Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

రెండో పిన్న వయస్కుడు: 60 ఏళ్ల పీలే రికార్డుని సమం చేసిన ఎంబాపె

FIFA World Cup 2018: Kylian Mbappe emerges on world stage as Lionel Messi departs
The new Pele? Mbappe matches Brazil greats 60-year-old World Cup record

హైదరాబాద్: కైలిన్‌ ఎంబాపె... ప్రపంచవ్యాప్తంగా మార్మోగుతున్న పేరు. అర్జెంటీనాతో మ్యాచ్‌ ముందు వరకు కైలిన్‌ ఎంబాపె గురించి బహుశా ఎవరికి తెలియకపోవచ్చు. కానీ, అర్జెంటీనాతో జరిగిన మ్యాచ్‌లో నాలుగు నిమిషాల వ్యవధిలో రెండు గోల్స్‌ చేసి ఫ్రాన్స్‌‌ను వరల్డ్ కప్ క్వార్టర్‌ ఫైనల్‌కు చేర్చడంలో కీలకపాత్ర పోషించాడు.

వరల్డ్ కప్‌లో ఏరోజు ఏమ్యాచ్ | వరల్డ్ కప్‌ 2018 పాయింట్ల పట్టిక | వరల్డ్ కప్ 2018 పూర్తి షెడ్యూల్

వరల్డ్ కప్ టోర్నీలో భాగంగా శనివారం అర్జెంటీనాతో జరిగిన నాకౌట్‌ పోరులో ఫ్రాన్స్‌ 4-3 తేడాతో విజయం సాధించింది. కీలక మ్యాచ్‌లో రెండు గోల్స్‌ చేసి జట్టు విజయంలో కీలకపాత్ర పోషించడంతో పాటు కైలిన్‌ ఎంబాపె మరో అరుదైన ఘనతను సొంతం చేసుకున్నాడు. ఒక వరల్డ్‌కప్ మ్యాచ్‌లో రెండు గోల్స్‌ చేసిన రెండో పిన్న వయస్కుడిగా రికార్డు సృష్టించాడు.

పుట్‌బాల్ దిగ్గజం పీలే (17 సంవత్సరాల 8 నెలల 6 రోజులకు) ఫిపా ప్రపంచకప్‌లో ఒక మ్యాచ్‌లో రెండు గోల్స్‌ చేసిన అతి చిన్న వయస్కుడిగా తొలి స్థానంలో ఉన్నాడు. 1958లో జరిగిన వరల్డ్ కప్‌ ఫైనల్‌ మ్యాచ్‌లో స్వీడన్‌పై రెండు గోల్స్‌ చేసి పీలే ఈ ఘనత సాధించాడు.

60 సంత్సరాల అనంతరం ఫ్రాన్స్‌ ఆటగాడు కైలిన్‌ ఎంబాపె (19 సంవత్సరాల 6 నెలల 10 రోజులు) అర్జెంటీనాపై రెండు గోల్స్‌ చేయడంతో అత్యంత చిన్న వయసులో ఈ ఘనత సాధించిన రెండో ఆటగాడిగా రికార్డు నెలకొల్పాడు. అర్జెంటీనా- ఫ్రాన్స్‌ మ్యాచ్‌ అనంతరం ఎంబాపెకు ట్విటర్‌ ద్వారా పీలే అభినందనలు కూడా తెలిపాడు.

Story first published: Monday, July 2, 2018, 15:54 [IST]
Other articles published on Jul 2, 2018
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+