స్పెయిన్ టికి-టాకా వ్యూహం ఏంటి? సెమీఫైనల్లో ఫ్రాన్స్‌తో ఢీ!
ఫిఫా ప్రపంచకప్ 2026 టోర్నీ తుది దశకు చేరింది. బుధవారం అర్థరాత్రి(భారత కాలమానం ప్రకారం) టెక్సాస్‌లోని ఏటీఅండ్‌టీ స్టేడియంలో జరిగే తొలి సెమీఫైనల్లో మాజీ ఛాంపియన్స్ ఫ్రాన్స్, స్పెయిన్ అమీతుమీ తేల్చుకోనున్నాయి. క్వార్టర్ ఫైనల్లో మొరాకోను 2-0తో ఓడించిన ఫ్రాన్స్ సెమీస్‌కు అర్హత సాధించగా.. స్పెయిన్ 2-1తో బెల్జియంను మట్టికరిపించి లాస్ట్-4కు దూసుకొచ్చింది.
టోర్నీ ఆసాంతం అద్భుత ప్రదర్శన కనబర్చిన ఈ రెండు జట్ల మధ్య సమరం హోరాహోరీగా ఉండనుంది. ముఖ్యంగా ఈ రెండు జట్లు మైదానంలో భిన్నశైలిని అనుసరించనున్నాయి. దాంతో ఈ పోరుపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. స్పెయిన్ టికి-టాకా వ్యూహంతో అదరగొడుతుంటే.. ఫ్రాన్స్ మెరుపు వేగంతో ఆకట్టుకుంటుంది. దాంతో ఈ రెండు జట్ల భిన్నమైన శైలిలు తీవ్ర చర్చనీయాంశమయ్యాయి. మెగా సెమీఫైనల్‌కు ముందు వాటి గురించి తెలుసుకునేందుకు నెటిజన్లు తెగ ఆసక్తి కనబరుస్తున్నారు.

స్పెయిన్ టికి-టాకా వ్యూహం ఏంటి..?
ఫుట్‌బాల్ ప్రపంచంలో స్పెయిన్ జట్టు అనుసరించే టికి-టాకా వ్యూహానికి ప్రత్యేక గుర్తింపు ఉంది. ఈ వ్యూహం ప్రధాన సూత్ర- బంతిని ఆధీనంలో ఉంచుకోని, ప్రత్యర్థిని పరుగెత్తించి అలసిపోయేలా చేయడం. ఈ వ్యూహంలో భాగంగా ఆటగాళ్లు ఒకరికొకరు చాలా వేగంగా.. చిన్న చిన్న పాస్‌లు ఇచ్చుకుంటారు.
బంతి తమ వద్ద లేని ఆటగాళ్లు కూడా మైదానంలో నిరంతరం కదులుతూ.. సహచర ఆటగాడికి పాస్ ఇవ్వడానికి ఖాళీ ప్లేస్‌ను క్రియేట్ చేస్తారు. మ్యాచ్‌లో దాదాపు 60 నుంచి 70 శాతం వరకుబంతిని తమ ఆధీనంలో ఉంచుకుంటారు. ఒకవేళ బంతి చేజారితే.. సెకన్ల వ్యవధిలో తిరిగి దానిని లాక్కునేందుకు ఒత్తిడి తెస్తారు.
ఈ 'టికి-టాకా' వ్యూహాన్ని 2008-2012 మధ్య కాలంలో ఎఫ్‌సి బార్సిలోనా కోచ్‌గా ఉన్న పెప్ గార్డియోలా కనిపెట్టారు. ఇదే సూత్రంలో స్పెయిన్ గోల్డెన్ జనరేషన్ జట్టు 2008 యూరో కప్, 2010 ప్రపంచ కప్, అలాగే 2012 యూరో కప్‌లను సొంతం చేసుకుంది.
ఫ్రాన్స్ అస్త్రం.. మెరుపు వేగం, ప్రత్యర్థిపై అటాక్..
స్పెయిన్ టికి-టాకా వ్యూహంతో పోలిస్తే ఫ్రాన్స్ ఆటతీరు పూర్తిగా భిన్నంగా ఉంటుంది. వారు బంతిని ఎక్కువసేపు తమ వద్ద ఉంచుకోవాలని అనుకోరు. ప్రత్యర్థులకే అవకాశం ఇచ్చి, వారు తప్పు చేయగానే మెరుపు వేగంతో దూసుకెళ్తారు. ఫ్రాన్స్ ఆటగాళ్లు చాలా ఫిట్‌గా ఉంటారు. మైదానంలో చాలా వేగంగా పరుగెడుతారు. వారి స్ట్రెంగ్త్ కూడా చాలా ఎక్కువ. డిఫెన్స్ నుంచి అటాకింగ్‌కు సెకన్ల వ్యవధిలో మారిపోవడం వీరి ప్రత్యేకత. 1998, 2018 లలో ఫ్రాన్స్ ప్రపంచ కప్ గెలవడానికి ఈ హై-స్పీడ్ ట్రాన్సిషన్ గేమే ప్రధాన కారణం.
మ్యాచ్ ఎప్పుడంటే..?
భారత కాలమానం ప్రకారం జూలై 15(బుధవారం) అర్ధరాత్రి 12:30 గంటలకు స్పెయిన్, ఫ్రాన్స్ మధ్య తొలి సెమీఫైనల్ జరగనుంది. జీ5 ఓటీటీలో ఈ మ్యాచ్ చూడవచ్చు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications

