Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

FIFA World Cup 2026: ఆఖరి నిమిషంలో అగ్రరాజ్యం అమెరికాను ఓడించిన టర్కీ!

ఫిఫా ప్రపంచకప్ 2026 టోర్నీలో ఆతిథ్య అమెరికా జోరుకు బ్రేక్ పడింది. లాస్ ఏంజెల్స్ వేదికగా శుక్రవారం తెల్లవారుజామున జరిగిన గ్రూప్-డీ మ్యాచ్‌లో టర్కీ 3-2 గోల్స్ తేడాతో అమెరికాను ఓడించింది. హోరాహోరీగా సాగిన ఈ మ్యాచ్‌లో చివరి నిమిషంలో కాన్ ఐహాన్ కొట్టిన విన్నింగ్ గోల్‌తో టర్కీ చిరస్మరణీయమైన విజయాన్ని అందుకుంది.

9 మార్పులతో..

గ్రూప్-డి లో ఇప్పటికే అగ్రస్థానాన్ని ఖరారు చేసుకున్న యూఎస్‌ఏ.. ఏకంగా 9 మార్పులతో ఈ మ్యాచ్‌ ఆడింది. మ్యాచ్ ప్రారంభమైన 3వ నిమిషంలోనే యూఎస్‌ఏ డిఫెండర్ ఆస్టన్ ట్రస్టీ హెడర్ ద్వారా గోల్ కొట్టి జట్టుకు 1-0 ఆధిక్యాన్ని అందించాడు. వరల్డ్ కప్ చరిత్రలోనే యూఎస్‌ఏ తరపున నమోదైన రెండో వేగవంతమైన గోల్ ఇది.

IPL 2027: ఢిల్లీ క్యాపిటల్స్‌లోకి రీఎంట్రీ.. రిషభ్ పంత్ రియాక్షన్ ఇదే!

IPL 2027: ఢిల్లీ క్యాపిటల్స్‌లోకి రీఎంట్రీ.. రిషభ్ పంత్ రియాక్షన్ ఇదే!

అయితే, టర్కీ కూడా గోల్ కోసం ఎక్కువసేపు వేచి చూడలేదు. 10వ నిమిషంలోనే టర్కీ యువ స్టార్ అర్ధ గులెర్ అద్భుతమైన లెఫ్ట్-ఫుట్ ఫినిషింగ్‌తో స్కోరును 1-1తో సమం చేశాడు. టోర్నీలో టర్కీకి ఇదే మొదటి గోల్. ఆ తర్వాత 31వ నిమిషంలో ఓర్కున్ కోక్చు కొట్టిన షాట్ బారిస్ అల్పెర్ యిల్మాజ్ మోకాలికి తగిలి గోల్‌గా మారడంతో టర్కీ 2-1 ఆధిక్యంలోకి వెళ్లింది.

T rkiye Exits FIFA World Cup 2026 in Style with Thrilling 3-2 Stunner Over USA

ఇంజూరీ టైమ్‌లో గోల్..

సెకండాఫ్ ఆరంభంలోనే 49వ నిమిషంలో యూఎస్‌ఏ ఆటగాడు సెబాస్టియన్ బెర్‌హాల్టర్ హాఫ్-వాలీ షాట్‌తో గోల్ కొట్టి స్కోరును 2-2తో సమం చేశాడు. ఆ తర్వాత గాయం నుంచి కోలుకుని మైదానంలోకి వచ్చిన యూఎస్‌ఏ స్టార్ ప్లేయర్ క్రిస్టియన్ పులిసిచ్‌కు రెండు సువర్ణ అవకాశాలు వచ్చినప్పటికీ, టర్కీ గోల్ కీపర్ ఉగుర్కాన్ కాకిర్ వాటిని అడ్డుకున్నాడు.

మ్యాచ్ 'డ్రా' వైపు సాగుతున్న సమయంలో, ఇంజూరీ టైమ్ 98వ నిమిషంలో టర్కీ డిఫెండర్ కాన్ ఐహాన్ పర్ఫెక్ట్ ప్లానింగ్‌తో బంతిని గోల్ పోస్ట్‌లోకి నెట్టి టర్కీకి 3-2తో అద్భుత విజయాన్ని అందించాడు.

IPL 2027: సన్‌రైజర్స్ హైదరాబాద్‌లోకి సీఎస్కే స్టార్ స్పిన్నర్?

IPL 2027: సన్‌రైజర్స్ హైదరాబాద్‌లోకి సీఎస్కే స్టార్ స్పిన్నర్?

ఓడినా అమెరికా రికార్డ్..

ఈ టోర్నీలో ఇప్పటివరకు యూఎస్‌ఏ కొట్టిన 8 గోల్స్, ఒకే వరల్డ్ కప్ ఎడిషన్‌లో ఆ జట్టు సాధించిన అత్యధిక గోల్స్ ఇవే కావడం విశేషం. యూఎస్‌ఏ జట్టుకు యూరోపియన్ జట్లపై ఉన్న పేలవ రికార్డ్ ఈ మ్యాచ్‌లోనూ కొనసాగింది. గత 20 మ్యాచ్‌ల్లో అమెరికా ఒకే ఒక్క విజయం సాధించింది.

ఈ మ్యాచ్‌లో ఓడినప్పటికీ యూఎస్‌ఏ గ్రూప్ టాపర్‌గా నిలిచింది. రౌండ్ ఆఫ్-32 (లాస్ట్-32) నాకౌట్ మ్యాచ్‌లో యూఎస్‌ఏ బోస్నియా-హెర్జెగోవినాతో తలపడనుంది.

Story first published: Friday, June 26, 2026, 12:30 [IST]
Other articles published on Jun 26, 2026
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+