Austria Vs Jordan: ఆస్ట్రియా గోల్ కొట్టినా ఇవ్వలేదు.. ఎందుకంటే..?
ఫిఫా ప్రపంచకప్ 2026 టోర్నీ ఆస్ట్రియా ఘన విజయంతో బోణీ కొట్టింది. గ్రూప్-జేలో భాగంగా శాన్ ఫ్రాన్సిస్కో బే ఏరియా స్టేడియంలో బుధవారం జరిగిన మ్యాచ్‌లో సమష్టిగా రాణించిన ఆస్ట్రియా 3-1 తేడాతో జోర్డాన్‌ను ఓడించింది. ఈ మ్యాచ్‌లో వీడియో అసిస్టెంట్ రెఫరీ (VAR) తీసుకున్న నిర్ణయం మైదానంలో హైడ్రామాను సృష్టించింది. గోల్ కొట్టినా ఇవ్వకపోవడం సోషల్ మీడియా వేదికగా తీవ్ర చర్చనీయాంశమైంది.
మ్యాచ్ 66వ నిమిషంలో ఆస్ట్రియా స్ట్రైకర్ మార్కో అర్నాటోవిక్ బంతిని గోల్ పోస్ట్‌లోకి పంపి తన జట్టును ఆధిక్యంలోకి తీసుకెళ్లాడు. ఆస్ట్రియా ఆటగాళ్లు అత్యంత ఉత్సాహంగా ఈ గోల్‌ను సెలెబ్రేట్ చేసుకుంటుండగా.. VAR వారికి ఊహించని షాకిచ్చాడు. నిబంధనలకు విరుద్దంగా ఉందని గోల్‌ను రద్దు చేశాడు.

ఈ గోల్ చేయడానికి ముందు ఆస్ట్రియా రైట్ బ్యాక్ స్టెఫాన్ పోష్ చేతికి బంతి తగిలినట్లు రీప్లేలో స్పష్టమైంది. సుదీర్ఘ సమీక్ష అనంతరం ఫీల్డ్ రెఫరీ దహానే బీడా పిచ్ సైడ్ మానిటర్‌ను పరిశీలించి ఈ గోల్‌ను తిరస్కరిస్తూ నిర్ణయం తీసుకున్నారు.
తడబడినా విజయం ఆస్ట్రియాదే..
గోల్ రద్దు కావడం ఆస్ట్రియా శిబిరంలో కాస్త నిరాశ నింపినప్పటికీ.. వారు ఎంతమాత్రం వెనక్కి తగ్గలేదు. కొద్ది నిమిషాలకే కార్నర్ కిక్‌ను క్లియర్ చేసే క్రమంలో జోర్డాన్ డిఫెండర్ యాజన్ అల్-అరబ్ సెల్ఫ్ గోల్ చేయడంతో ఆస్ట్రియాకు మళ్లీ ఆధిక్యం లభించింది. ఇక మ్యాచ్ ముగిసే సమయానికి లభించిన పెనాల్టీని అర్నాటోవిక్ గోల్‌గా మలిచి ఆస్ట్రియాకు 3-1తో ఘన విజయాన్ని ఖాయం చేశాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications