For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

Goal of the Century: మారడోనా చేసిన ఆ గోల్‌కు యావత్ ప్రపంచమే నివ్వరపోయింది!

Watch Diego Maradona’s ‘Goal of the Century’ against England in 1986 World Cup
Diego Maradona : Argentina Soccer Legend Biography | Greatest Footballer | Goal of the Century

హైదరాబాద్: సాకర్‌‌ సామ్రాజ్యంలో ఒక శకం ముగిసింది. ఇంటర్నేషనల్‌‌ ఫుట్‌‌బాల్‌‌లో అత్యుత్తమ ప్లేయర్లలో ఒకడిగా వెలుగొందిన అర్జెంటీనా లెజెండ్‌‌ డీగో మారడోనా తుదిశ్వాస విడిచాడు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న 60 ఏళ్ల డీగో గుండెపోటుతో బుధవారం కన్నుమూశాడు. 17 ఏళ్ల పాటు కోట్లాది అభిమానులకు ఫుట్‌బాల్‌ అంటే డీగోనే.. అన్నంతగా ఆకట్టుకున్నాడు.

మరో పేరు గురించి ఆలోచించాల్సిన అవసరం కూడా లేకుండా అతను ఫుట్‌బాల్‌ను పరుగెత్తించాడు. అతను ఆడిందే ఆట... ఆడకపోయినా వార్త అన్నట్లు డిగో కెరీర్ కొనసాగింది. మారడోనా గొప్పతనం చెప్పేందుకు మాటలు అవసరం లేదు... అలా నడుస్తూ, పరుగెత్తుతూ కూడా అలవాటుగా కాలును గాల్లో ఆడించే అందరిలో మారడోనానే కనిపిస్తాడు.

వివాదాస్పద గోల్

వివాదాస్పద గోల్

మారడోనా కెరీర్‌ మొత్తానికి హైలైట్‌గా నిలిచిపోయిన మ్యాచ్‌ 1986 వరల్డ్‌ కప్‌లో జరిగింది. ఇంగ్లండ్‌తో జరిగిన క్వార్టర్‌ ఫైనల్‌ మ్యాచ్‌లో మారడోనా చేసిన గోల్‌ వివాదాస్పదమైంది. అతను తన చేత్తో బంతి నెట్టాడంటూ ఇంగ్లండ్‌ ఫిర్యాదు చేసింది. అయితే అప్పుడు మారడోనా... ‘నిజంగా చేతితో ఆ గోల్‌ చేసి ఉంటే అదో అదృశ్య హస్తం' అంటూ తెలివిగా బదులిచ్చాడు. చరిత్రలో ఇది ‘హ్యాండ్‌ ఆఫ్‌ గాడ్‌'గా నిలిచిపోయింది. దాదాపు 19 ఏళ్ల తర్వాత తాను చేత్తోనే గోల్‌ చేశానంటూ మారడోనా బహిరంగంగా ఒప్పుకున్నా...అప్పటికే అది చరిత్రలో లిఖించిపోయింది. అయితే ఈ గోల్‌ చేసిన 4 నిమిషాలతో అతను చేసిన మరో అద్భుత గోల్‌ విలువను వెల కట్టలేం. 62 మీటర్ల దూరం కవర్‌ చేస్తూ, 10 సెకన్ల వ్యవధిలో 5 మంది ఇంగ్లండ్‌ ఆటగాళ్లను తప్పించుకుంటూ అతను చేసిన గోల్‌కు ప్రపంచం నివ్వెరపోయింది. 2002లో ‘ఫిఫా' గోల్‌ ఆఫ్‌ ద సెంచరీ అంటూ దీనికి గుర్తింపునిచ్చింది. ఈ ప్రదర్శన మారడోనా ఘనతను ఎప్పటికీ నిలిచిపోయేలా చేసింది.

మారడోనా కెరీర్ సాగిందిలా..

మారడోనా కెరీర్ సాగిందిలా..

పుట్టిన తేదీ: అక్టోబర్‌ 30, 1960

పుట్టిన స్థలం: బ్యూనస్‌ ఎయిర్స్, అర్జెంటీనా

1976 అర్జెంటీనా జూనియర్‌ జట్టులో స్థానం, అరంగేట్రం

1977 అర్జెంటీనా సీనియర్‌ జట్టులో చోటు

1986 మెక్సికోలో జరిగిన ప్రపంచకప్‌లో కెప్టెన్‌గా బరిలోకి దిగి అర్జెంటీనాను విశ్వవిజేతగా నిలిపాడు. ఇంగ్లండ్‌తో జరిగిన క్వార్టర్‌ ఫైనల్లో అర్జెంటీనాకు 2-1తో విజయాన్ని అందించాడు. ఈ మ్యాచ్‌లో మారడోనా సాధించిన రెండు గోల్స్‌ చరిత్రలో నిలిచిపోయాయి.

1994 అమెరికాలో జరిగిన ప్రపంచకప్‌ సందర్భంగా డోపింగ్‌ పరీక్షలో దొరికిపోయాడు. టోర్నీ మధ్యలోనే స్వదేశానికి పంపించారు. 15 నెలలపాటు సస్పెన్షన్‌.

1997 రివర్‌ ప్లేట్‌ క్లబ్‌తో కెరీర్‌లో చివరి మ్యాచ్‌ ఆడాడు.

2000 కొకైన్‌ అడిక్షన్‌ నుంచి విముక్తికి క్యూబాలో రిహాబిలిటేషన్‌.

2005 సొంత టీవీ కార్యక్రమం నిర్వహించాడు.

2008-2010 రెండేళ్లపాటు అర్జెంటీనా జాతీయ సీనియర్‌ జట్టుకు కోచ్‌గా వ్యవహరించాడు. దక్షిణాఫ్రికా ఆతిథ్యమిచ్చిన 2010 ప్రపంచకప్‌లో మారడోనా కోచ్‌గా ఉన్న అర్జెంటీనా క్వార్టర్‌ ఫైనల్లో నిష్క్రమించింది.

ప్రొఫెషనల్‌ క్రీడాకారుడిగా...

ప్రొఫెషనల్‌ క్రీడాకారుడిగా...

ఆడిన మ్యాచ్‌లు: 585

చేసిన గోల్స్‌: 311

గెలిచిన టైటిల్స్‌ 9

అర్జెంటీనా తరఫున...

ఆడిన మ్యాచ్‌లు 91

చేసిన గోల్స్‌ 34

ఆడిన ప్రపంచకప్‌లు 4

ఆడిన ప్రపంచకప్‌లు 4

1982: రెండో రౌండ్‌లో నిష్క్రమణ

1986: విజేత

1990: రన్నరప్‌

1994: ప్రిక్వార్టర్‌ ఫైనల్‌

నవంబర్‌ 25, 2020: గుండెపోటుతో బ్యూనస్‌ ఎయిర్స్‌లో కన్నుమూత

Story first published: Thursday, November 26, 2020, 13:20 [IST]
Other articles published on Nov 26, 2020
-
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+