Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

కొలంబియా ఔట్.. క్వార్టర్స్‌కు స్విట్జర్లాండ్!

ఫిఫా ప్రపంచకప్ 2026 టోర్నీలో స్విట్జర్లాండ్ దుమ్మురేపుతోంది. వాంకోవర్‌లోని బిసి ప్లేస్ స్టేడియంలో బుధవారం తెల్లవారు జామున జరిగిన ప్రిక్వార్టర్ మ్యాచ్‌లో షూటౌట్‌లో స్విట్జర్లాండ్ 4-3 తేడాతో కొలంబియాను ఓడించింది.

నిర్ణీత 90 నిమిషాలతో పాటు ఎక్స్‌ట్రా టైమ్ ముగిసేసరికి ఇరు జట్లు ఒక్క గోల్ కూడా చేయకపోవడంతో పెనాల్టీ షూటౌట్ ద్వారా మ్యాచ్ ఫలితాన్ని తేల్చారు. స్విస్ గోల్ కీపర్ గ్రెగర్ కోబెల్ అడ్డుగోడలా నిలిచి విజయంలో కీలక పాత్ర పోషించాడు. ఈ గెలుపుతో స్విట్జర్లాండ్ క్వార్టర్ ఫైనల్లో డిఫెండింగ్ ఛాంపియన్ అర్జెంటీనాతో తలపడటానికి సిద్ధమైంది.

Switzerland 0-0 Colombia 4-3 Pens Kobel Heroics in Shoot-Out Set Up Mouth-Watering Argentina Quarter-Final

హోరాహోరీ పోరు..

మ్యాచ్ ఆరంభం నుంచి ఇరు జట్లు నువ్వా-నేనా అన్నట్లు తలపడ్డాయి. డిఫెన్స్‌కే ప్రాధాన్యతనిచ్చాయి. మ్యాచ్ 21వ నిమిషంలో కొలంబియా ప్లేయర్ గుస్తావో ప్యూర్టా చేసిన గోల్ ప్రయత్నాన్ని స్విస్ గోల్ కీపర్ గ్రెగర్ కోబెల్ అద్భుతంగా అడ్డుకున్నాడు. మరోవైపు స్విట్జర్లాండ్ ఆటగాళ్లు ఫాబియన్ రీడర్, డాన్ ఎన్డోయ్ కొలంబియా గోల్ పోస్ట్‌పై దాడి చేసినప్పటికీ ప్రత్యర్థి కీపర్ కామిలో వర్గాస్ వాటిని సమర్థవంతంగా తిప్పికొట్టాడు.

సెకండాఫ్‌లోనూ ఇరు జట్లు గోల్ చేయడానికి తీవ్రంగా శ్రమించినా ఫలితం దక్కలేదు. ఈ టోర్నీలోనే అత్యంత తక్కువ ఎక్స్‌పెక్టెడ్ గోల్స్ (0.7 xG) నమోదైన మ్యాచ్‌గా ఇది నిలిచింది.

గట్టెక్కిన అర్జెంటీనా.. పోరాడి ఓడిన ఈజిప్ట్

గట్టెక్కిన అర్జెంటీనా.. పోరాడి ఓడిన ఈజిప్ట్

ఎక్స్‌ట్రా టైమ్‌లో కొలంబియా జోరు

నిర్ణీత సమయం ముగిసేసరికి స్కోరు 0-0తో సమం కావడంతో ఎక్స్‌ట్రా టైమ్ ఆడించారు. ఈ అదనపు 30 నిమిషాల్లో కొలంబియా పూర్తిగా ఆధిపత్యం చెలాయించింది. జాన్ లుకుమి హెడర్ ద్వారా చేసిన గోల్ ప్రయత్నం క్రాస్‌బార్‌కు తగిలి వెనక్కి రాగా.. హామింటన్ కాంపాజ్ కొట్టిన షాట్‌ను స్విస్ కీపర్ కోబెల్ అద్భుతంగా ఆపాడు. 115వ నిమిషంలో కాంపాజ్‌కు లభించిన సువర్ణావకాశాన్ని గోల్ పోస్ట్‌కు పైగా కొట్టి వృధా చేయడంతో మ్యాచ్ పెనాల్టీ షూటౌట్‌కు దారితీసింది.

IND vs ENG: చిత్తుగా ఓడిన టీమిండియా..!

IND vs ENG: చిత్తుగా ఓడిన టీమిండియా..!

షూటౌట్‌లో కోబెల్ హీరో

పెనాల్టీ షూటౌట్‌లో కొలంబియా ఆటగాడు డెవిన్సన్ సాంచెజ్ కొట్టిన షాట్ క్రాస్‌బార్‌కు తగలగా.. స్విస్ ఆటగాడు మాన్యుయెల్ అకాంజీ కూడా గోల్ చేయడంలో విఫలమయ్యాడు. అయితే, చివరి క్షణాల్లో కొలంబియా స్టార్ కుచో హెర్నాండెజ్ వేసిన పెనాల్టీ కిక్‌ను స్విస్ కీపర్ గ్రెగర్ కోబెల్ అద్భుతంగా డైవ్ చేసి అడ్డుకున్నాడు. ఆ తర్వాత వచ్చిన స్విస్ సబ్‌స్టిట్యూట్ రూబెన్ వర్గాస్ బంతిని గోల్ పోస్ట్‌లోకి పంపి స్విట్జర్లాండ్‌కు 4-3తో చారిత్రాత్మక విజయాన్ని అందించాడు.

Story first published: Wednesday, July 8, 2026, 8:13 [IST]
Other articles published on Jul 8, 2026
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+