Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

'ఆటను ఆస్వాదిస్తున్నా.. ఇప్పట్లో రిటైర్మెంట్‌ ఆలోచనే లేదు'

Sunil Chhetri said Enjoying My Football, Not Going Away Anytime Soon

న్యూఢిల్లీ: ఫుట్‌బాల్‌ ఆడడాన్ని పూర్తిగా ఆస్వాదిస్తున్నానని, ఇప్పట్లో రిటైరయ్యే ఆలోచనే లేదని భారత పురుషుల జట్టు కెప్టెన్‌ సునీల్‌ ఛెత్రీ స్పష్టం చేశాడు. ప్రస్తుతం తన ఫిట్​నెస్ యువ ఆటగాళ్లకు దీటుగా ఉందని 35 ఏళ్ల ఛెత్రీ అన్నాడు. దాదాపు 15 ఏళ్లుగా జాతీయ జట్టు తరఫున ఆడుతున్న తాను మరో నాలుగేళ్లయినా ఆడతానని భారత కెప్టెన్ ధీమా వ్యక్తం చేసాడు. ప్రస్తుత ప్లేయర్లలో అత్యధిక అంతర్జాతీయ గోల్స్‌ చేసిన జాబితాలో అర్జెంటీనా స్టార్‌ మెస్సీ (70)ని అధిగమించి ఛెత్రీ (72) రెండో స్థానంలో ఉన్నాడు.

రిటైర్మెంట్‌ ఆలోచనే లేదు:

రిటైర్మెంట్‌ ఆలోచనే లేదు:

సునీల్‌ ఛెత్రీ గురువారం ఫేస్‌బుక్‌ లైవ్‌లో మాట్లాడుతూ... 'కచ్చితంగా ఇంతకాలం ఆడతానని చెప్పను. కానీ ఇప్పుడు నేను నా ఫుట్‌బాల్‌ను ఆస్వాదిస్తున్నా. ఇప్పట్లో మాత్రం ఆటకు దూరం కాను. చాలా ఫిట్‌గా ఉన్న భావనతో ఉన్నానని నా భార్యతో చెప్పా. పరుగులో ఉదాంత, ఆషిక్‌ (భారత జట్టు, బెంగళూరు ఎఫ్‌సీలో సహచరులు)లకు సవాలు విసరబోతున్నా. అబ్దుల్‌ సాహాల్‌ మరిన్ని గోల్స్‌ కొట్టి నన్ను తోసేస్తే (జాతీయ జట్టు నుంచి) తప్ప నేను జట్టు తరఫున ఆడుతూనే ఉంటా' అని 35 ఏళ్ల ఛెత్రీ స్పష్టం చేసాడు.

నేను కలలుగన్న జీవితంలో ఉన్నా:

నేను కలలుగన్న జీవితంలో ఉన్నా:

'దాదాపు 1 5ఏళ్లకు పైగా దేశం తరఫున ఆడుతుండడం నా అదృష్టం. మరో 3-4 ఏళ్లు ఆడితే 20 సంవత్సరాలు అవుతుంది. జాతీయ జట్టు తరఫున 20 ఏళ్లు ఆడగలరని ఎవరు అనుకుంటారు. ప్రస్తుతం నేను కలలుగన్న జీవితంలో ఉన్నాను. ఆటను బాగా ఆస్వాదిస్తున్నా. ఇప్పట్లో రిటైర్మెంట్‌ ఆలోచనే లేదు; అని ఛెత్రీ చెప్పాడు. 2005లో అరంగేట్రం చేసిన ఛెత్రీ భారత్‌ తరఫున 115 మ్యాచ్‌ల్లో 72 గోల్స్‌ కొట్టాడు.

 జాతి వివక్ష నన్ను బాధిస్తోంది:

జాతి వివక్ష నన్ను బాధిస్తోంది:

జాతి వివక్ష హానికరమైందని, అయితే తెలియకుండానే ఎక్కువ మంది ఆ తరహా వ్యాఖ్యలు చేస్తున్నారని సునీల్‌ ఛెత్రీ అన్నాడు. 'జాతి వివక్ష నన్ను బాధిస్తోంది. అయితే దాని గురించి తెలియకుండానే చాలా మంది జాత్యహంకార వ్యాఖ్యలు చేయడం కలవరపరిచే అంశం. జాతి వివక్ష వ్యాఖ్యలు చేసిన ఓ వ్యక్తిని పట్టుకుని.. అలా ఎందుకు అన్నావని అడిగితే తనకేం తెలియదని చెప్తాడు. రంగు, కులం, మతం పేరుతో తక్కువ చేసి చూడడం సరికాదు. అలా జరగకూడదు' అని ఛెత్రీ పేర్కొన్నాడు.

72 గోల్స్:

72 గోల్స్:

ఇప్పటి వరకు 115 అంతర్జాతీయ మ్యాచ్​లు ఆడిన ఛెత్రీ మొత్తం 72 గోల్స్ కొట్టాడు. ప్రస్తుతం ఆడుతున్న ఆటగాళ్లలో.. అత్యధిక అంతర్జాతీయ గోల్స్ చేసిన జాబితాలో రెండో స్థానంలో ఉన్నాడు. అగ్రస్థానంలో పోర్చుగల్ స్టార్ క్రిస్టియానో రొనాల్డో ఉంటే.. ఛెత్రీ తర్వాత ప్లేస్​లో అర్జెంటీనా మ్యాస్ట్రో లియోనెల్ మెస్సీ ఉన్నాడు.

లాక్‌డౌన్‌లో అలా చేయడాన్ని బాగా మిస్సవుతున్నా.. వీడియో షేర్‌ చేసిన రోహిత్!!

Story first published: Friday, June 12, 2020, 7:58 [IST]
Other articles published on Jun 12, 2020
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+