Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

మెస్సీతో పోరు.. సీఎం రేవంత్ రెడ్డి ప్రాక్టీస్ షురూ!

ఫుట్‌బాల్ దిగ్గజం, అర్జెంటీనా స్టార్ లియోనల్ మెస్సీ‌తో తలపడేందుకు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి సిద్దమవుతున్నారు. డిసెంబర్ 13న హైదరాబాద్‌లోని రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియంలో జరగనున్న 7vs7 ఎగ్జిబిషన్‌ ఫ్రెండ్లీ మ్యాచ్‌లో మెస్సీకి ప్రత్యర్థిగా రేవంత్ రెడ్డి ఫుట్‌బాల్ ఆడనున్న సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్‌లో తెలంగాణ సర్కార్ బడులకు చెందిన విద్యార్థుల జట్టుకు సీఎం రేవంత్ రెడ్డి సారథ్యం వహించనున్నారు.

ఈ మ్యాచ్ కోసం సీఎం రేవంత్ రెడ్డి ప్రాక్టీస్ మొదలు పెట్టారు. ఇందుకోసం మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల కేంద్రంలోని ఫుట్‌బాల్ గ్రౌండ్‌లో ఆయన ప్రాక్టీస్ ప్రారంభించారు. సీఎంగా రోజంతా ఉన్న కార్యక్రమాలు ముగించుకుని ఆదివారం రాత్రి ఫుట్ బాల్ ఆటగాళ్లతో కలసి మైదానంలోకి దిగారు.ప్రొఫెషనల్ ఫుట్‌బాల్ ప్లేయర్లతో కలిసి‌ మ్యాచ్ ఆడారు. సుమారు గంటపాటు ప్రాక్టీస్ చేశారు.

ఫుట్‌బాల్ దిగ్గజం లియోనల్ మెస్సీ వర్సెస్ సీఎం రేవంత్ రెడ్డి మ్యాచ్‌‌పై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఈ మ్యాచ్‌కు సంబంధించిన టికెట్లు జొమాటో డిస్ట్రిక్ట్ యాప్‌లో శుక్రవారం(నవంబర్ 28) నుంచి అందుబాటులోకి వచ్చాయి. ఈ మ్యాచ్ టికెట్ల ధరలు రూ. 1700 నుంచి మొదలవుతాయి.

Telangana CM Revanth Reddy Gears Up for Lionel Messi s Friendly Match at Uppal Stadium on December 13

మెస్సీతో కలిసి టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ, కెప్టెన్ శుభ్‌మన్ గిల్ కూడా హైదరాబాద్ రానున్నట్లు ఈవెంట్ ఆర్గనైజర్స్ ప్రకటించారు. మెస్సీతో కలిసి కోహ్లీ, శుభ్‌మన్ గిల్ కూడా ఫ్రెండ్లీ ఎగ్జిబిషన్ మ్యాచ్ ఆడనున్నారని తెలిపారు. దిగ్గజ ఆటగాళ్లను చూసేందుకు ఇది మంచి అవకాశామని పేర్కొన్నారు.

డిసెంబర్ 13-15 వరకు మెస్సీ భారత్‌లో పర్యటించనున్నాడు. డిసెంబర్ 13 ఉదయం కోల్‌కతా ఈడెన్ గార్డెన్స్‌‌కు వెళ్లనున్న మెస్సీ.. అదే రోజు సాయంత్రం హైదరాబాద్‌కు వస్తారు. డిసెంబర్ 14 సాయంత్రం ముంబైలోని వాంఖడే స్టేడియానికి వెళ్తారు. డిసెంబర్ 15 మధ్యాహ్నం ఒంటి గంటకు ఢిల్లీలోకి అరుణ్‌జైట్లీ స్టేడియాన్ని సందర్శిస్తారు. ఇప్పటికే ఈ పర్యటనపై మెస్సీ సోషల్ మీడియా వేదికగా ఓ పోస్ట్ పెట్టాడు.

Telangana CM Revanth Reddy Gears Up for Lionel Messi s Friendly Match at Uppal Stadium on December 13

తెలంగాణ రైజింగ్' కార్యక్రమానికి లియోనెల్ మెస్సీని బ్రాండ్ అంబాసీడర్‌గా నియమించాలనే యోచనలో తెలంగాణ ప్రభుత్వం ఉన్నట్లు తెలుస్తోంది. ఈ కార్యక్రమం ద్వారా క్రీడలు, పర్యాటకం, పెట్టుబడుల ప్రోత్సాహం, యువత భాగస్వామ్యం వంటి విషయాలను ప్రపంచవ్యాప్తంగా చాటిచెప్పాలని ప్రభుత్వం భావిస్తోంది. సీఎం రేవంత్ రెడ్డి ఫుట్‌బాల్ అత్యంత ఇష్టమైన క్రీడ. తాను చదువుకునే రోజుల్లో ఫుట్‌బాల్ ఎక్కువగా ఆడేవారు. మెస్సీ రాకతో స్పోర్ట్స్ హబ్‌‌గా హైదరాబాద్‌కు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు లభిస్తుందని సీఎం భావిస్తున్నారు.

Telangana CM Revanth Reddy Gears Up for Lionel Messi s Friendly Match at Uppal Stadium on December 13
Story first published: Monday, December 1, 2025, 10:50 [IST]
Other articles published on Dec 1, 2025
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+