్స్‌బర్గ్ స్టేడియంలో ఇరాన్-మొరాకో జట్ల మధ్య మ్యాచ్ జరిగిన సందర్భంలో కూడా ఇలాంటి పోస్టర్ అందరి దృష్టిని ఆకర్షించింది. ఈ మ్యాచ్ జరుగుతున్న సమయంలో "స్టేడియానికి వచ్చి మ్యాచ్‌లను వీక్షించేలా ఇరాన్ దేశానికి చెందిన మహిళలకు మద్దతుగా నిలవండి" అనే నినాదంతో కూడిన ఓ పోస్టర్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications