Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

FIFA World Cup 2026: కన్నీటి పర్యంతమైన మ్యాచ్ రిఫరీ!

ఫిఫా ప్రపంచకప్-2026 టోర్నీ ప్రారంభానికి ముందే వివాదాలకు కేరాఫ్ అడ్రస్‌గా నిలుస్తోంది. ఇప్పటికే ఇరాన్ ఆటగాళ్ల వీసాల ఆలస్యం, నిరసనలతో ఫిఫా ప్రపంచకప్ పరువు మసకబారగా.. తాజాగా సోమాలియా మ్యాచ్ రిఫరీ కన్నీటిపర్యంతమవ్వడం టోర్నీ ప్రతిష్టను మరింత దిగజార్చింది.

ఫుట్‌బాల్ ప్రపంచకప్‌లో మ్యాచ్ రిఫరీగా వ్యవహరించి.. ఆ ఘనత సాధించిన తొలి సోమాలియా వ్యక్తిగా చరిత్ర సృష్టించాలనుకున్న ఒమర్ అబ్దుల్కాదిర్ అర్తాన్‌కు ఘోర అవమానం ఎదురైంది. అన్ని సరైన పత్రాలు, వీసా ఉన్నప్పటికీ అమెరికా ఇమ్మిగ్రేషన్ అధికారులు దేశంలోకి అనుమతించలేదు. ఈ పరిణామంతో తీవ్ర దిగ్భ్రాంతికి లోనైన అర్తాన్, తన జీవితకాల కల ముక్కలైందంటూ కన్నీటిపర్యంతమయ్యారు.

Very Disappointed Somali Referee Omar Abdulkadir Artan Speaks Out After World Cup 2026 Entry Denial

వేటు వేసిన ఫిఫా

మరోవైపు అతనికి అండగా నిలవాల్సిన ఫిఫా నిర్వాహకులు చేతులెత్తేసారు. వరల్డ్‌కప్ టోర్నమెంట్‌లో విధులు నిర్వహించాల్సిన మ్యాచ్ అఫిషియల్స్ జాబితా నుంచి అర్తాన్‌ను తొలగిస్తున్నట్లు అంతర్జాతీయ ఫుట్‌బాల్ సమఖ్య (FIFA) అధికారికంగా ధృవీకరించింది. మయామి అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకున్న అర్తాన్‌ను యూఎస్ అధికారులు దేశంలోకి అనుమతించకపోవడమే ఇందుకు కారణమని పేర్కొంది.

ఈ విషయమై సోమాలియా క్రీడా మంత్రిత్వ శాఖ స్పందిస్తూ.. అర్తాన్ సరైన వీసా, అధికారిక పత్రాలతోనే ప్రయాణించారని స్పష్టం చేసింది. అయితే, డొనాల్డ్ ట్రంప్ పరిపాలనలో సోమాలియా వంటి కొన్ని దేశాలపై విధించిన కఠినమైన ప్రయాణ ఆంక్షలే ఇందుకు కారణమని భావిస్తున్నప్పటికీ, అమెరికా అధికారులు ఈ ఘటనపై ఎలాంటి వివరణ ఇవ్వలేదు.

FIFA World Cup 2026: రేపటి నుంచే ఫిఫా వరల్డ్ కప్.. ఎప్పుడు స్టార్ట్? ఎక్కడ చూడాలి?

FIFA World Cup 2026: రేపటి నుంచే ఫిఫా వరల్డ్ కప్.. ఎప్పుడు స్టార్ట్? ఎక్కడ చూడాలి?

మయామి ఎయిర్‌పోర్టులో 11 గంటల నరకం

మయామి విమానాశ్రయంలో తనకు ఎదురైన చేదు అనుభవాన్ని అర్తాన్ 'న్యూయార్క్ టైమ్స్' పత్రికతో పంచుకుంటూ ఆవేదన వ్యక్తం చేశారు. 'ఇమ్మిగ్రేషన్ అధికారులు నన్ను దాదాపు 11 గంటల పాటు సుదీర్ఘంగా ప్రశ్నించారు. ఆ తర్వాత ఒక హోల్డింగ్ సెల్‌లో బంధించి, ఇస్తాంబుల్ (టర్కీ) వెళ్లే విమానం ఎక్కించి వెనక్కి పంపించేశారు. నా పత్రాల్లో ఎలాంటి లోపం ఉందని వారు చెప్పలేదు.'అని అర్తాన్ పేర్కొన్నారు.

'నేను తీవ్ర నిరాశకు గురయ్యాను. నా జీవితంలో అతిపెద్ద కల అయిన ప్రపంచకప్‌లో పాల్గొనాలని ఆశపడిన ఒక సాధారణ రెఫరీని మాత్రమే నేను. నా దగ్గర సరైన వీసా, అన్ని ఆధారాలు ఉన్నాయి. కానీ నా కలలను కాలరాశారు' అని ఆయన భావోద్వేగానికి గురయ్యారు.

ఈ ఘటనపై ఫిఫా స్పందిస్తూ.. ఆతిథ్య దేశాల ఇమ్మిగ్రేషన్ ప్రక్రియలు లేదా వీసా నిర్ణయాల్లో తాము జోక్యం చేసుకోలేమని, ప్రస్తుతానికి అర్తాన్ స్థితిలో ఎలాంటి మార్పు ఉండబోదని స్పష్టం చేసింది. దీంతో 2026 ప్రపంచకప్‌లో అంపైరింగ్ చేయాలనే అర్తాన్ ఆశలు అడియాశలయ్యాయి.

అమెరికా గడ్డపై ఇరాన్ ఆటగాళ్ల వినూత్న నిరసన.. ఆ నెంబర్ వెనుక గుండెకోత!

అమెరికా గడ్డపై ఇరాన్ ఆటగాళ్ల వినూత్న నిరసన.. ఆ నెంబర్ వెనుక గుండెకోత!
Story first published: Wednesday, June 10, 2026, 15:31 [IST]
Other articles published on Jun 10, 2026
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+