FIFA World Cup 2026: ప్రి-క్వార్టర్స్‌కు దూసుకెళ్లిన అమెరికా!
ఫిఫా ప్రపంచకప్ 2026 టోర్నీలో ఆతిథ్య అమెరికా దుమ్మురేపుతోంది. గురువారం తెల్లవారుజామున జరిగిన నాకౌట్ పోరులో అమెరికా 2-0 తేడాతో బోస్నియా-హెర్జెగోవినాపై విజయం సాధించింది. ఈ గెలుపుతో అమెరికా ప్రి-క్వార్టర్ ఫైనల్‌కు దూసుకెళ్లగా.. బోస్నియా టోర్నీ నుంచి నిష్క్రమించింది. ప్రి-క్వార్టర్‌లో అమెరికా జట్టు బెల్జియంతో తలపడనుంది.
హీరో నుంచి విలన్‌గా మారిన బాలోగన్
మ్యాచ్ ఆరంభం నుంచి ఇరు జట్లు హోరాహోరీగా తలపడ్డాయి. ఆట 45వ నిమిషంలో మాలిక్ టిల్‌మన్ అందించిన అద్భుతమైన పాస్‌ను అందుకున్న ఫోలరిన్ బాలోగన్ బంతిని గోల్ పోస్ట్‌లోకి పంపి అమెరికాకు 1-0 ఆధిక్యాన్ని అందించాడు. అయితే, 2006 ప్రపంచకప్ ఫైనల్లో ఫ్రాన్స్ దిగ్గజం జినెదిన్ జిదానే తర్వాత ఒకే నాకౌట్ మ్యాచ్‌లో గోల్ కొట్టి, రెడ్ కార్డ్ పొందిన ఆటగాడిగా బాలోగన్ నిలిచాడు.

ఆట 64వ నిమిషంలో బోస్నియా డిఫెండర్ ముహారెమోవిచ్‌ను వెనుక నుండి సవాలు చేస్తూ ఫౌల్ చేయడంతో, VAR సమీక్ష అనంతరం రెఫరీ బాలోగన్‌కు నేరుగా రెడ్ కార్డ్ చూపించి మైదానం బయటకు పంపారు.
టిల్‌మన్ అద్భుత ఫ్రీ-కిక్
బాలోగన్ నిష్క్రమణతో అమెరికా 10 మంది సభ్యులతోనే ఆటను కొనసాగించింది. అయినా ఏమాత్రం పట్టు సడలించలేదు. ఆట చివర్లో (85వ నిమిషంలో) లభించిన ఫ్రీ-కిక్ అవకాశాన్ని మాలిక్ టిల్‌మన్ అద్భుతమైన గోల్‌గా మలిచాడు. బోస్నియా డిఫెండర్ల గోడను దాటుకుంటూ వెళ్లిన బంతి నెట్‌ను తాకడంతో అమెరికా విజయం ఖాయమైంది. 1994లో ఎరిక్ వినాల్డా తర్వాత ప్రపంచకప్‌లో డైరెక్ట్ ఫ్రీ-కిక్ ద్వారా గోల్ చేసిన రెండో అమెరికన్ ఆటగాడిగా టిల్‌మన్ రికార్డు సృష్టించాడు.
రికార్డుల వేటలో అమెరికా
మౌరిసియో పోచెట్టినొ పర్యవేక్షణలోని అమెరికా జట్టుకు ఈ ప్రపంచకప్‌లో ఇది మూడో విజయం. ఒకే టోర్నీలో అమెరికా ఇన్ని విజయాలు సాధించడం ఇదే తొలిసారి. అంతేకాకుండా, 2002లో మెక్సికోపై గెలిచిన తర్వాత ప్రపంచకప్ నాకౌట్ మ్యాచ్‌లో అమెరికా విజయం సాధించడం కూడా మళ్లీ ఇప్పుడే కావడం విశేషం. బోస్నియా జట్టుకు ఎక్కువ అవకాశాలు లభించినప్పటికీ (10 షాట్లు), గోల్స్ చేయడంలో ఆ జట్టు విఫలమవడంతో పరాజయం తప్పలేదు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications

