Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

2026 ఫిఫా వరల్డ్‌కప్‌: ఆతిథ్య హక్కులను దక్కించుకున్న అమెరికా, కెనడా, మెక్సికో

USA, Canada and Mexico to host FIFA World Cup 2026

హైదరాబాద్: 2026లో జరిగే ఫిఫా వరల్డ్ కప్‌కు అమెరికా, కెనడా, మెక్సికో దేశాలు సంయుక్తంగా ఆతిథ్యమివ్వనున్నాయి. ఈ మేరకు ఫిఫా బుధవారం అధికారిక ప్రకటన చేసింది. 2026 వరల్డ్ కప్ కోసం నిర్వహించిన బిడ్డింగ్ ప్రక్రియలో మొదటి నుంచి ఈ మూడు దేశాలు పేవరేట్‌గా బరిలో నిలిచాయి.

వరల్డ్ కప్‌లో ఏరోజు ఏమ్యాచ్ | వరల్డ్ కప్‌ 2018 పాయింట్ల పట్టిక | వరల్డ్ కప్ 2018 పూర్తి షెడ్యూల్

అయితే, మధ్యలో ఈ బిడ్డింగ్ ప్రక్రియను వివాదం చుట్టుముట్టింది. మొరాకోకి మద్దుతుగా అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ రంగంలోకి దిగి రాజకీయాలు చేస్తున్నారని వార్తలు అప్పట్లో వచ్చాయి. చివరకు ఈ బిడ్డింగ్ ప్రక్రియలో అమెరికా, కెనడా, మెక్సికో దేశాలకు 134 ఓట్లు రాగా... మొరాకోకు కేవలం 65 ఓట్లు మాత్రమే వచ్చాయి.

దీంతో ఈ బిడ్డింగ్ ప్రక్రియలో ఈ మూడు దేశాలు విజయం సాధించి 2026 ఫిఫా వరల్డ్ కప్‌కు ఆతిథ్యమిచ్చే అర్హతను సాధించాయి. ఈ ఓటింగ్‌ ప్రక్రియలో ఆఫ్రికాకు చెందిన కొన్ని దేశాలు అమెరికాకు మద్దతుగా నిలిచాయి. ఈ ఓటింగ్ ప్రక్రియలో స్పెయిన్ పాల్గొనక పోవడం విశేషం.

బిడ్డింగ్ ప్రక్రియలో మొరాకో ఫిఫా ఆతిథ్య హక్కులను దక్కించుకుంటే అది 'హై రిస్క్' తో కూడుకున్నదని ఫిఫా తన నివేదికలో పేర్కొంది. ముఖ్యంగా ఫిఫా వరల్డ్ కప్ కోసం వసతులు, స్టేడియాల అందుబాటుపై కూడా మిగతా సభ్యదేశాలు మొరాకో విషయంలో విముఖత వ్యక్తం చేశాయి.

చివరిసారిగా అమెరికా 1994లో ఫిఫా వరల్డ్ కప్ టోర్నీకి ఆతిథ్యమిచ్చింది. ఇక, మెక్సికో విషయానికి వస్తే రెండుసార్లు(1986, 1970) ఆతిథ్యమిచ్చింది. 2026లో జరిగే ఫిఫా వరల్డ్ కప్‌లో మొత్తం 80 మ్యాచ్‌లు జరగనుండగా... 60 మ్యాచ్‌లకు అమెరికా ఆతిథ్యమిస్తే... మెక్సికో, కెనడా చెరో 10 మ్యాచ్‌లకు ఆతిథ్యమిస్తాయి.

ప్రస్తుతం రష్యా వేదికగా 2018 వరల్డ్ కప్ జరగనుండగా, 2022 వరల్డ్ కప్‌ ఆతిథ్య హక్కులను కతార్ దక్కించుకున్న సంగతి తెలిసిందే. 2022 వరల్డ్ కప్ కోసం కతార్ ఇప్పటి నుంచే ఏర్పాట్లను సిద్ధం చేస్తోంది.

Story first published: Wednesday, June 13, 2018, 18:28 [IST]
Other articles published on Jun 13, 2018
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+