ఫిఫా ప్రపంచకప్.. భారత్‌లో నో లైవ్! ఎందుకంటే..?
ఫుట్‌బాల్ ప్రేమికులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఫిఫా ప్రపంచకప్ 2026 టోర్నీకి రంగం సిద్దమైంది. జూన్ 12 నుంచి ఈ సాకర్ ప్రపంచకప్‌కు తెరలేవనుంది. అమెరికా, కెనడా, మెక్సికో సంయుక్తంగా ఈ టోర్నీకి ఆతిథ్యం ఇస్తున్నాయి. ప్రపంచవ్యాప్తంగా అత్యంత ఆదరణ కలిగిన క్రీడల్లో ఫుట్‌బాల్‌ది అగ్రస్థానం అని చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు.
భారత్‌లో నో లైవ్..
ప్రతీ నాలుగేళ్లకు ఒకసారి జరిగే ఫిఫా ప్రపంచకప్ కోసం యావత్ ఫుట్‌బాల్ ప్రపంచం ఆసక్తిగా ఎదురుచూస్తోంది. కానీ భారత్‌లో మాత్రం ఫుట్‌బాల్ క్రేజ్ అంతంతమాత్రమే. కోల్‌కతా, కేరళ మినహా ఫుట్‌బాల్‌కు ఈ క్రికెట్ దేశంలో అంతగా ఆదరణ లేదు.
ఫుట్‌బాల్ చూసే ఫ్యాన్స్ ఉన్నప్పటికీ.. క్రికెట్‌తో పోల్చితే ఆ సంఖ్య చాలా తక్కువ. దాంతోనే భారత్ మినహా అంతర్జాతీయంగా ప్రపంచకప్ మ్యాచ్‌ల ప్రసార హక్కులను నిర్వాహకులు ఇప్పటికే కేటాయించారు. కానీ భారత్‌లో మాత్రం ప్రసార హక్కుల కోసం ఎవరూ ముందుకురాలేదు.

మ్యాచ్ టైమింగ్స్‌తో..
ఫుట్‌బాల్‌కు భారత్‌లో అంతగా ఆదరణ లేకపోడం, మ్యాచ్ టైమింగ్స్ భారత కాలమానానికి భిన్నంగా ఉండటం, ప్రసార హక్కుల ధరలు భారీ స్థాయిలో ఉండటంతో ఏ సంస్థ పెద్దగా ఆసక్తి చూపలేదు. ఈ క్రమంలో కేంద్ర ప్రభుత్వానికి చెందిన ప్రసారభారతిలో కనీసం కీలక మ్యాచ్‌లునైనా ఉచితంగా ప్రసారం చేయాలని ఢిల్లీ హైకోర్టులో ఓ పిటిషన్ దాఖలైంది. అయితే అది తమ బాధ్యత కాదని హైకోర్టులో ప్రసారభారతి స్పష్టం చేసింది. దాంతో ప్రపంచకప్ మ్యాచ్‌లను చూసే అవకాశం భారత అభిమానులకు లేకుండా పోయింది.
ప్రపంచకప్‌లో మొత్తం 104 మ్యాచ్‌ల్లో 90 గేమ్స్ భారత కాలమానం ప్రకారం అర్ధరాత్రి సమయంలో ప్రారంభమవుతాయి. జూలై 20న జరగనున్న ఫైనల్ కూడా అర్థరాత్రి 12.30 గంటలకు మొదలవుతుంది. ఆ సమయంలో మ్యాచ్‌లకు వ్యూయర్‌షిప్ పెద్దగా ఉండదనే ఏ సంస్థలు ప్రసార హక్కులు కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపడంలేదు.
భారత్‌కు ఫుట్‌బాల్ టీమ్ ఉన్నా..
భారత్‌కు ఫుట్‌బాల్ జట్టు ఉన్నప్పటికీ.. ఇప్పటి వరకు ప్రపంచకప్ టోర్నీకి అర్హత సాధించలేదు. ఆసియా స్థాయి వరకే పోటీపడుతోంది. భారత ఫుట్‌బాల్ టీమ్ బైచుంగ్ భూటియా, సునీల్ ఛెత్రి వంటి ఆటగాళ్లు మాత్రమే అభిమానులకు తెలుసు. మిగతా వారి గురించి పెద్దగా తెలియదు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications