Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

ఘోర అవమానం: నెయ్‌మార్ జట్టుకు గుడ్లు, రాళ్లతో స్వాగతం (వీడియో)

Video: Brazil fans attack team bus after World Cup return

హైదరాబాద్: రష్యా వేదికగా జరిగిన ఫిఫా వరల్డ్‌కప్‌ క్వార్టర్ ఫైనల్లో ఓటమిపాలై స్వదేశానికి చేరుకున్న బ్రెజిల్ పుట్‌బాల్ జట్టుకు ఘోర అవమానం ఎదురైంది. స్వదేశం చేరుకున్న ఆటగాళ్లకు అభిమానులు రాళ్లు, గుడ్లతో స్వాగతం పలికారు. బెల్జియంతో జరిగిన క్వార్టర్ ఫైనల్లో బ్రెజిల్ ఓడిపోయి టోర్నీ నుంచి నిష్క్రమించింది.

వరల్డ్ కప్‌లో ఏరోజు ఏమ్యాచ్ | వరల్డ్ కప్‌ 2018 పాయింట్ల పట్టిక | వరల్డ్ కప్ 2018 పూర్తి షెడ్యూల్

ఈ ఓటమిని జీర్ణించుకోలేని బ్రెజిల్‌ అభిమానలు తమ జట్టుకు గుడ్లతో దాడి చేసి స్వాగతం పలికారు. ఆటగాళ్లు ప్రయాణిస్తున్న బస్సుపై కోడిగుడ్లు, రాళ్లతో దాడి చేసిన అభిమానులు బస్సును ముందుకు కదలకుండా అడ్డుకున్నారు. దీంతో రంగంలోకి దిగిన భద్రతా సిబ్బంది నచ్చజెప్పే ప్రయత్నం చేశారు.

అయినప్పటికీ అభిమానులను వారి ఆందోళలను కొనసాగించారు. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తోంది. బ్రెజిల్ పుట్‌బాల్‌కి పెట్టింది పేరు. పీలే, రొనాల్డో, గ్యారించా, జికో, రొమారియో, సోక్రటీస్ లాంటి మాజీ దిగ్గజ ప్లేయర్లు బ్రెజిల్‌కు ప్రాతినిథ్యం వహించారు. అంతేకాదు నాలుగేళ్లకొకసారి జరిగే ఫిఫా వరల్డ్ కప్‌లో ఐదు సార్లు బ్రెజిల్ టైటిల్ విజేతగా నిలిచింది.

Story first published: Tuesday, July 10, 2018, 14:07 [IST]
Other articles published on Jul 10, 2018
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+