న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
ఇండియన్ సూపర్ లీగ్ అంచనాలు
VS

ఇంగ్లాండ్ ఓటమి: లైవ్‌లో రిపోర్టర్ ముఖంపై బీరు పోసిన అభిమాని (వీడియో వైరల్)

By Nageshwara Rao
WATCH: Fan throws beer at journalists face while reporting World Cup match

హైదరాబాద్: రష్యా వేదికగా జరుగుతున్న ఫిఫా వరల్డ్ కప్‌లో ఇంగ్లాండ్ ఆశలు ఆవిరయ్యాయి. టోర్నీలో భాగంగా క్రొయేషియాతో లుజ్నికి స్టేడియంలో జరిగిన మ్యాచ్‌లో ఇంగ్లాండ్‌ 1-2తో ఓడిపోయిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇంగ్లాండ్‌ అభిమానులు ఆవేదనకు గురయ్యారు.

వరల్డ్ కప్‌లో ఏరోజు ఏమ్యాచ్ | వరల్డ్ కప్‌ 2018 పాయింట్ల పట్టిక | వరల్డ్ కప్ 2018 పూర్తి షెడ్యూల్

ఇంగ్లాండ్ ఓటమితో భావోద్వేగానికి గురైన ఓ అభిమాని ఆవేశంతో లైవ్‌లో మాట్లాడుతున్న న్యూజిలాండ్‌ రిపోర్టర్‌పై బీరు పోశాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. వివరాల్లోకి వెళితే... వరల్డ్‌కప్‌ టోర్నీలో భాగంగా బుధవారం జరిగిన రెండో సెమీపైనల్లో ఇంగ్లాండ్-క్రోయేషియా జట్లు తలపడ్డాయి.

WATCH: Fan throws beer at journalists face while reporting World Cup match

ఈ మ్యాచ్‌లో ఇంగ్లాండ్‌పై 2-1తేడాతో గెలిచిన క్రోయేషియా ఫైనల్‌కు దూసుకెళ్లింది. చివరి వరకు ఉత్కంఠభరితంగా సాగిన ఈ మ్యాచ్‌ని న్యూజిలాండ్‌కు చెందిన ల్యాయిడ్‌ బుర్ర్‌ అనే జర్నలిస్టు వరల్డ్ కప్‌లో భాగంగా ఇంగ్లాండ్‌ నుంచి రిపోర్టింగ్‌ చేస్తున్నాడు. మ్యాచ్‌ అదనపు సమయం కూడా పూర్తి కావడంతో రిఫరీ 2-1తో క్రొయేషియా గెలిచినట్లు ప్రకటించాడు.

దీంతో ఇంగ్లాండ్‌ అభిమానుల పరిస్థితి ఎలా ఉందో ల్యాయిడ్‌ లైవ్‌లో వివరిస్తుండగా, అక్కడే ఉన్న ఓ అభిమాని అతని ముఖంపై బీర్‌ పోశాడు. అతని ఆవేశాన్ని అర్థం చేసుకున్న ల్యాయిడ్‌ అదేమీ పట్టించుకోకుండా తన ఏకాగ్రత కోల్పోకుండా రిపోర్టింగ్ కొనసాగించాడు. బీరు పోసిన వ్యక్తి మధ్యలో మరోసారి వచ్చి అసభ్యకరంగా మాట్లాడటం కూడా చేశాడు. దీంతో ఆ అభిమానిని ఇక్కడి నుంచి వెళ్లిపోవాలంటూ హెచ్చరించాడు.

మ్యాచ్ అనంతరం ఈ ఘటనపై ల్యాయిడ్‌ ట్విటర్‌ ద్వారా స్పందించాడు. "ఇంగ్లాండ్‌ అభిమానులు తమ జట్టుకు చాలా బాగా మద్దతు ఇచ్చారు. ఇంత గొప్ప మ్యాచ్‌ను ఇలాంటి వాతావరణంలో చూడటం ఉద్వేగంగా అనిపించింది. ఆ ఒక్క ఘటన తప్ప(ముఖంపై బీర్‌ చల్లడం తప్ప) మిగతా అంతా ఓకే. నేను, నా కెమెరామెన్‌ బాగానే ఉన్నాం. నాకు మద్దతుగా మెసేజ్‌లు పెడుతున్న వారందరికీ ధన్యవాదాలంటూ" అని ట్వీట్‌ చేశాడు. మద్యం సేవించి తనపై దాడికి పాల్పడింది ఆస్ట్రేలియా వ్యక్తి అని వెల్లడించాడు.

Story first published: Thursday, July 12, 2018, 20:55 [IST]
Other articles published on Jul 12, 2018
-
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X