For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

వీసా లేకుండా ఈ ఏడాది మొత్తం ఉచితం: ఫిఫా అభిమానులకు శుభవార్త

By Nageshwara Rao
Vladimir Putin Gives World Cup Fans Visa-Free Russia Entry All Year

హైదరాబాద్: రష్యా వేదికగా జరిగిన ఫిపా వరల్డ్ కప్‌కు హాజరైన అభిమానులకు నిజంగా ఇది శుభవార్తే. జులై 15(ఆదివారం)తో రష్యాలో ఫిఫా వరల్డ్‌కప్ పోటీలు ముగిసిన సంగతి తెలిసిందే. అయితే, వరల్డ్‌కప్ పోటీలు ముగిసినప్పటికీ... ఈ ఏడాది మొత్తం వీసా లేకుండా విదేశీ అభిమానులు రష్యాలో పర్యటించొచ్చు.

వరల్డ్ కప్‌లో ఏరోజు ఏమ్యాచ్ | వరల్డ్ కప్‌ 2018 పాయింట్ల పట్టిక | వరల్డ్ కప్ 2018 పూర్తి షెడ్యూల్

రష్యా అధ్యక్షుడు వ్లాదమిర్ పుతినే స్వయంగా ఈ విషయాన్ని వెల్లడించారు. అయితే, ఫ్యాన్‌ ఐడీ కార్డులు ఉన్న విదేశీయులకు మాత్రమే ఇది వర్తించనుంది. సుమారు నెలరోజుల పాటు రష్యా వేదికగా జరిగిన ఫిఫా వరల్డ్‌కప్ టోర్నీలోని మ్యాచ్‌లను స్వయంగా వీక్షించేందుకు గాను ప్రపంచ వ్యాప్తంగా సుమారు 10 లక్షల మంది సాకర్ అభిమానులు రష్యాకు వెళ్లారు.

Vladimir Putin Gives World Cup Fans Visa-Free Russia Entry All Year

వరల్డ్‌కప్ సందర్భంగా విదేశాల నుంచి రష్యాకు వచ్చే అభిమానుల కోసం ప్రత్యేకంగా ఫ్యాన్‌ ఐడీలను రష్యా ప్రభుత్వం జారీ చేసిన సంగతి తెలిసిందే. అయితే ఈ ఫ్యాన్‌ ఐడీల కాలపరిమితి జులై 25 వరకు మాత్రమే ఉంది. అయితే ప్రస్తుతం దీని కాలపరిమితిని పెంచుతూ తాజాగా సోమవారం రష్యా నిర్ణయం తీసుకుంది.

ఫ్యాన్‌ ఐడీలు కలిగిన విదేశీ అభిమానులు వీసా లేకుండానే ఈ ఏడాది మొత్తం ఎన్నిసార్లైనా రష్యాలో పర్యటించొచ్చని పుతిన్‌ అధికారిక ప్రకటన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఫిఫా వరల్డ్‌కప్ ఫోటీలను నిర్వహించినందుకు గర్వపడుతున్నామని అన్నారు. ఫిఫా వరల్డ్‌కప్‌ను విజయవంతంగా నిర్వహించినందుకు పలు దేశాలు రష్యాను సైతం అభినందించాయి.

టోర్నీలో భాగంగా ఆదివారం మాస్కోలోని లుజ్నికి స్టేడియంలో జరిగిన ఫైనల్‌లో క్రొయేషియాపై ఫ్రాన్స్‌ 4-2 తేడాతో విజయం సాధించి 20 ఏళ్ల తర్వాత ట్రోఫీ గెలుచుకున్న సంగతి తెలిసిందే. ఈ ఫైనల్‌ మ్యాచ్‌కి రష్యా అధ్యక్షుడు పుతిన్‌, ఫ్రాన్స్‌ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్‌ మెక్రాన్‌, క్రోయేషియా అధ్యక్షురాలు కొలిండా గ్రాబర్‌ హాజరయ్యారు.

Story first published: Monday, July 16, 2018, 14:27 [IST]
Other articles published on Jul 16, 2018
-
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+